వెన్నెలంతా


వెన్నెలంతా సన్నజాజులై వాకిట్లో కురుస్తుంది
నీ కురులతో ఆడుకున్న పిల్ల గాలి అప్పుడప్పడు సన్నజాజులను ఎగరవేస్తుంది

ఒక్కతే ఆకాశంలో ఉన్న మేఘం కూడా ఇటువైపే చూస్తుంది
దూరాన నీలినీడగా నిలుచున్న కొండలు వెన్నెలమ్మ ఇక్కడకు కూడా వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాయి

సన్నజాజుల వాన నీటినంతా పన్నీరుగా మారుస్తుంది

ఈ ఆకాశం, నీలి కొండలు, సన్నజాజులు, నువ్వు-నేను!

7 comments:

MURALI said...

Good work.

http://muralidharnamala.wordpress.com/

రాధిక said...

baagundandi.

Sasik said...

thankyou radhika garu

Anonymous said...

good ..good...

అన్న్ట్టట్టూ... " వెన్నెల కురిసిన రాత్రి" ( యండమూరి నవల కాదు) చదివావా?

Sasik said...

Ledandi chadavaledu! maa library lo undemo choodali

Bolloju Baba said...

కురులు సన్నజాజులు ఎగరెయ్యటం
వాననీటిని పన్నీరుగా మార్చే సన్నజాజులు
సన్నజాజుల వెన్నెల
ఎంత గొప్పవైన పదచిత్రాలండీ.

మంచి భావుకత నిండిన అభివ్యక్తి.
గొప్ప కవిత

బొల్లోజుబాబా

రసజ్ఞ said...

ఒక్కొక్కటీ చదువుతుంటే ఒక అద్భుతమయిన భావన మీరు వాడిన ఆ పదప్రయోగాలు మీ భావుకతకి మరింత వన్నెనిస్తున్నాయి!