ఎంకి పోటు





ఎంకి పోటు
(A Damsel's Tide) 

వెన్నెల చీర
చుట్టుకుని 
చనుల
కుసుమాలు
దాచుకుని

గోధూళి
వర్ణంలో
మెరిసే
తెలుగు
గువ్వా

నీమొగ్గల
సిగ్గులు
నీసన్నని
కోనసీమ
పరువాలను


గోపీచంద్
నాయికలా
పంట కాలువలో
జలకాలాడి

శరదృతు
చందమామకు
ఆరపోస్తే

అటు పోట్లు
పొడిచేస్తే
విశాఖ
ఒడ్డులో

ఒంటరిగా
ఎదురు
చూసే
గుండెల్లో

రాదా
సునామీ
ఈ నవమీ
దశమీ

తుషార సంగమం




తుషార సంగమం
(Confluence of the Dew Droplets)

ఊపిరి సెగల్లో
ముంగురులు
ఎగిరిన 

వాయులీన
శ్వాసలో
మోముపై
పొగమంచులో

తడబడి నీరైన
సంపెంగ
బుగ్గల్లో
ఉదయపు తుషారాలు

రెండు
మంచు
బిందువులు

కరిగి
కలిస్తే ఒకే
ప్రేమ చినుకు
ఆ ఇద్దరు

బాబు ఏడ్చాడు ....



బాబు ఏడ్చాడు
(Sorrow of Achilles)  


అది కన్నీరో కాదో
కరిగిన దార్శనిక
జల ఏమో


నేత నిజంగా
ఏడ్చాడా
నేత అబద్దం గా
ఏడ్చాడా


నిజం గా ఏడిస్తే
మన తప్పే
బొంకుగా ఏడిస్తే
ఇంకా తప్పే


బొంకు కన్నీరుకు
ఓట్లు పడతాయని
నువ్వే చెప్పావా


అతడు కడిగిన
మడి కట్టిన
తెల్ల చీర కానీ కాదు


బొక్కలు పడిన
తెలుగు తల్లి
పైటి కోక


మలినమే
రాజకీయం
ఆ మట్టి
మన మట్టి
కరుడు కట్టి
కులం కోట కట్టి


రెడ్డో రావో అని
గుర్తు పెట్టుకునే
ఓటు మన్నే
కుళ్ళ గొట్టు


నాయకులు
నీకే అద్దాలు
సమాజ ఆలోచనల
ప్రతిధ్వనులు 

ఒకనాడు ఛాతి
చూపిన ఆంధ్రుడు
ఏడుస్తున్నాడు
నిజమో బొంకో అప్రస్తుతం


ఒకనాడు తెల్లదొరకు
ఛాతి చూపిన ఆంధ్రుడు
అమ్మావ్వని ధూషిస్తున్నాడు


మలినం రాసుకుని
లేఔట్లల్ల కటౌట్లు
కట్టుకుని ఓట్లలో
కుల బావన రుద్దితే

మిగిలేది ఇది
ఊరకుక్కల విస్తరి


బాబు ఏడ్చాడు
అది కన్నీరు కాదు
కరిగిన ఆంధ్ర దార్శనిక జల ఏమో


సమాధిలో  అయిష్టంగా
కదులుతున్నాడు
టంగుటూరి ప్రకాశం


నిఘంటువులు
వెతుకుతున్నాడు
కాటన్ దొర

మట్టి కాదో
మనుషులో
టెల్వక
గురజాడ నిజంగా
ఏడుస్తున్నారు
నిన్నే చూస్తున్నారు

కార్తీకం

పచ్చి ప్రేమ

..


