మనసు నిండితే

నిండిన మది ఏకాంతం

నిండుకుంటే అదే ఒంటరితనం

ఆరెంటి దూరమే స్వాంతన

Peep Chirp Quack Parrot Sparrow

 Peep Chirp and Quack with two birds



మరుసటి రోజు సోమవారం గానీ సెలవు. టిఫిన్ చేసి బెడ్ల మీద పడుకొని బొమ్మలు వస్తున్నారు. శేషు Peep Chirp and Quack బొమ్మ వేసాడు. ముగ్గురూ కిల కిలా నవ్వుకుంటున్నారు.

రుక్మిణీ, భామా వచ్చారు వీరి నవ్వులు విని. మాకూ చెప్పమన్నారు. కిట్టు చక్రి శేషు చెప్పమన్నారు. 


రుక్మిణీ కిట్టు గాడి బెడ్డు మీద కోర్చొని, కిట్టూ నన్నూ మీ గ్రూప్లో తీసుకో అని అదిగింది.

కిట్టూ ఇందులో అబ్బాయిలు మాత్రమే అన్నాడు. రుక్మిణీ, భామకు ముక్కు పుటాలకు కొపం వచ్చింది.


కారణం చెప్పమన్నారు. కిట్టూ మెల్లగా అన్నాడు, ఆడ పిల్లల దగ్గర ఆడ కంపు వస్తుంది అని.

అగ్ని పర్వతమం బద్దలయ్యింది. 


రుక్మిణి అమాంతం కిట్టు కింద తోసి మీద పడింది. గోల్లుతో గిల్లింది. బుగ్గల మీద రక్కింది. భామ పీక మీద కూర్చుంది, గుండెల మీద గట్టిగా గుద్దింది.

కిట్టు చక్రి శేషు లను పిల్చాడు. హెల్ప్ హెల్ప్ అని.

తమ తమ చెల్లల్లతో బాగ అనుభవం ఉన్న ఇద్దరూ దూరంగా ఉండి పోయారు.

రుక్మిణీ, భామ మల్లీ అడిగారు గ్రూప్లో తీసుకో అని.

మీ దగ్గర ఆడ వాసన పోతే అన్నాడు.

రుక్మిణీ, భామ, చక్రి శేషుని చూస్తూ మీకు అక్కా చెల్లెల్లు లేరా, సిగ్గు లజ్జా రాదా అని తిట్టారు. 

చక్రి వెంటనే పోనీ ఒప్పుకోరా కిట్టు అన్నాడు.

కిట్టు పొరా బోకా అనేలోపే, చక్రి కిట్టుకి కిత కితలు మొదలు పెట్టాడు.

అన్ని దెబ్బలకు మారని కిట్టు, ఇంక వప్పుకోక తప్ప లేదు. 


ఆలా, Peep Chirp and Quack లకు parrot and sparrow కలిసారు. 


                                                  

 



నో పేరెంట్స్ డే

నో పేరెంట్స్ డే



ఆ రోజు తల్లిదండ్రులు వచ్చే రోజు.  వీల్లకి ఇదే మొదటి పేరెంట్స్ డే. పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. ఎప్పుడో ఒక సారి స్నానం చెసే రవి కూడా తెల్లారే తయారు అయ్యాడు. పేరెంట్స్ వస్తారు అడుగుతారు  అని మంచి  భోజనం పెట్టడం కూడా మొదలు పెట్టారు మెస్సులో.  

కిట్టూ ఉదయం లేచి తొందరగా తయారు అయ్యి రావి చెట్టు కింద చేరాడు. అమ్మ యే చీర కట్టుకుని వస్తుంది, నాన్న నాకోసం ఏమయినా బొమ్మ తెస్తారా అని బాగా కుతూహలంగా ఉన్నాడు. టిఫిన్ బెల్లు కొడితే ఓస్ ఇదొక తిండా ఒక గంటలో అమ్మ తినిపిస్తుంది అని ఉండిపోయాడు. 

మొదటి బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నారు కొందరు పెద్దవాళ్ళు. కిట్టూ ముందుకే పరుగెత్తి వెళ్ళాడు, అమ్మలా ఒక చీర ఉంది, చీ కాదు.  సరే ఇంకా చూసాడు. అందరూ వచ్చేశారు. వీళ్ళల్లో లేరు. సరే ఫస్ట్ బస్ కదా అని బోరింగ్ దగ్గర నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నాడు.

