రోజా...

 రోజా...


ఆ రోజు మంచి ఎండ కాస్తుంది. అక్టోబర్ వర్షాలు తగ్గాక నేల బాగా తడినుండి పొడికి మారి, ఎర్ర మట్టి బాగా ఎండకు ఎండిపోతున్న రోజులు అవి. స్కూలు ఆట స్థలం పక్కనే పాకలు వేసి కొత్త తరగతి లో ఆరో క్లాసుని పెట్టారు . టెంపరరీ స్కూల్ ఆవరణ లాగి లాగి 7 ఏళ్లు అలాగే అదే క్యాంపస్ లో ఉంది పోయింది. పూర్వం అక్కడే వియ్యంపేట సమితి ఆఫీసు ఉండేది అంట . ఇలా ఇంచు మించి 450 పిల్లలు ఇంకా 30 టీచర్లు ఉండాల్సిన క్యాంపస్ మాత్రం కానీ కాదు.

పాక లో, రగ్గు మీద కూర్చొని రోజంతా బయటకు మాత్రమే చూసేవాడు కిట్టు. దూరాన జీడి మామిడి చెట్లు, తాటి తోపులు, అప్పుడప్పుడూ పీండ్రిం చూకుంటూ వెళ్ళే ఎర్ర బస్సు చూస్తుంటూ ఉండే వాడు.

దూరాన మెల్లగా వస్తూ కనిపించింది రోజా అక్క. మనసులో అక్కని చూస్తే ఒక ఊరట.

అక్క ఈ సమయంలో వస్తుంది అంటే, సర్క్యులర్ అయ్యి ఉంటాది.

అక్క చేతిలో పుస్తకం ఉంది. అక్క వస్తుంది అంటే ఆయా 12 క్లాసుల్లోని పిల్ల లు అక్కని చూసేవారు. ఒక్కోసారి డిల్లీలో ఎవరో పోతే ఏకంగా 5 రోజులు సెలవులు ఇచ్చేశారు, ఇంకా ఎప్పుడైనా పండుగల సెలబ్రేషన్స్ కి అలా అక్కే సర్కులర్ తెచ్చేది.. అక్క మొఖంలో ఉన్న ముఖ కలవలిక లలో తెలిసిపోతుండేది. ఏది, ఏమిటి, విషయం అని. ముభావంగా వస్తుంది అంటే ఏ పనికిమాలిన ఆఫీసరో వస్తున్నాడు అని, ముసిముసి నవ్వులతో వస్తే మంచి విషయం అని.. అలా...

కిట్టు అక్కని దూరంగా చూసాడు, అక్కకి పాపం ఎంత కష్టం నడవటం అని. అక్క మంచి ముఖ  లక్షణాలతో, చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండేది. కానీ పాపం పోలియో అనుకుంటా మెక్కుకుంటూ నడిచేది. స్కూళ్లో ఎవరు లేకున్నా రోజు గడుస్తుంది గానీ, అక్క లేకుండా ఒక్క గంట కూడా ముందు వెళ్ళదు.. అక్క బెల్ కొడితే పిల్లల రోజు మొదలవుతుంది, అక్క బెల్లుకే ప్రేయర్, అక్క బెల్లు కీ టిఫిన్ అయినా , లంచ్ అయినా డిన్నర్ అయినా.. అక్క లేకుండా ఆ 500 మంది జీవితం ముందుకు వెళ్ళ లేదు అన్న మాట. ఒక్క రోజు, ఒక్క గంటను కూడా అక్క మర్చి పోయేది కాదు.

రోజక్క ఆ క్యాంపస్ లో ఎక్కడ ఉంటుందో కిట్టూ కి ఎప్పుడూ అర్థం కాలేదు. ఎందుకంటే, ఎవ్వరూ లేకముందే అక్క లేస్తుంది. అందరూ పడుకున్నకే అక్క పడుకుంటుంది.  ఉదయం పీటీ మొదటి బెల్లు నుండి రాత్రి చివరి బెల్లు వరకూ అక్క చేతి మీదే..

