బ్లాక్ హోల్

 




నల్ల కోక పిల్లా

నా చూపులన్నీ

కోక సందుల్లో

కాలపు 

స్నిగ్ధ జాలం

నీకు కాంతి 

వడ్డానమా


అంతర మాలీ

మనసు ఊసులన్ని

నీలో పడి

నిన్ను చుట్టే

హలో గ్రాఫిక్

హాకింగ్ సందిగ్ధమే


Sasi: See the similarity between the beautifully rendered black hole and the lady in draped in a black saree. 


English alter-version :

Moments drift to a

Frozen Horizon

As I wait for these times' end

Moments enter the Penrosian traps

I wait for this dark eternity to shine it's radiance Hawkish

Just for once

A trillion times

ఎవరయ్యా నువ్వు ?










ఉషా కిరణాలకు

విషాదాన్ని పూసిన

నిషాదుడెవరు

కాలపు రెక్కల్ని

మౌనపు ముక్కల్ని

నిశీధి చుక్కల్ని

గోడకు పులిమిన 

బాన్స్కీ వా

వాన్ గోవా

నువ్వెలాన్టి 

విధాతవో

కావాలోయ్ గూగుల్

 అకాసమ్మున హరివిల్లు పొడిచినా

ఇంటావిడ వల్లు విరిచిన

పక్కింటోడు మేకు కొట్టినా

కావాలి గూగుల్


చంటి గాడి

ముక్కు కారినా

ముక్కులో పలక పుల్ల

దూరినా కావాలి

గూగుల్


ఎదురింటి అమ్మాయ

నకిలీ నక్లేసు వేసిన

దానికి price తెలియకపోయినా

కావాలి గూగుల్


దొంగ సన్నాసుల

పాఠా లకు

బేబీ డాల్స్

పాటలకు 

కావాలి గూగుల్


 సుధాకర్ వంటలకు

అలి వేని కి

రాలే జుట్టుకు

కావాలి గూగుల్


 పెళ్లి రోజు

గ్రీటింగ్ కార్డుల ల్ల

రాసే చెత్త కవితలకు

పిల్ల మీద పిల్ల కనే

బేబీ షవర్ కు

కావాలి గూగుల్


తిండి కీ తిప్పకు

గొక్కునే పుల్లకూ

మందుకూ మాకుకో

ఇంటి నిండా 

చైనా బొమ్మలకు

కావాలి గూగుల్


పాటకి ఆటకూ

మాటకు 

చింపేసిన చేట కూ

మాడిపోయిన 

వంటకూ

కావాలి గూగుల్


కొడుక్కి మూడు 

నింషాలు

గుండు గోర స్వామి

ముప్పై ని మిషాల్

నీకు దారెందుకి

చెప్పాలి

గో మాత 

గూగుల్ 

తోక పట్టుకుని

పోరా 

ఉత్తి షికారు

దస్తూరి

 దస్తూరి 


ఉత్తరాల వాకిట్లో

అక్షరాల దస్తూరి

ఉదయపు కుంకుమ

మధ్యాహ్నం పసుపు

సాయం నీలంలో

ఉతికిన తెల్ల 

చొక్కా 

మరకలేని 

మనస్సు పై 

నువ్వు రాసిన

బాల్యపు కస్తూరి

స్వప్నాల

దస్తూరి

వదినియ్య్యా

 శైలుూ గారు

మీరు వదినియ్య గోరు

నిద్ర లేపారో

నోరు లైసెన్స్ లేని

బారు


మా అన్నయ్య

మీ శ్రీ వారు

ఎప్పుడు 

అయిపోతారు

మీ దెబ్బకు

పరారు


ప్రకాశము కు

బీరు

నాకు బొమ్ముడాల

చారు

ఇవి పెట్టండి

చాలు

నేను మూస్తాను

నోరు

ఇది ఖరారు

వదినమ్మ

గోరూ

కుక్క గారు

 *కుక్క గారు* 

మా ఊరి
బేపి
అందరికీ రాజు
అంట్ల సమయానికి
హాజ రి
మా ఊరి
బేపి