ఇష్టం అయిన ఆంజనేయున్ని మొక్కాడు. తరువాతి బస్సులో అమ్మానాన్నా రావాలి అని.  రెండో బస్సు వచ్చింది. చాలా వెతికాడు 10 దాటింది, పేరెంట్స్ కనిపించలేదు. ఎవరెవరికో వచ్చేశారు. గొంతులో గరగర బాగా రోడ్డు మీదకు వచ్చి చూస్తున్నాడు. 

ఆంజనేయుడు రాముడికి మాత్రమే ఏమో అని. ఇప్పుడు వినాయకుడికి మొక్కుతున్నాడు. 12 దాటింది. మూడో బస్సులో ఒక పెద్ద ఆయన వచ్చి బాబూ చాలా urgent పనిమీద మీ పేరెంట్స్ ఊరు వెళ్ళారు నీకు ఇమ్మని biscuits ఇచ్చారు అని. తీసుకున్నాడు, భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది అని చదివాడు గానీ అప్పుడు మాత్రం కళ్ళ చుట్టూ భూమి తిరిగినట్టు అనిపించింది. విశ్వం ఎంత పెద్దదో క్లాసులో విన్నాడు గానీ ఆరోజు అనంత విశ్వం లో ఒక్కడూ ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది.

దేవుల్లను అబ్బనా బూతులు తిట్టి, జీడి చెట్టు కింద చేరాడు ఆకాశంలోకి చూస్తూ. ఇంక ఈ సింధు కాలం నాటి దెవతలను మాని మొసెస్, జీసస్ వయిపు మారి పోదాం అని గట్టిగా అనుకున్నాడు.
ఏకాంతం మాత్రం తెలిసిన కిట్టూ కి ఒంటరితనం మొదటిసారి అనిపించింది. ఆకాశం కప్పేటట్టు  నీటి పొర కల్లల్లోకి. నేను పుట్టముందే నీలి పొర… అని ఏదో గుర్తొస్తుంది. 

బిస్కెట్ ప్యాకెట్ మీద కాగితం పయిన నాన్న రాసిన దస్తూరి మళ్ళీ మళ్ళీ చదివాడు. ఆకాశం వంక చూస్తూ ఒక ముక్క నోట్లో పెట్టాడు…. గొంతు పిసికినంత ఉక్కిరి బిక్కిరయ్యాడు.

దగ్గర్లో అలికిడి అయ్యింది. చూస్తే చక్రి, శేషు . క్రోధం ..

ఏరా ఇక్కడేం దొబ్బుతున్నారు అన్నాడు. కోపం గా. దగ్గరికి వస్తే కొట్టేలా.

ఓ నీకూ రాలేదా అన్నాడు చక్రి.

లేదు అన్నాడు.

మీకు..

లేదు అన్నారు ఇద్దరూ.

ఎందుకు…. మళ్ళీ మిల్లు మూసేశారు మా ఊర్లో ఎవరికీ పేరెంట్స్ రాలేదు అన్నారు. 


అర్థం అయ్యింది. పాపం అని Biscuits ఇచ్చాడు. నువ్వు తినరా నాకొద్దు అన్నాడు చక్రి, నాకూ వద్దు అన్నాడు శేషు. 

నిశ్శెబ్దం.

మీకు peep chirp duck తెలుసా అన్నాడు కిట్టు. తెలీదు అన్నారు. peep ఒక Kodi పిల్ల, దారి తప్పడి oka soup డబ్బాలో ఉంటుంది. Chirp oka ఎర్ర పక్షి , duck ఒక బాతు. వీళ్ళు అందరూ అనాథలే కానీ ఈ మూడు పక్షులు కలిసి బిగ్ wide world చూస్తాయి. మనం అనాథలు కాదు కానీ ప్రస్తుతానికి అయినట్టే.

చక్రి శేషు కి కిట్టుగాడి కథ , ఆ example నచ్చాయి. 

Peep chirp & duck అనే వీరి గ్రూప్ అలా మొదలయ్యింది. సరే ఒక పని చేద్దాం అన్నాడు శేషు. వాక్కో అన్నాడు చక్రి. 

సరే బిగ్ world ఎక్కడ ఉంది అన్నాడు శేషు.

మన స్కూల్ వెనకాల మామిడి తోట ఉందా ఉంది. గానీ మామిడి కాయలు పూసి 6 నెల్లు అయ్యింది రా ఫూల్ అన్నాడు. ఆగు ఇంక ముందుకు వెళ్తే ఒక కల్లు పాక వుంది. ఔను. అన్నారు

స్కూల్ వెనుకాల మామిడి తోట లోకి పోదాం , చక్రీ గాడు నీకు బుర్ర లేదురా కిట్టు అక్టోబర్ లో మామిడి తోటలో టెప్పి తోటకూర తప్పి ఉండవు.

 కిట్టూ డియర్ చక్రి హహహ. నేను చూపించ పోయేది , కల్ల పాక. కల్ల పాకలో పునుకులు ఎప్పుడయినా తిన్నారా అన్నాడు. లేదు అని అన్నారు ఇద్దరూ. ఓకే follow me.

 ఒక బకెట్ లో నీరు, ఒక చంబు , ఒక బాటిల్  పట్టుకున్నారు ఎవరయినా అడిగితే ప్రకృతి పిలిచింది అని చెప్పడానికి.

కల్ల పాక దగ్గరకు వచ్చారు, డబ్బుల్లేవు అన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చింది

మామ్మా కొంచెం ఏమయినా పెడతావా అని అడిగాడు. మామ్మ చూసింది ఆ కొంచెం నీళ్ళు ఇస్తారా అన్నది. ఓ ఇంకా కావాలంటే ఇంకా తెస్తాం అన్నాడు. మామ్మకు ముచ్చట వేసింది, తల నిమిరి, అందరికీ తలో కారపు పునుకు ఇచ్చింది. వీళ్ళకు వెంటనే నాలిక మంటలు... మామ్మా కాలిపోతుంది అన్నారు. మామ్మ చెరో ముంతా కల్లు పోసింది, అదే కారం గొడవలో ముగ్గురూ తాగేశారు.

కాసేపటికి కొంచెం ఎక్కింది, మామ్మ పిల్లలు తాగొచ్చా అన్నారు. మరి ఈకాలం మాబోటోల్లు ఏం తిని బతకాలి అన్నది.

కిట్టు శేషు చక్రి తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. ప్రకృతి అద్భుతం అనిపిస్తుంది. అకాశం గొడుగు వెస్తే, మేఘాల్లో తెలినట్టు ఉంది. దమ్ముంటే కాస్కో, చాలెంజే చేస్కో… అని గట్టిగా పాడుతూ వస్తున్నారు.

దారికి ఇంకో చిన్న చెట్టుకు కల్లు ముంత కట్టి ఉంది. చక్రి గాడు బాగా ఆకలేస్తుంది రా అని చెట్టెక్కి కిందకు లాగాడు. అది చేతిలోకి వచ్చేసింది. ముగ్గురు మళ్ళీ తాగారు. ముంత పైకి కట్టమని శేషు గాడికి చెప్పారు, శేషు వీరి ముగ్గురిలో ఇంకా బలహీనం. కట్టబోతూ, కింద పడ్డాడు. ముంత పగిలింది వీడి ముడ్డి కూడా పగిలింది.

ముగ్గురు ఇంకా వల్లకాదు అని రాజీవ్ హౌస్ చేరి బోర్లా పడి పడుకున్నారు.

సాయంత్రం వేళ అవుతుంది, కేవలం గోచి కట్టుకుని ఒక ముసిలోడు మెస్సు దగ్గరకు వచ్చేసాడు,  తాగి ఉన్నాడు

 మీ పెద్దాయన్ని తోలమని అరుస్తున్నాడు

 బాగా కేకలు పెడుతున్నాడు. ఆంధ్ర భాషలో ఎన్నెన్ని అవయాలు కలిపి తిట్టొచ్చో ఆరోజు తెలిసింది పిల్లలకు.

వాడి తిట్లు వినడానికి పిల్లలు కిటికీల దగ్గరికి వచ్చి గొల్లు గొల్లు గా నవ్వుతున్నారు.

కోటిగాడు (అదే గౌరవనీయులయిన ప్రింసిపల్) వచ్చాడు.

ఏం కావాలి అన్నాడు. మీ కుర్రాళ్ళు ముగ్గురు. నాకల్ల ముంత పగల గొట్టారు.

డబ్బులు ఇప్పించండి వెళ్ళిపోతాను అంటున్నారు.

కోటేశ్వరరావు కి కోపం భూకంపం వచ్చినంత వేగంగా వచ్చింది.

నేనివ్వను అన్నాడు.

గోచి కట్టుకొని ప్రింసిపల్ వెనకాలే వెళ్ళాడు ఆసామి.

ప్రింసిపల్ chamber ముందే కూర్చొని నానా తిట్లు తిడుతున్నాడు.

పిల్లలు గుమి కూడి బాగా నవ్వుతున్నారు. కోటి గాడికి కోపానికి తగిన ఆసామి దొరికాడు అని. కోటి ఇంకా తప్పక వచ్చి 5 రూపాయల 50 పైసలు ఇచ్చి పంపించాడు.

డిన్నర్ టయిమ్ అయ్యాక లేచారు ముగ్గురూ.

వీళ్ళ కంపు కేవలం అరో తరగతి చిన్న గదిలో ఉన్న అమ్మాయిలకు మాత్రమూ తెలిసింది.

వీళ్ళు లేచే సమయానికి, రుక్మిణీ, భామా నడుం మీద చెయ్యి వేసుకుని ముందరికి వచ్చారు.

అబ్బాయిలు మీరు తాగొస్తే మంచి మాట కాదు, అంది రుక్మిణీ. ఇది respectable లేడీస్ ఉండే చోటు, భామ తొక్క తీస్తాను అన్నాది. తాగి వచ్చి రాత్రి పూట అమ్మా అయ్యా అని ఏడిస్తే మేము వచ్చి ఓదార్చమని, డొక్కలో తంతామని చెప్పారు. వాళ్ళ కోపానికి ఈ ముగ్గురి మత్తు దిగింది.

ఒక్క క్షణంలో ముగ్గురూ కాళ్ళ మీద పడ్డారు. రుక్మిణీ వెల్లిపోబోయింది. కిట్టూ అలవాటుగా, చనువుగా నడుము పట్టుకున్నాడు ఆపడానికి. గెడ్డం పట్టుకున్నారు. తాగీసి ముట్టుకుంటే రక్కుతామన్నారు.

వీల్లు చివరకి కావాలంటే బట్టలు ఉతుకుతాము అని ఒప్పుకున్నారు. జన్మలో తాగమని ఒట్టులు వేసారు. వారు బతిమిలాడుకుంటుండగానే  నైట్ బెల్ మోగింది. పేరెంట్స్ రాని పేరెంట్స్ డే ఆలా సుఖాంతం అయ్యింది. కథ కంచికి.....

వింటున్నావా

 




శ్రావణపున్నమి రాత్రంతా జడివాన

వెన్నెల్లో ఇంద్ర ధనుసు 

నీ కన్నుల తిన్నెల్లో ఉన్నా

నేనెందుకు నీకు అలుసు


కత్తి పడవ


 పాత పేపర్ల దొంతర్లో 

దొరికిందో  తెల్ల కాగితం

మడతపెట్టని కత్తి పడవో 

రాయని సెలవు చీటీయో 

బాల్యాన్ని అడగాలి

వరం

 


వీళ్ళ బ్యాచ్ చాలా లేటుగా జాయిన్ అయ్యారు ఆ సంవత్సరం. 26 సెప్టెంబర్ లో జాయిన్ అయిన బ్యాచ్ కు , గాంధీ జయంతి మొదటి అనుభవం. స్కూల్ నిండా హడావిడి గా వ్యక్తృత్వ పోటీలు, ఇంగ్లీష్ లో ఎలక్యూషన్, debate, వ్యాస రచన పోటీలు పెట్టారు.

కొత్త కదా 6వ తరగతి నుండి ఎవ్వరూ వెళ్ళలేదు. భయం కొంత ఆ ఇంగ్లీష్ గ్రామర్ కొంత తెలీక. ఒకరిద్దరు బొబ్బిలి వాళ్ళు వ్రాశారు ఎస్సేలు. 

ఆ రోజు ఒకో తరగతి నుండి dias మీదకు వచ్చి గాంధీ గురించి చెప్పమన్నారు.

పెద్ద క్లాస్ వాళ్ళు హుందాగా వచ్చి ఫ్యాట్ ఫ్యాట్ మంటూ చెప్పి దిగి పోయారు.

6త క్లాస్ వంతు వచ్చింది. అడిగారు స్టేజ్ మీంచి. కేవలం కిట్టు పేరు విన్నారు కదా. కిట్టు వచ్చి చెప్పు అన్నారు తెలుగు మేడం.

కిట్టూ ఉస్సూరు మంటూ ఎక్కాడు.

మైక్ కి అందలేదు, కిందకు వంచారు

కిట్టు ఎడం వయిపు చూసాడు, మళ్ళీ కూడి వయిపు చూసాడు.

LOVE అన్నాడు బిగ్గరగా మైక్ లోకి. బాగా పెద్ద రీసౌండ్ వచ్చింది. ఆ మాట అనకూడదేమో అనిపించినా, గబుక్కున మాట్లాడట0 మొదలు పెట్టాడు.

Love is the benevolence of intent. Non violence is absolute benevolence. Hence to love is to be nonviolent" అన్నాడు.

Stage మీద ఉన్న టీచర్లు మెరుపు పడిన తాటి చెట్ల లా స్తంబాలు అయ్యారు.

తెలుగులో చెప్పు అని  మాస్టారు అన్నారు. 

ప్రేమ అంటే కరుణ. అహింస అంటే అన్నివేళలా కరుణ చూపటం. అంటే ప్రేమించటమే అహింస.

అని చటాలున దిగిపోయాడు.

......

కొన్ని క్షణాలు ఒక పిన్ను పడినా వినిపించే నిస్సెబ్దం.  తెలుగు చెప్పే సంస్కృత సార్ పెద్దగా చేతులుచాపి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆయన వెనుకాల ఒక్కొకరుగా అంద రు ఫ్యాకల్టీ కొట్టారు. 


కోటిగాడు కోటి రూపాయల లాటరీ దొరికినట్టు. hahahahaha ani పెద్దగా నవ్వాడు. తెలుగు సార్ మీరు చెప్పండి కిట్టు ఏమన్నదీ అని.

మాస్టారు వచ్చి అర్థం అయ్యిందా కిట్టు అన్న మాటలు అని అడిగారు. ఇంచు మించు అందరూ లేదు సార్ అన్నారు.

 కిట్టు గాంధీ సారం మొత్తం మూడు ముక్కల్లో చెప్పేశాడు. ప్రేమ అనే గుణం ఉంటే అహింస తనకు తానుగా వస్తుంది అని. ఎన్నో ఏళ్లు గాంధీ నీ చదివిన వాళ్ళు కూడా చెప్పలేం అలాంటిది ఆశువుగా చెప్పాడు కిట్టూ. అవేశం గా మన నవోదయ కు దేవుడిచ్చిన వరం కిట్టు this is really special అన్నారు sir. 

కిట్టూ కి తను అంత గొప్పగా ఏం చెప్పేశాను అని అర్థం కాలేదు. మళ్ళీ చెప్పమంటే అదే చెప్తాను అని guarantee కూడా లేదు.

కిట్టూ లైన్లో వెళ్తుంటే, ఒక అయిదున్నర అడుగుల అమ్మాయి, మల్లె పువ్వు చున్నీ, సమ్పంగి పువ్వు లాంటి నవ్వుతో దగ్గరకి వచ్చింది.

చిరంజీవి సినిమా గాంగ్లీడర్ లో విజయశాంతి లా అనిపించింది కిట్టు గాడికి, వెనుకనే ఇంకా ఎత్తుగా ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో కాంతితో ఇంకో అబ్బాయి. సినిమా జంట లాగా ఇద్దరూ దగ్గరికి వచ్చారు.

బిందు కిందకు మోకాలి మీద కూర్చుని తమ్ముడు నీ మూడు ముక్కలతో బాగా చెప్పావు స్పీచ్. అని బుగ్గమీద ఏక బిక ముద్దు పెట్టింది, బుగ్గలు గట్టిగా చిదిమి0ది. చివరిగా తనకు తల్లి దగ్గర దొరికిన అనుభూతి మళ్ళీ ఇక్కడ. అరవింద్ అంట గొప్ప స్టూడెంట్ అంట తను వచ్చాడు, సూపర్ తమ్ముడు అని వీపు మీద చరిచి, నీకు గోపాల్ తో కలుపుతాను నీకు వాడికి సరిపోతుంది అని చెయ్యి పట్టుకొని  క్లాసులోకి తీసుకు పోయాడు. సీనియర్ క్లాసులో కిట్టు ఒక సంచలనం. అందరూ రావడం వీడు నెక్స్ట్ జవహర్ అనొ అరవింద్ అనో, గోపాల్ అనో అనడం, వీడు తెలీక నవ్వడం. ఒక అర గంట పోయాక 6 తరగతి దగ్గర వదిలే సారు. అలా ఇంకో వారం జరిగిపోయింది.

వేమనలా జ్ఞానోదయం

 



ఇది జరిగిన కొన్నాళ్ళు కిట్టు డ్రాయర్ లేకుండా చాలా బాధ పడ్డాడు. తన వస్తువులన్నీ మాయం అయ్యాయి అని ఇంక ఎవరికి ఏమీ ఇవ్వడం మానేశాడు, ఇవ్వటానికి కూడా ఏమీ మిగల లేదు.  I live for me, అన్న మాట.

ఒక రోజు యథాలాపంగా గ్రౌండ్లో పరుగెడుతున్నారు అందరూ morning drill కోసం. కిట్టూ శేషు చక్రి స్కూల్ మొత్తానికి ముందు ఉంటారు హైట్లో బాగా తక్కువ కాబట్టి. పక్కనే సీనియర్స్ కూడా ఒకొక దూరానికి పక్కనే పరిగెడుతున్నారు అందరికీ instructions ఇస్తూ.

తెల్లారే ఏదో సినిమా కథ హావ భావాలతో చెప్పేస్తున్నారు చక్రి శేషు. కిట్టూ వింటున్నాడు. షూ లేస్ లూజ్ గా కట్టి, దానిని కట్టే వంక తో పక్కకి ఉండి పోవడం వీళ్ళ అలవాటు. ఆరోజు అదే లేస్ వలన కిట్టు కింద పడ్డాడు, వాడిమీద students stamping చేస్తూ వెళ్లిపోతున్నారు. అది పెద్ద దెబ్బ తగిలే ప్రమాదమే, ఇంతలో ఒక సీనియర్ వీడి మీద వాలిపోయాడు రక్షిస్తూ. పాపం చాలా మంది కుమ్మేసారు ఇద్దర్నీ. 


పక్కకి దొర్లి వీన్ని బయటకు లాగాడు సీనియర్, ఎదురుగా రామకృష్ణ ! 

కిట్టూ కి విపరీతమయిన ఆశ్చర్యం. తమ్ముడు ఎక్కడ తగిలింది అన్నాడు, వీడు సమాధా నం ఇచ్చే లోపే వల్లో వేసుకుని nurse దేవకీ దగ్గరకి పట్టుకు పోయాడు.

మేడం ఇంక అప్పుడే లేచారు నైటీ లో ఉన్నారు, గాభరాగా రూంలోకి తీసుకువెళ్ళి ఇద్దర్నీ పరీక్ష చేశారు. ఇంకో నిమిషానికి వీడు బాగా దెబ్బలు తినేవాడు నువ్వు చాలా బాగా కాపాడావు అన్నారు.

అయినా ఈ యధవ కోసం నువ్వు దెబ్బలు ఎందుకు తిన్నావు అంటే అదేంటి మేడం చిన్నవాడు ఏదో తెలీక చేశాడు మొన్న అన్నాడు. కిట్టూ కి మెల్లగా అర్థం అయింది ఈ నవోదయ ఆలోచనా పద్దతి. రామకృష్ణ చొక్కా తీసి చెక్కు చెస్తున్నారు మేడం, బాగా కవికి పొయిన్ది. ఎదో రాసి రామకృష్ణ నువ్వు బెస్ట్ స్టూడెంట్ విరా అని అంటున్నారు మేడం. 

అన్నయ్యని చూసాడు ఏక బికిన కాళ్ళను చుట్టి పట్టుకున్నాడు, నన్ను save చేసినందుకు చాలా thanks అని. కిట్టు తల నిమిరాడు. సరే తమ్ముడు అని చక్కా వెళ్ళిపోయాడు ramakrishna.

ఆ రోజు కిట్టు స్నానానికి బెడ్డు దగ్గర దాచుకున్న బకెట్ తీసుకుందాం అని వెళ్ళాడు. ఏదో పెద్ద హత్యా స్థలం లాగా అక్కడ నీరు చేరి ఉంది, కొందరు పిల్లలు గుమికూడి పాపం అంటున్నారు. కిట్టూ బకెట్ కి కన్నం పడిపోయింది. కిట్టూ కి విపరీతమయిన బాధ కలిగింది, ఇప్పుడు స్నానం ఎలా అని. ఎదురుగా ప్రసన్న వచ్చాడు, ఏరా నాతో రా అన్నాడు. కిట్టూ కి అర్థం కాలే, ఒక నెల రోజులు నుండి ఒక కాగితం కూడా ఎరువివ్వని వాడికి సహాయం ఎందుకు చేస్తున్నది అర్థం కాలేదు

ఉన్న సగం బకెట్ నీటిలో నాలుగు ముంతలు కిట్టూ కి ఇచ్చాడు. కిట్టూ ఆపద గడిచింది.