పచ్చి ప్రేమకు

కచ్చితంగా

తెలీదు

 స్వేచ్ఛ గ

చనులు

దాచకుండా

ప్రియం చెయ్య కూడదని

కన్నుల రెప్పల పై

ముద్దుల వర్షం 

కురిపించే 

మమకారం

విశాల మైదానంలో

అర్థ రాత్రి

కార్తీక పూర్ణిమ వెల్తురులో

చెమటలు 

కలిసి

దివిసీమ

ఉప్పెనలా

మరువలేని

పెను తుఫాను

కలిసిన ఊపిరి

హోరు గాలి

రాత్రంతా

కురిసిన

గంధపువర్షం

నడుమొంపుల్లో

నయాగరా

జగనాఝఘన జలపాతాల్లో

నలిగిన

యూథికా నవమల్లిక 

నడు మొంపుల్లో

నీశ్వాశపు

మయికం

జల్లితే పచ్చి ప్రేమకు

కచ్చితంగా 

తెలీదు

పచ్చి ప్రేమ 

నేరమని



బడాయి

అంగడాయి

నువ్వు

తీసుకుంటే

గుండెల్లో

లడాయి

ముంగురులు

లహరాయి

గుంటా

నీకెంత

బడాయి

నెలవంకకు గ్రహణం పట్టింది

 పొడిచిన

నెలవంక కు

గ్రహణం

పట్టెనో

నాతో

కలవని

కన్నెరికం

నాకే

సొంతమా

అంకితమా


విరహ 

విషాద

మంటల్లో

తాపం 

కరగని


అరముహూర్తపు

వెన్నెల్లో

సాగరం

వెలగని


వెన్నెల్లో

తెరచాపకు

కుట్టు అల్లికలు

మన మనో

మల్లికల

విరహ

కవోష్ణ

సాన్ధ్ర

క్యుములోనింబస్

కోరికలు

నెలవంక కు

కొక్కెం వేసిన

వాంఛా

నిశ్రేణులు

కోమలి తో భీమిలి

ఇరుకు

సందుల్లో

సంద్రం 

చూసాను

ఉప్పుటేరు

భీమిలి

సంద్రం 

కలిసిన

ఉదృతి

చూసాను

వంశధార

పరవళ్లో

ఎంకి ఎద

తూరుపు

కనుమలలో

ఇది డిసెంబరు

సూర్యోదయమే

Submerged

చాలా రోజులకు

మెరిసిన కళ్ళు 

నేను కుశలం

అనుకున్నావే

కాదు

ప్రియతమా

అది విరహ

విచ్చేదిత 

ఆహ్లాదమే

దొరికీ దొరకని

కళ్ళ కాంతి

బింబాలు

నీ దూరపు

నిరీక్షణా

ద్వేషం లో

మునిగి

ప్రేమ

వాయువుల్లో

తేరిన

చివరి ప్రాణ

నిట్టూర్పులు

మాత్రమే

పది మార్కుల ప్రశ్న

ఆ రోజు

నీ ఆదృత

పెదాలను

ముద్దాడితే

తురాయి

మొక్కల

నీడలో

ఆ రోజు

నీ ఆశ్రిత

ఎదను

పోదివితే

గతపు

మల్లె పందిరి

కింద

ఈ రోజు

కురిసేదా

విరహం ?

ఎందుకు రాస్తారు మాస్టారు ?