సర్పంచి కి
తక్కువ 
మోతుబరి కి
ఎక్కువ
మా ఊరి
బేపి

పెళ్లి ల్లో
ఇంటికి
చుట్టం
వీధికి రాజు
ఊరంతటికీ 
కిరీటి
మా ఊరి
బే పి

 పెళ్లి బండికి
బందోబస్తు
పిల్ల వాడికి
జెడ్ క్లాస్ 
బాడీ గార్డ్
మా వూరి
బే పు

 ఆశాడం లో
అవేసంగాను
ఎండా కాలం
బద్దకంగా నూ
కల్లం నీడలో
మా ఊరి
బే పి

ఊరి అనాధలకు
రాత్రి కంబళి
మిగిలిన
అన్నానికి
దత్తాత్రేయ 
రూపం
మా ఊరి
బే పు

అన్ని ఇళ్లలో
దగ్గరి చుట్టం
పేద వీధులకు
గూర్ఖా
వీధికి రాజు
ఊరంత టికీ 
కిరీటి
మా ఊరి
బెపీ

ఊరి పిల్లల
ఆటకు 
మా ఊరి
ఊర కుక్క
కాదు కక్కా దూ
ఆ కుక్కదే
ఈ వూరు

సీతమ్మ పోసేనే
ఈ తల్లి పురుడు
ఊరి తల్లుల
దయకు
చిహ్నమా
కుక్క
మా ఊరి
మానవత్వానికి
గుర్తు ఈ
కుక్క

Refraction

నా మది కిటికీలో
మంచు బిందువులు
నీ కనుల నిట్టూర్పులు
నీకు పొగ మంచంటావా
నాకు నీ  మనస్సులోకి
నక్షత్ర దర్పణాలు

తడి మొగ్గలకు పరధా
తమ్ములు మూసినా
కన్నులు ఆగునా
కన్నులు మూసినా
పరవశమే

నిశ్చయం

మనఃసమస్త మేరు
ఉచ్ఛలం శిఖర 
వర్త తూహీన మేఖలం
మనోబలం నిశ్చయం ....

అంతరం శాంతం
సాగరం నిశ్చలం
నిర్భరం
మానస సరోవరం

మూగమనసులు

కాంతి వలయాలా
కాలపు సుడిగుండా లా
ఇవి వాన్ గోహ్ చిత్రాలా 
తుఫాను కంటి వృత్తాలా 
జీవన రంగుల రాట్నం లో
కాలపు సుడిగుండాలా

శిథిలాలు

మనో శిధిలాల 
మట్టి రేణువులు
కాలపు
స్ఫటికాలు

టూ కీ గా

మనస్సు ప్రశ్న
గుండె జాబు
కాలం జవాబు

వరమిస్తే...

నిన్ను ప్రేమించే
మనసు
పుడితే
ఒక మనిషిగా
నువ్వు  ప్రేమిస్తావా
మనిషిగా
ఒక మనసుతో

నీవే కేంద్రమని
నీవే వృత్తమని
నీవే చిత్తమని 
నీదే మొత్తమని
నువ్వు ఓర్వగలవా
మనిషిగా మనసు గా

భూదేవి అంత
బలంగా నిలుస్తావో
అట్లాస్ లా
వంగి భరి స్తావో
శివునిలా ధరిస్తావో

తెలుగు

అ తో అమ్మ 
ఆ తో ఆవు
ఇ తో ఇల్లు
ఇది తెలుగుదనం
అమ్మలాంటి ఆవు
గోవులాంటి అమ్మ

అమ్మ ఆవు ప్రాణం పోస్తే
బిడ్డకు స్వర్గం
ఇదే తెలుగుదనం
మనం రాసినది
ఇదే తెలుగు పదం

ఈ తో ఈగ
ఉ తో ఉడుత
ఊ తో ఊయల
అన్నీ పిల్లల
సహజ పదం

చిన్నా పెద్దా
అందరి వద్దా
హాయిగా పెరి గెను
ఇదే తెలుగుదనం
మనం నేర్చిన
ఇదే తెలుగు పదం

ఎ తోనెలుక
ఏ తో ఏ నుగు
ఐ తో ఐరావతము
చిన్నదైన పెద్దది అయినా
అన్నిటి అర్థం 
ఇదేనొయ్ తెలుగు తనం

ఒ తో ఒంటే
ఓ తో ఓడ
ఔ తో ఔషధం
ఒంటెలు ఓడలు
ఓడలు ఒంటెలు

వెలుగు నీడలు
తెలుగు మృదు 
మనసుకు తెలుగు
ఔ తో ఔషధం
ఇదే తెలుగు భావము

అం తో అంతః పురంమ
మనంకట్టే 
మృదు మేఖల 
అంతరంగ స్వర్గం
తెలుగు పదం
తెలుగు జనం


Sasi: భాషల్లో మొదటి అక్షరాల్లో అతి లోతైన భావజాలాన్ని మొదటి పాఠం లో కలుపుకున్న భాష తెలుగు.