ఆరోజు కిట్టూ కి అర్థం అయింది సహజీవనం అంటే ఏమిటీ అని. డ్రాయర్లు లేకుండా పోయినా, వళ్ళంతా దెబ్బలు పడినా,  ఒక పెద్ద లెస్సన్ నేర్చుకున్నాడు.

బస్తీ మే సవాల్


రోజంతా తిండి లేకుండా సాయంత్రానికి మాత్రం బాగా ఆకలి వేసేది కిట్టూకి. టీ గొట్టం దగ్గర మాత్రం చాలా బాగా తాగేవాడు. బెల్లు కొట్టిన వెంటనే లైన్లో కి వెళ్లి గ్లాసు ని అయుధంలా వాడి వేడి వేడి టీ పట్టుకునే వాడు. 

టీ గ్లాసులు నిండే లోపు గ్లాసు తోసి నింపుకు నేవారు. కాసేపటికి కిట్టూ వంతు వచ్చింది. పట్టుకుంటూ ఉన్నాడు కిట్టు. ఇంతలో బిడ్డ ఆకారం, పక్కనే వచ్చింది గ్లాసు తోసి తనది నింపుతున్నాడు సీనియర్. కిట్టూ గ్గాడికి వల్లు మండింది. అన్నయ్య ఆగు అన్నాడు మళ్ళీ తోసాడు సీనియర్. అంతే ఏక బికిని గ్లాసు వెనక్కి లాగి వాడి మొఖాన కొట్టారు వేడి టీ. 


వాడికి మండింది. కిట్టూ ఫిల్టి పట్టుకుని పైకి లాగాడు, ఒక గట్టిగా లెంప కాయ వేశాడు. కిట్టూ కింద పడ్డాడు .. గానీ కిట్టు అదృష్టం ఎలా ఉందో పక్కనే వెళ్తున్న జాగ్రఫీ సిర్ చూసారు. ఏరా చిన్న వాళ్ళని కొడుతున్నవా అని, ఎదురుగా ఉన్న మఱ్ఱి చెట్టు కొమ్మ లాగి సీనియర్ నీ చిత్తుగా కొట్టాడు. బాగా దెబ్బలు పడ్డాయి ఆయనకు. కిట్టూ నీ చూసి పోరా అని పంపించేసాడు సిర్. 

ఆరోజు కిట్టు శౌర్య గాథ దావానలంలా వ్యాపించింది. కిట్టూ దెబ్బలు తిన్నాడు గానీ తన ఛాతి ముందుకు పెట్టుకుని మెక్కుతూ నడుస్తున్నాడు. 

Mess time, కిట్టూ కూర్చున్నాడు టేబుల్ మీద. సంగీత వచ్చింది, ఏంటి తమ్ముడూ నీకు బాగా డబ్బులు దొరికాయి అంట అన్నాది. నాకా దెబ్బలా... Small affair ..  అన్నాడు. సీనియర్లుకూడా నీ వలన దెబ్బలు తిన్నారు అంట. ఓస్ నాకు సీనియర్ ఒక మూతి మీద ఈక అని, లేని మీసం మేంచి ఒక ఈక పీకి ఉఫ్ఫ్ అన్నాడు. సంగీత విప్పిన  నోరు విప్పినట్టే ఉండి పోయింది.

కాసేపటికి సీనియర్లు వచ్చారు, అన్నయ్య దగ్గరకి సంగీత చేరింది. అన్నయ్య బాగా దెబ్బలు తగిలాయా అని బాధగా అడిగింది, ఏదో చెల్లి చిన్న మిస్ understanding అన్నాడు. ఔనా ఆ తమ్ముడు అలా అనలేదే, నువ్వు మూతి మీద ఈక సమానం అని చెప్పాడు, అన్నా

అక్కడున్న అందరూ అవాక్కయ్యారు, నిన్న తెల్ల చొక్కా వేసుకున్న పొట్టోడు అంత మాట అంటాడా అని.  అందరూ జాగ్రఫీ సిర్ దగ్గర చేరారు సార్ రామకృష్ణ  ఎలాంటి వాడో మీకు తెలుసు కదా. చూసారా ఆ కిట్టు గాడు ఎంత మాట అన్నాడో అని. సిర్ మీకు banana peal చేసి చెప్పాలా , చెయ్యాల్సిందే మెత్తగా చెయ్యండి అని ఆయన నవ్వుతూ అన్నారు. 

