బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.
(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.
సెగట్రీ: నారాయుడొచ్చాడండి.
రావు: వచ్చాడా తీసుకొచ్చావా?
సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?
(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)
రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?
సెగట్రీ: యెస్సర్
రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?
సెగట్రీ: అద్భుతం సార్!
రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !
అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.
Subscribe to:
Post Comments (Atom)
16 comments:
ఇది చిర స్మరణీయమైన సన్నివేశం. Ever green. బాపు,రమణలు విలన్ల నే గాదు ఆఖరికి హలానికి కూడా చీర కట్టి ఆరుబయలు పచ్చిక లో నృత్యం చిత్రించి తమ ప్రత్యెకతను చూపారు ఈ చిత్రంలో.
ఎక్కడి నుంచి చూసి రాసావు? I am a fan of RGR too esp. his dialogues in "yamagola" f1st half.
Maava! inko class cinema Yamagola.
[Raogopala raoki thana wife paadhalu kaduguthoo untundhi. appudu dialogue ]
Rao : Pathivethalu! paadha poojalu mogudiki ni..pesadhaalu egas party odiki..
Hi sasi
chala bagundi,I was just laughing reading those dialogues
keep it up
JJ
mee post lu anni chadivaanandi.challa baagunnayi.ee sari nundi daily check chestunta.
Rao garu, thanks for the comment. mana telugu cinemala kala unnata stayiki tessukuvellaru bapu ramana iddaru. We will always remember them.
Siva, I watched this movie recently and jotted down the dialogues. I think we shall do justice to the movie only by watching it, I can write it on a cd for you!
Subbu mama, ragora dialogues are awesome I will try to get more of these. I miss his acting so much
Jawahar, glad that you liked them. I shall post as oft as possible! keep readin!
Radhika garu, thanks for complements. Just checked your poems on your blog, they strung very emotional chords! Hats off!
sasikanth garu,
me blogs rendu chala bavunayi..telugu blog lo inka cover cheyandi baga....nice to see such good blogs ...
deepthi
Deepti garu
thank you, keep visiting once in a while. I will post more once my work load reduces again in the holidays.
Mee posts anni chala bavunayi :)
అరరరే ఇంతకాలం మీ బ్లాగు నా కళ్లపడలేదే!!
ఇప్పుడే చూస్తున్నాను రమణ "మంత్రిగారి వియ్యంకుడు"
ఒకే మాట చెప్పగలను - మీ బ్లాగు సుమధురం!!!
దయచేసి ఈ సాహితీ పకోడీల పంపిణీ కొనసాగిస్తుండండి.
బాపు రమణలు సృష్టించి రావుగోపాలరావుగారు నటించిన ఆ పాత్రకు మాతృక అనదగిన వ్యక్తి వంటి వ్యక్తిది మాఊరే. ఈయన ఎప్పుడూ భగవత్గీత చదువుతూ వుంటాడు. డిక్కీలో ఎవర్నీ పడుకోబెట్టించలేదేమోగాని, చేసినపనులన్నీ దాదాపు అలాంటివేనట. ఈయన మాట్లాడినట్లుగానే రావు గోపాలరావుగారి మాడ్యులేషన్ కూడా ఉండటం నాకైతే ఆశ్చర్యంగానే వుంటుంది. ఆ సినిమా అంటే నాక్కూడా చాలా చాలా ఇష్టం.పాపం ఈయన ఇటీవలే పోయారు.(రావు గోపాలరావు గారికంటే ముందే)
విలన్లు మాత్రం మనుషులు కారా? వాళ్లకి కళాపోషణ ఉండదా? ఎప్పటికీ అది జనాల గుండెల్లో నిలిచిపోయే పాత్ర!
Post a Comment