సిస్టర్

కళ్లు ముంజులు
జుట్టు తాటి పీచు
గొంతు మహా పేచీ
ఎవ్వర్రీ షార్ట్ సర్క్యూట్
Eveready బ్యాటరీ

నా రిమోట్

TV Remote 

ఇది నా రిమోట్
ఇలాంటి రిమోట్లు
చాలా ఉంటాయి
కానీ ఇది నా రిమోట్

నేను నా రిమోట్ 
ఒక యూనిట్
నేనే రిమోట్
రిమోట్ నేను

వరదలు వచ్చినా
పిడుగులు పడినా
రిమోట్ నాదగ్గర 
రిమోట్ దగ్గర నేను

ఇది నా రిమోట్
ఛానెల్ మర్చేస్విచ్
నాకు ప్రాణం
సెకండ్ కి ఒక సారి
ఛానెల్ మారిస్తే
రిమోట్ కి ఇష్టం
లేకపోతే బటన్
పాడై పోతుంది

నా రిమోట్ 
మోనోగాముస్
కేవలము నాది
ఎవరి కీ దొరకదు
నేను లేక పోతే
సోఫా సందుల్లో
తలుపు మూలల్లో
దాక్కుని 
నాకోసం ఎదురు
కాస్తుంది

ఇదినా రిమోట్
ఏ చినా దేశంలో
పుట్టిన
పుట్టింది
నాకోసం

ఇది నా రిమోట్
ఆశ్లేషనక్షత్రము లో నేను
మృగశిరా లో
నా రిమోట్
అన్ని శుభ లక్షణాలే

ఇది నా రిమో టు
నాకు pacemaker
ఇది దాకుంటే
నాకు పెరుగును
బీ పీ
పగలొచ్చు
పెళ్ళాం పిల్లల వీపీ

ఇది నా రిమోట్ 
రోజంతా న్యూస్
ఆరో గంట 
ఏ డో గంట
న్యూస్ గుంట
ముసిలయి పోయినా
అదే అదే న్యూస్
గాని ఇది నా రిమోట్

నా రిమోట్
దీనిని
సృష్టించిన
వెధవకి
నా జోహార్లు
మాట వినని
పె ళ్ళా ల్లకు
ఇది సబ్స్టిట్యూట్
నా రిమోట్

నా రిమోట్
మధ్యలో
ప్రకృతి 
పిలిచినా
నాతో
 బాత్రూమ్ తోడు
 వచ్చే
రిమోట్

మా సుపుత్రుడు
మాట వినలేదా
ఛానెల్ మర్చేస్తే
మర్చిపోయాను

ఇది నా రిమోట్
గుండెకు డైరెక్ట్ లైటు
నా రిమోట్

ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మీరేగా
నాకు బాపు
నీ బాపు
ఏ లాడు గా
అనాదిగా
మా వీపు

మాకేమో
దుమ్ము రోడ్డు
నీకేమో 
సుమో జీపు

నువ్వెక్కిన ఆడీకున్న
సున్నాలు
మా నెల కూలీ
నీ కూలింగ్ గ్లాసులు కి 
పడలేదే దుమ్ము
ఎందుకురా నీకు
లేదు ముందుకొచ్చే 
దమ్ము
ఎమ్మెల్యే నువ్వేమా
మా బాపు
లేప కుండా 
ఉంటామా
నీ టాపు
నీ సెకండ్ గారి
తిండి ఖర్చులే
మా వీధి బోరింగుకి
రావచ్చులే
 నీ కూతురికి
ఇంగ్లాండు
బొచ్చు కుక్కలు
మా వీధి రోడ్డంతా
మస్తు బొక్కలు
మా సాయంత్రపు
విమానం ముగ్గు
అంత కూడా లేదు
నీకు సిగ్గు

