నువ్వు వస్తే

నువ్వు ఎర్రటి మందారం గానో, తెల్లటి పావురం గానో, నల్లటి మేఘం గానో వస్తే
తుమ్మెదనై, చిరు గాలినై, పిల్ల కాలువనై నీకోసం ఉంటాను

నువ్వు కరువులో చినుకులా, అమావాశ్యలో వెన్నెలలా, ఎడారిలో వర్షంలా రాకపోతే మాత్రం
కన్నీటినై , చీకటినై, వేడి నిట్టూర్పునై, వెనక్కిరాని దిక్కులలో దాగి పోతాను

3 comments:

Anonymous said...

ఆకాశం లో సగం నేను.. సగం నీవు..
.....వింబుల్డన్ లొ కూడా.....

sudhakar said...

chalaa bagundhi

Kathi Mahesh Kumar said...

"వెనక్కి రాని దిక్కులు" పదప్రయోగం చాలా బాగుంది.