రోజాక్క కు తెలియని రోజక్కని  తెలియని వారు స్కూళ్లో లేదు. ప్రతి బెల్లు అక్క కొట్టాల్సిందే. ప్రతి ఉత్తరం అక్క ఇవ్వాల్సిందే. ప్రతి రోజు 5 కి లేచి తన పని కాకున్నా అక్క మెయిన్ బిల్డింగ్ మెట్లను శుభ్రం చేయ టం చూసాడు కిట్టు. అక్కని అడిగాడు అక్కా నువ్వెందుకు కడుగుతున్నావ్ అని. అక్క అంది మనం ఉన్న ఇల్లులాంటిది కిట్టు ఎవరు కడిగితే ఏమిటి అని.

అక్క ఆ స్కూళ్లో ఉన్న అందరూ పిల్లల మనసులో ఒక ప్రత్యేక స్థానం పొందింది. బెల్ వినిపేస్తే అక్క గుర్తుకు వస్తుంది అందరికీ. అక్కకు ఎవ్వరూ గుడ్ మార్నింగ్ చెప్పేవారు కాదు. కానీ ఎవరి గుడ్ మార్నింగ్ అక్క లేకుండా మొదలయ్యేది కాదు .. ఆ అయిదు వందల మంది జీవితాలను అక్క ఒక్క చేతితో నడిపేది. ఒక రోజు కిట్టూ రోజక్కని అడిగాడు అక్కా నువ్వు ఎప్పుడు పడుంటావ్ అని, అక్క నవ్వి నాకేం పిల్లలు పడుకున్నప్పుడే నేను పడుకోవటం. అలా స్కూల్ పిల్లల దైనందిన జీవితం తో అక్క ముడిపడి ఉంది అని అర్థం చేసుకున్నాడు కిట్టు.

కిట్టు కి ఒక గొప్ప విషయం ఆరోజు పాకలో, దూరంగా వస్తున్న అక్కని చూస్తూ అర్థం అయ్యింది. సేవా భావం ఉన్న చోట శక్తి , పాపులార్టీ ఉంటుందని... ఈ రాజకీయ నాయకులు పవర్ కోసం పడే కుక్క పాట్లు మాని సేవా భావం నేర్చుకుంటే ప్రజాభిమానం దానికదే వస్తుంది అని. రోజా అక్క నిస్వార్థంగా రోజూ చేసే సేవే కదా తనకి ఇంత అభిమానాన్ని ఇస్తుంది అని. 

మొత్తం మీద రోజా , 6A చేరుకుంది.. ఆ స్కూల్ మొత్తానికి అదే జూనియర్ మోస్ట్ సెక్షన్..

అక్క పాక ద్వారం వద్ద అనుకుని నిలబడింది. నవోదయలో చేరాక కిట్టు నేర్చుకున్న మొదటి పాఠాల్లో ఒకటి అనుమతి తీసుకుని లోపలికి రావటం. ప్రిన్సిపాల్  కోటి అయినా రోజక్క అయినా అడిగి రావలసిందే. 

 అక్కా అక్కా అని అందరూ పిలవడం మొదలు పెట్టారు . గేదెల అప్పారావు ఆరోజు మాంచి ఊపులో ఉత్తరమరికా నైసర్గిక స్వరూపాలు చెప్తున్నారు. 

రోజాను చూసారు. ఒక్కసారి ఆపి అమ్మా రోజా రా అని ఆప్యాయంగా లోపలికి రమ్మన్నారు. కూర్చో మంచి ఎండలో వచ్చావ్ అని కుర్చీ లాగారు. అక్క సిగ్గు పడుతుని లేదు సార్ అయిపోయింది మీరే లాస్ట్ అని.

పిల్లలు అక్కని చూసి అక్కా అక్కా అని పిలుస్తున్నారు. సార్ చదివారు, ఒహో అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి . ఓ చేద్దాం అన్నారు. 

అక్కని ఎప్పుడొచ్చింది ఇది అని అడిగితే అక్క ఒక్క గంట అయ్యింది సార్. ఫోను కూడా, డిల్లీ నుండి అని....

కిట్టూ కి పిల్లలకి ఉత్సుహత విపరీతం గా పెరిగింది.

సర్కులర్ లో ఏముంది, డిల్లీ నుండి ఫోన్ ఏమిటి, పిన్సిపాల్ కోటిగాడికి డిల్లీ నుండి ఎవరు ఫోన్ చేసారు.... 

ఇంతలో మిత్రమా విరగ తీద్దాం అంటూ తెలుగు సార్, మ్యూజిక్ సార్, 6A లోకి వచ్చేశారు..

No comments: