స్నేహాద్వైతం

 

(Atman merging in Brahman)

స్నేహాద్వైతం

కాలపు ఆగమేఘల
పొగ మంచులో
ద్రవించిన చినుకులు
స్నేహితులు

తనువుల సామిప్యం కానిది
ఊపిరి బంధం కానిది
ఆలోచనల వల్లరి కూడా కానిది
మేధ కానిది
మేధస్సు కానిది
ఇవి ఆత్మ చినుకులు

బిందువులు 
ఒకటి ఒకటి 
కలిస్తే కలిసే
స్నేహ బంధం
చినుకు చినుకు
వర్షిస్తే
ఓంకార సాగరం 
ఇదేనా అద్వయిత 
సారం ?

No comments: