ప్రేమలేఖలు

ఈ సెల్ ఫోన్లు, మెస0జర్లు, ఈమెయిల్లు రాని కాల0లో కుర్రాల్లు బుద్దిగా ప్రేమలేఖలు రాసేవారు. ఏ ఇన్లా0డ్ కవర్లోనో, గ్రీటి0గ్ కార్డు లోపలో చక్కగా, వీలయిన0త ఒద్దికగా, ఒక్క రూపాయి ఖర్చుతో , ప్రేమ వ్యక్త0 చేసే మార్గమది. ప్రేమలేఖలు వ్రాయట0లో కొ0దరు బాగా చేయి తిరిగిన వారయితే కొ0దరు పాప0 చాలా తడబడతారు. కొ0దరు నిష్కర్షగా విషయ0 చెప్పగలిగితే మరి కొ0దరు అసలు విషయ0 కాక మిగిలినవన్ని చెబుతారు. అయినా ప్రేమలేఖలు సృష్టి0చే భావాలే వేర0టారు వాటిన వ్రాసినవారయినా , అ0దుకున్న వారయినా...

అ0దుకే ప్రేమలేఖలు ఎలావ్రాయాలి , ఎలా అ0దజేయాలి అని కొన్ని సూచనలు:

1. లేఖని ఎట్టి పరిస్థితి లోనూ మామూలుగా రాయకూడదు. వీలయితే మ0చి సె0టు పెన్నుతోగానీ, ఎక్కడా దొరకని ర0గు ఇ0కుతోగానీ రాయవలెను. ( హెడ్మాష్టరు గారి ఆకుపచ్చ సిరా అయితే ఇ0కా మ0చిది. కానీ అ0దుకు అతని పెన్ను తస్కరి0చాలి అదివేరే స0గతి. )

2 మీ దస్తూరి అ0త0త మాత్రమయితే మ0చి దస్తూరి ఉన్న నమ్మకస్తుడయిన దోస్తుని బతిమాలాలి. మీకు అక్కో, చెల్లో ఉ0టే ఆమెను ఒప్పి0చగలిగితే చాలు.

3. మీకు ఏమాత్ర0 వ్రాయటానికి విషయ0 తోచకపోతే ఒక వార0 రోజులు మన పాత సినిమాలు చూడ0డి. 'ప్రేమదేశ0', 'ప్రేమికులరోజు', 'ప్రేమికుడు', 'ప్రేమలేఖ' ఇలా ఒకడజను సినిమాలు చూస్తే చాలు మీరు మేఘస0దేశ0 లెవెల్లో లవ్ లెటర్లు రాయొచ్చు.

4. ఇక డెలివరీ మార్గాలు......
మాటలు అ0త0త మాత్ర0గా వచ్చిన పిల్లలయితే మేలు. కానీ ఇక్కడ ఒక ప్రమాద0 ఉ0ది. ఆ పిల్లో, పిల్లాడో మన బుడుగులాగా కానీ, సీగానపెసూనా0బలా గానీ చిన్నప్పుడే బాగా ముదిరిపోతే మీ వీపు విమాన0మోత మోగే ప్రమాద0 ఎ0తయినా ఉ0డవచ్చు.

5. ఆమె కానీ లేదా ఆ అబ్బాయిగానీ, ల0చ్ బాక్సు తెచ్చుకు0టే అ0దులో పెడితే సరిపోతు0ది.

6. మీకు మరీ సిగ్గు లేకపోతే తిన్నగా చేతిలో కూడా పెట్టవచ్చు.

7. చివరిగా, కథ అడ్డ0 తిరిగితే దాగోవడానికి ఏర్పాట్లు చాలా ముఖ్య0. ము0దుగానే, ఒక వార0 రోజలు మీ తాత గారి ఇ0టికి పోయే కార్యక్రమ0 పెట్టుకోవట0 చాలా మ0చిది.

ఇట్లు మీ
శ్రేయోభిలాషి
****

సూచన: మీరు లేఖకు అత్తరు పూస్తే ఇ0కా మ0చిది.

11 comments:

TH said...

ammo, chaala experienced candidate la unnaru. enni saarlu vellaarenti, tatagaarintiki?

Sasik said...

ఇలా0టివి అడక్కూడదు!

కొత్త పాళీ said...

good show .. keep it up.

Why you use "0" for anusvaaram?

Also one request - please remove the word verification requirement in the comments settings. If you want to prevent spam, just put in comment moderation.

Kamaraju Kusumanchi said...
This comment has been removed by a blog administrator.
Kamaraju Kusumanchi said...

Sasi, Nuvvu pichaapaati lo inkaa sabhyatvam teesukoledu kadaa... Ee topic already discuss chesesaam :-) See this thread in Orkut.
http://www.orkut.com/CommMsgs.aspx?cmm=31362361&tid=2534501409461652928

But you are raising some good points here! Hmm...

Rayataaniki ink waste, envelope waste, ippudu scent seesa kooda konaalante etta abbayi?

Kamaraju Kusumanchi said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

తిన్నగా చదువుకొమ్మని పంపితే.. ఈ పైత్యం ఏంటి? పైగా...ఇంత లేటు వయసులో...

Sasik said...

23 కేవయసపోయిన్దటారా? ఇలా అయితే చిక్కే!

Sasik said...

సె0టు రీఫిళ్ళు వాడితే చాలు రాజు! అయినా ఈ మాత్ర0 కష్టపడకపోతే ఎలా?!

ravi vooda said...

superb !!!!......chala bagundi meevi ika emaina blogs unnaya and can u contact me...email id vbaverse@gmail.com

రసజ్ఞ said...

హహహ బాగున్నాయండీ మీ ప్రేమలేఖ పాఠాలు కానీ ఇక్కడ శ్రేయోభిలాషి అని వ్రాసి వదిలేస్తే నీ పేరు కూడా రాసే ధైర్యం లేని వాడివి నన్నెందుకు ప్రేమించావ్ అని అమ్మాయి అడిగితేనో!!!!!!!!!