నీటి మడుగులు
మహా వనంలో
నీటి మడుగులు
మబ్బుల చాటున
కోరికల సుగంధ
వనఛాయల్లో నీటి
తామరాకుల పందిరి
మాటున
వెన్నెల్లో మురిసి
వానకి తడిసి
ఎండకు జడిసి
కష్టమొస్తే
క్షణమొక యుగంగా
సుఖమొస్తే
యుగమొక క్షణంగా
వసంత గ్రీష్మ వర్ష
శరదృ శీతకాల
మాయా జీవన చక్ర
బందీలు ఈ
నీటి బుగ్గలు
అనగా అనగా
ఒక రోజు
కాదు కాదు
ఒకానొక
కాల చక్ర క్షణంలో
సత్సాంగత్యం ఫలిస్తే
అనుబంధాల మబ్బులు వీడాక
మోహపు మంచు తెర లేచాక
కోరికల తామరాకుల
పందిరి తొలగి
ప్రశాంత ఏకాంత నిశ్చల
సరస్సులో
అదిగో
అవుతూ ఉంది
సూర్యోదయం
భానుడు ఒక్కడు
తన బింబాలు అనేకం
స్థానకాలానంతంలో
క్షణిక మడుగుల నీటిచుక్కలు
ఆ వనంలో నీటి బుడగలు
మనం
నిస్సంగత్యనిర్మోహ
నిశ్చల మనోసరస్సులో
ఆ భానుడు ఉదయిస్తే
ఈ మడుగుల జలం
అలా మేఘమయి
జీవనముక్తి
అలా మేఘమయి
జీవనముక్తి
అనంత సాగరం లో అలా
వర్షించ
No comments:
Post a Comment