కులం పేరుతో
అడుక్కునే నీకు
కనిపించదు లే
అబ్దుల్ కలాం
చూపు


గుడిలోని నీకు
ఉందిగా సెపరేట్ లైను
కొండమీ దే
తాగుతావు
ఇటాలియన్ వైను
నీకోతురు బీజేపీ
నువ్వేమో టీ డీ పీ
ఫస్ట్ వైఫు వై ఆర్ పీ
కులం పేరుతో
పెంచుంతావు
అందరికీ హై బీపీ

ఎమ్మెల్యే నువ్వేరా

నాకు బాపు

మావూరి కుక్క కు

పుట్టిందో బేపు

లవ్ యూ

మల్లెల లోగి డి
వెన్నెల అలజడి
కవితల వరవడి
లేచా పడి పడి
ఇద్దరు
తడపడి
ముద్దు లే
తదుపరి
అవ్వకు
పొదుపరి
నా మనసుకు 
తొలకరి

ఐ హేట్ యూ..

రంగుల లోకం లో
నువ్వు ఒలిపిన సిరా
ఎండిన కన్నీటి అంతర్వేది

మంచు బాకు

కాలమా కలల కౌగిలిలో
విసిరావు మంచు బాకు
శోకం నాకు
సైలెన్స్ నీకు

*మంచు బాకుతో పొడిస్తే ఆనవాలు ఉండవు. సైలెంట్ గా ఇచ్చే జవాబు అలాంటిది కదా..

ఎవర్తివే

నా గుండెల అలజడి వో
జడివానల లోగిడి వో
కొప్పున కొండమల్లి మొగ్గవో
చౌదవీ చందమామ వో
వరమో వర్ణన నేర్పే సరస్వతి వో
ఎవరే నీవు

చెల్లి

మా చెల్లి కథ చెపితే
ఋతపవనాలు

మా చెల్లి తిండి తింటే
శెనగ నాట్లు

మా చెల్లి వంటింట్లో
దూరితే ఖరీఫ్ 

మా చెల్లి వాకింగ్ చేస్తే
జురాసిక్ పార్క్ 

మా చెల్లి నూడుల్స్ వండితే
వంటింట్లో వుహాన్

మా చెల్లి ముక్తసరిగా
దూరదర్శన్ లో
స్పీల్ బర్గు

కోవిడి వసంతం

వసంతమా ఏమిటి నీ వేళాకోళం
నన్ను ఇంట్లో  బంధించి
నువ్వు కొమ్మల్లో ఊరీగుతావ

నేటి బుడగలు

ఏమిటా బుడగలు ?
అరబిక్కడల్లో నీ
గుండెకు లంగరు వేసి
కన్నీటి సంద్రపు
లోతుల్లో చేరేటప్పుడు
నా గుండె చేసిన చప్పుడు
ఇది గుండెల బుడగల చప్పుడు

వెలుగు నీడలు

నా నయన బాణాలు
నీ కన్నుల్లో చేరలేని 
నిమిషము
చీకటి

నీ కంఠ పుట్టు మచ్చ
నీ ఆధర సువాసన
వెచ్చని మాఘ మాసపు కౌగిలి
వెలుతురు

రాగం

నీ గుండె లబ్ అంటే 
నా గుండె డబ్
అంటుంది
ఇదీ ఆదితాళం

అల్లుకుపోయిన
ఈ గుండెలయల్లో
ప్రవహించే అనురాగ 
అంతర్వేది
మన హిందోళం

*
Let me lace my heart with yours
Every beat to be skipped with my beat
Two rhythms one rhyme
Let me lace my heart

పెద్ద పండుగ

పండిన చేలూ
కళ్ళాపి చల్లిన ముగ్గులు
మృగశిర మాసంలో
భళ్ళున లేచే సూర్యుడు
సూరిడి కుంకుమ బొట్టు
వాకిలిలో గింజలు ఆరగిస్తున పిచ్చుక
పొగ మంచులో పేపర్ అబ్బాయ్
పాలు నింపుకెలుతున్న పాపాయి
గబగబా పేపర్ చదివే తాతగారు
పండుగ వాకిళ్ళు

ఒసే శైలమ్మా

(మా వదిన గారి కోసం, ప్రత్యేకం)

తట్టి కోట వంశం లో
పుట్టావే తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

మణి పాత్రుని
వంశం లో మెట్టావే
తల్లి
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

