గాలి పటం

పొమ్మంటారు
నల్దిక్కుల లోకంలో
దిక్కులేని గాలి పటంలా
పొమ్మంటారు

పొమ్మంటారు
క్రింది వైతరిణీ జ్వాలల్లోనికో
పైని పొగమబ్బుల చాటుకో
పొమ్మంటారు

ఇదో వింతలోకం
సప్తస్వరాల కోకిలకు వర్ణమే ఇవ్వని
ఎగిరే గాలి పటానికి దిక్కులే తోచని
వింతలోకం, నువ్వు పొమ్మన్న లోకం

3 comments:

Anonymous said...

ఇది చాల బాగుంది.. మంచి భావుకత..
వేసుకో రెండు వీర దండలు ...

Anonymous said...

అన్నట్టు.. వైతరణి అంటే చనిపొయక దాటె నది ( రక్తమాంసాల తొ నిండినది..), దాన్ని దాటగానే భవ భంధాలు అన్నీ తెంచుకొని సరికొత్త ప్రపంచం లొ అడుగు పెడతాం.. ( జ్వాలలు ఉంటయా? నేను కూడా దాటలేదు కనక తెలియదు ..)
_________

స్వగతం లొ: ఎమిటి ఈ నిరంతర రంధ్రాన్వేషణ? కవితని కాల్పనికా ద్రుష్టి తొ చూచెదమన్న .. నా వ్రుత్తి ధర్మం నన్ను విడువక వెంటాడుతున్నదా ..
లేక.. వయొభారము తొ పెనవేసిన చాదస్తపు వైఖరులా ఇవి.. కిం కర్తవ్యం??.

Sasik said...

IIT prof anipinchukuntunnaru :P