మాటలుమాటలు రావు
కానీ ఒంటరి మేఘం చిరుచినుకుతో పలకరిస్తే
ఎదురు చూసిన వరిచేనులా పులకరిస్తాను

అప్పుడొస్తాయి మాటలు
చెమర్చిన చిరుపెదవులపై తుమ్మెదలై
మూసిన కనురెప్పల మాటున ఇంద్రధనుస్సులై
అప్పుడొస్తాయి మాటలు

6 comments:

ప్రతాప్ said...

కవిత చాలా చిన్నది, కానీ అది మోసే భావాలు మాత్రం చాలా ఉన్నాయి.
చాలా బావుంది.

Anonymous said...

బాగుందొయ్..
కాని..ఒక్క సందేహం.... ( వ్యవసాయ శాఖ వాళ్లని అడగాలి అనుకుంట..)
తొలకరి వచ్చాక వరి నాట్లు వేస్తారా.. లెక ..నాట్లు వేసాక తొలకరి వస్తుందా?

--------
ఒక సారంట.. శ్రీ శ్రీ వాల్ల మిత్రుడున్నూ "దేవదాసు" సినిమా చూసి రిక్షా లొ వస్తూ " కుడి ఎడమయితె పొరపాటు లెదొయ్.." పాటకి అర్ధం లేదు అని అనుకుంటున్నారట.
దానికి ఆ రిక్ష వాడు అన్నాడట.. " అయినా బాబు గారు... తాగుబొతు మాటలకు అర్ధాలు ఉంటాయంటండి?" అని అన్నడట..

( ఎందుకు చెప్పానబ్బా.....??) :-)
---
Next time I should give possitive comments...hihihihi

Sasik said...

ఈ కవితకి అసలు అర్థంవేరే ఉంది. ఇక్కడ తొలకరి ఆప్తుల పలకరింపు. ఎదురుచూపు ఆప్తుల కోసం అన్నమాట.ఎదురుచూస్తున్నప్పటి మౌనం కలిసాక ఇంక ఉండదు కదా? ఈ అర్థం కోసం చూస్తుంటే కుడి ఎడమల పొరపాటు జరిగింది.

Anonymous said...

బాగు బాగు..బాబు. ( నీ జవాబు మాత్రమే సుమా...)
(కాకపొతే.. మార్కులు ముందే ఇచ్హేసాను కాబట్టి.. PMT time లొ మార్పు చేయను గాక చేయను..)

నీకు తెలుసనుకుంట.. "మహా ప్రస్థానం " కొసం శ్రీ శ్రీ చలం కి చెబుతాడు :"అనుభవించి పలవరించమని" (reverse లొ కాదు).

Sasik said...

మీకు లాజిక్కుతో చాలా దోస్తీ అనుకుంటాను. కవిత కొంచెం మార్చాను. ఇప్పుడు సరిపోయిందేమో చూడండి.

Anonymous said...

మార్పు కి ఎప్పుడూ స్వాగతమే..

కాకపొతే ఈసారి " అనుభవించినప్పుడే" సరిగ్గా చూసుకొ...
పలవరింతలు రాకుండా రాసుకొ..
( నాక్కూడా ప్రాస కలుస్తోంది...)

అప్పుడెప్పుడొ చెప్పాను గుర్తుందా..
(" ఈ ప్రశాంత సమయములొ.. ఈ తుషార వాటికలొ..వస్తావని కలగంటి..వచ్చావని కనుగొంటి..)
ఇంకా కొన్ని..
- నీ వస్తావని బ్రిందావని ఆశతొ చూసెనయ్య..
- ముందు తెలిపినా ప్రభొ...
ఈవన్నీ అష్టవిధ కధానాయికల లొ " విరహొథ్ఖంటిక" లక్షణలు .. కదా? ( మగవాళ్ళకు విరహం ఉందకూడదా అని అడక్కు..)
------------
అయ్యొ.. ఈ కవిత ఆప్తుల కొసం అని చెప్పావు కదూ .. మొత్తం కష్టపడి రాసాక గుర్తుకు వచ్చింది ..)