షావుకారూ
బిల్లల 
షావుకారూ
వెనకాలే
తిరిగావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

ఉడుకున్న
కూతురుకోసం
పాత డ్రెస్సు
వేశావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

పిసినారి
పిసినారి
సావుకారు
ఓళాలో
తి ప్పా డే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

పరుగు
పరుగు
వంటలోన
కూరగాయ
ఖైమ
కొట్టేవే 
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

నరిశీ పట్నం
విశాఖపట్నం
సింగపూరు
చందానగర్
ఆడంబాక్కం
తిరిగావే
తల్లీ

ఎండల్లో
వానల్లో
ఎండల్లో
వానల్లో
స్కూటీలో
తిరిగావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

తట్టి కోట వంశం లో
పుట్టావే తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

మణి పాత్రుని
వంశం లో మెట్టావే
తల్లి
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా


ఆట

వేట 
జీవిత వేట
ఆటగాళ్లు
వేటగాళ్లు
కళ్ళన్నీ
రంగురాల్లు

పుట్టాకే
మొదలయ్యింది
వేట
కడుపంతా
నొప్పయితే
రోజంతా
వేతనలో
పుట్టి పుట్టి 
చచ్చానే

వేట
అడవిలో
వేట
పాలమ్మే
పాలేరుల
సైకిలు పై
పారిపోయిన
వేట

వేట
అడవిలో
వేట
పూల 
మొక్కల్లో
దాక్కుంటే
పాములన్నీ
తాకున్నా
ఇది వేట

పొమ్మని 
రమ్మంటే
వేట
నియాన్
లైట్
నీడల్లో
ఎఱ్ఱని
రంగుల
వేట

రాత్రంతా
నీరులేక
రోజంతా
ఉండలేక
ఒక్కసారిగా
తల్లి అన్న
తండ్రి పోయిన
వియోగ
విరహ వ్యధ

అడవిలో
వేట
సాయం కాలపు
సాయంచేయని
ఎర్రని 
గోధూళి
పొగమారిన
ఆటల్లో
వ్యధ
అడవిలో
వేట

ఆట
అడవిలో
ఆట
వందలున్న
గుంపులో
వంటరి
ఆట

ఆట
అడవిలో
ఆట
సాయంత్రపు
పక్షులు
కూడా
చేరేనే
కాలానికి
దారములేని
ఈ తోరణాల
దొంగాట



సంకురాత్రి

నీవిచ్చే
కౌగిల్లో
నాకు
భోగి
వేడుకలు

కళ్ళల్లో
నువ్వు 
వెలిగించావీ
బాణాసంచా

మళ్ళీ మళ్ళీ
లోగిల్లో
వచ్చే సంబరాలు
నీకైచేసే 
సంక్రాంతులు

రాద్దాంతం

నిన్ను చూస్తే
గుండెల్లో
ర త త తా
ర త త తా

నే నున్న
గెట్టోలో
రోజంతా
ర త త తా
ర త త తా

కళ్లలో
నువ్వద్దిన
రంగుల
రెయిన్బో
ర త త తా
ర త త తా

పాతబస్తీ
గ్యాంగులన్ని
బ్యాంగ్ చేసే
ర త త తా
ర త త తా

నేనుండే 
దారుల్లో
ర త త తా
ర త త తా

నీ అందెల
సవ్వడి
వింటే
మనసంతా
ర త త తా
ర త త తా

అ అంటే

అమ్మ
మొదటి 
పదం
మొదటిశ్వాస
మొదటి
ఒడి
అమ్మే
మొదటి
మిత్రువు
మొదటి
వేదము
మొదటి
గురువు

అమ్మతోనే
మొదటి
యుద్ధం
మొదటి
అలక
మొదటి
స్నేహం
అమ్మే
చివరి
పదం
ఈ రెంటి
మధ్యజరిగే
నాటకమే

సృష్టి

వాకిలి

ఈ కొమ్మకు
పుట్టిన
పువ్వులనడుగు
పువ్వులు
సోకిన
గువ్వలనడుగు
నువ్వస్తే
వసంతమేలే
మనసంతా

మొగ్గలు

 ఎప్పుడెప్పుడు

తప్పెను

గుండెల 

చప్పుడు


ఎప్పుడెప్పుడు

పూసెను

పూవులు

గుప్పుడు