జరగని

కలలకు

నిచ్చెన

మరో దినానికి

కవితల

వంతెన

మనసుకి

పొంతన

ఇరు మనసుల కు

స్వాంతన

అక్షర

లేపనం

తెలుగు పద

సన్నాహం

హెడ్స్ అండ్ టైల్స్

ద్వేషం

విరహ 

ద్వేషం

తురాయి

పంట లాగా

అరకు లోయ

ఒళ్లంతా

ఎర్రగా

పండిన

ద్వేషం

అటూ ఇటుగా

లీలగా 

నీ నేత్ర 

అజ గవ

వంపుల్లో

నేను 

ప్రతిబింబించని

కనులపయి

ద్వేషం

ఆటుగా

వచ్చిన

సాగరం

అభిమానం

పోటుగా

పోయినప్పుడు

ద్వేషం

బొమ్మ ప్రేమ

బొరుసు ద్వేషం

ఓంకారం

నిన్నటి

ప్రతిధ్వని 

భ్రాంతి 

రేపటి

మరీచిక

ఆశ

ప్రస్తుతం

అనాహిత నాద

శూన్యం

ఆచమనం

నీ కనుల రెప్పల పై ఆచమనం

నీ పెదవుల 

తడిలో ఆచమనం

నీ బుగ్గల మొగ్గల

తాంబూలం

నీ చన్నుల పొంకమునకు ఘాతోపచారం


ప్రియా భూః చుంబనం

ప్రియా భువః 

చుంబనం

ప్రియా సువః

చుంబనం


సఖీ మహః 

చుంబనం

సఖీ జనః 

చుంబనం


కమలే

తపః చుంబనం

కమలే

నాభీ చుంబనం


ప్రియా

తథ్సవితుర్వ రేణ్యం

ఇష్టా మందిరం


నోట్ : ప్రేయసిని ఎలా ఆరాధించాలి అని నేను రాస్తుంటే మన వాళ్ళు ఆల్రెడీ గాయత్రీ మంత్రం రాశారు. మన సంస్కృతిలోని భావం అనురాగం లలిత భావన అర్థం అవ్వాలి అంటే బాగా ప్రేమించాలి, ప్రేమతో ప్రార్థించాలి.









దీవెన

జడి జడి

వానల

అలికిడి

కనురెప్పల పై

చిన్ని చిన్ని

ముద్దుల

ఉక్కిరి

బిక్కిరి

వాడు 

టక్కరి

ఆమె

చక్కరి

పెంకుటింటి

చూరులో

ఇద్దరి

ఊపిరి

రాత్రంతా 

కురిసిన

తొలకరి

ఊరికి

వారిస్తారు

చంటి పాపాయిలు

తదుపరి

ఎండమావి

ఊపిరికి 

టైం

అడుగుతావు నువ్వు


ఊపిరి మొత్తం

పెదవుల్లో

పీల్చే

పిచ్చి

పచ్చి 

గుచ్చి

గుచ్చే

కంఠం పై

మచ్చ

ఇచ్చే

రచ్చ

నేను


తృప్తి కి ముందు

సమయం నీకు

తృప్తి వెనుక

త్రిశంకు స్వర్గం నాకు

మెలోడీ దగ్గర...

ఓ మై లేడీ

నీకోసం 

వెయిట్ చేస్తూ

తిన్నా పకోడీ

నీ వాడి

చూపుల్లో

పాగల్

ఖిలాడీ

హై హీల్స్లో

టక్కుమని

వగలాడీ

నీ కురచ

స్కర్టు తో

బిగాడీ

మళ్ళీ వస్తావా

మెలోడీ

గాజువాక పిల్లా...

కోరికల చిన్ని కోక

కట్టాక ఇందాక

బూరె బుగ్గల మందాక

పోతున్నావు ఎందాక ?


గిరజాలు గుంజాక

అసీల్ మెట్టలో

కుర్ర మూక 

కత్తిరిస్తా కపీ నీ తోక


మేము మెచ్చాకే

నీకు హొయలు

వచ్చాకే

నువ్వచ్చేది మా

కొంటె చూపుల చందాకే


నువ్వు నచ్చాకే

చిన్న కోక 

కట్టిందే నీకే 

ఎప్పుడు చెప్పిస్తావు మరి

ఇంట్లో ఓకే


అమ్మో నీ అయ్య సామ్యవాదం

లెనిన్ స్టాలిన్ తుపాకే

నీ అన్న ఇస్తాడు ఫ్యూనరల్ బొకే

నువ్వు రైటే

నేను 

శుద్ధ పోరం బోకే


కానీ

కోరికల కోక

కట్టాక ఇందాక

బూరె బుగ్గల మందాక మరి

పోతున్నావు ఎందాక ?