మూడు చక్రాల సైకిలు

చందమామ వెన్నెట్లో
నాన్నగారి గుండెలపై నేను.
అమ్మ తినిపించే మజ్జికన్నం.

మీ ఆలన, పాలన, లాలన
నా మూడు చక్రాల సైకిలు.
మీరు చెప్పిన ఏడు చేపల కథలు
ఏడు ఖండాలు నింపే నా ప్రపంచయాత్రలు .

మమతల చిరునవ్వుల చాటు
అనురాగాల పొదివినల్లుకున్నాం.
బాల్యపు లోగిడి నుండి
జీవితపు సాయంత్రాలకు ప్రయాణం.

ఈ నిండు రాత్రిభూగోళానికి అటు మీరున్నా
మీ నిండు ప్రేమ,
ఇటు నిండు వెన్నెలై కురుస్తుంటే,
నాకీ సుఖం చాలు !

4 comments:

హరే కృష్ణ said...

బావుంది :)

SARATH KAY said...

Excellent Brother !

Last stanza.. "bhugolaniki meeru atu unna...."
amazing. I miss my parents

రసజ్ఞ said...

ఈ నిండు రాత్రిభూగోళానికి అటు మీరున్నా
మీ నిండు ప్రేమ,
ఇటు నిండు వెన్నెలై కురుస్తుంటే,
నాకీ సుఖం చాలు !

నిజమే అండీ అంతకు మించిన ఆనందమేముంది? ఇవాలే మీ బ్లాగు చూడటం! చక్కగా రాస్తున్నారు మీ భావ వ్యక్తీకరణ చక్కగా ఉంది!

sudhakar said...

wow, quite touching..