నమ్మలేకున్నా
నీ రూపాన్ని
నీ కాటుక కన్నుల
ఈ మంత్ర జాలాన్ని
నమ్మలేకున్నా
హిమశిఖిరి
జారే జలపాతాల
కురుల అలలు
నీ చంపల వాలి
జలతారులయిన
సొగసును మెచ్చే
పదం ఇంకా
తెలుగునాట
పుట్టలేదని
నమ్మలేకున్నా
రాగిణీ
నడుమొంపుల్లో
కొండ జాజుల
సుగంధాన్ని
నమ్మలేకున్నా
రాత్రి నెలవంక
అస్తమించాక
విస్తారంగా
పచ్చిక
బయల్లలో
నీ కురుల
కృష్ణశ్వాలు
పరిచిన చిక్కటి
నల్ల దుప్పటి
నమ్మలేకున్నా
కొండ లోయల్లో
తెల్లటి తొలి భాను రేఖ
పొడిచే ముందు
నిద్ర లేచే ముందటి
నీ కనురెప్పల
మొదటి చూపు
అందాన్ని
నమ్మలేకున్నా