ఆ రొజు రాత్రి, కిట్టూ బెడ్డు చుట్టూ చాలా మంది చేరారు, తమ్ముడూ నీకు నెల రోజులు బకెట్ గానీ కడ్రాయర్ గానీ ఉండవు. నీకు దమ్ము ఎక్కువా కదా అని. అలా కిట్టు గొప్పదనం పూర్తిగా అర్థం అయ్యింది కిట్టు గాడికి.....

పునరపి జననం



బొగ్గు ట్రైన్ స్టేషన్ లోకి వచ్చినట్టు కలలో ఉన్నాడు కిట్టు. బండి వదిలే సమయానికి పెద్దగా విజిల్ వేస్తున్నారు ఎవరో, లేవాలి బాయ్స్ of Rajeev లేవాలి అని.

కళ్లు తెరిచాడు. ఒక పెద్ద ఆకారం పసుపు చొక్కా పెద్ద సాక్స్ లతో బూట్లు వేసుకుని బిగ్గరగా విజిల్ వేస్తున్నాడు. కన్నా చిట్టి తండ్రి లేవాలి అని కాకుండా ఇది ఏదో గొంతులో కరక్కాయ పడినట్లయింది. ఎక్కడున్నాడో ఇంక అవగతం అవ్వలేదు. 

సన్యాసి కృష్ణ రాజు, అనగా కిట్టు, చక్రి, శేషు, రుక్మిణీ భామలతో,  వైకుంఠపురం లో మేలుకుంటున్నాడు, శేషుశేష చక్ర రుక్మిణీ భామా సహిత సన్యాసి కృష్ణ.. ఉరఫ్ కిట్టు. ఈ రోజు మళ్ళీ పుడతాడు కొత్త కిట్టు.

ఈ కాలి దగ్గర ఇద్దరు ఆడ పిల్లలు ఎవరు, బెడ్డు పక్కనే చక్రి, శేషు ఏమిటి.  మెల్లగా గుర్తుకు వచ్చింది. రుక్మిణీ నీ లేపాడు వెల్లు వెల్ల మని గట్టిగా కటువుగా తోసాడు. అయిదుగురు లేచారు.

దూరంగా బెల్లు, విజిల్ సెబ్దాలు ఇవన్నీ విని అయోమయంగా ఉన్నారు. పెద్ద పిల్లలు ఒకొకరు కళ్లు తెరిచిన మరు క్షణం బూట్లు వేసుకుని పారిపోతున్నారు. అర్థం అయ్యింది కాసేపటికి ఇంకా బూట్లు ఇవ్వలేదు కదా అలాగే బయలు దేరారు, రుక్మిణీ ఏకంగా పరికిణీ లోనే గ్రౌండ్ కి వచ్చేసింది.

అక్కడ ఒక మగాడు పెద్ద జుట్టు విప్పుకొని నంబర్లు అరుస్తుంటే అక్కడకు వెళ్ళాడు, బాస్ అనబోయి అన్నయ్యా నేను ఎక్కడకికి వెళ్ళాలి అని. 

ఒక్క లెంపకాయ పడింది scoundrel,  p.e t madam ni. అక్కడకు వెళ్లి లయినప్ చెయ్, అని ఉరిమింది ఆడ గొంతుక. దీ. ని... అనుకుంటూ ముందుకు పోయాడు. 

అక్కడ మరో ఆకారం పొదవాటి జుట్టు విరబోసుకుని చేతులూ కాళ్ళూ సాగ తీస్తున్నాడు. దగ్గరకి వెళ్లి మేడం ఎక్కడ నిల్చో వాలి అన్నాడు. 

హహహ అని పెద్ద మగ గొంతుక. నేను మీ సార్ నిరా..... కిట్టు బుగ్గ మీద చెయ్యి పెట్టుకున్నాడు. 

ఓ sixth క్లాస్ కదా ... welcome.. అక్కడ huddle చెయ్యి అని మంచి హుషారు గా జవాబు వచ్చింది. ఓకే ఇక్కడ తిక్క ఎవడికుందో కూడా చెప్పలేం అని అర్థం అయ్యింది కిట్టు గాడికి. 

కాసేపటికి తెల్లారింది. అందరి మొకాలు చూస్తున్నాడు. ఇన్ని కొత్త మొహాలు ఓకే సారి చూసే సరికి వాడికి విచిత్రం గా ఉంది. ఒకడు ఏకంగా స్కూల్ బాగ్ తో వచ్చాడు, ఒక అమ్మాయి చిన్న నైటీ లోని ఒకడు చొక్కా లేకుండా ఉన్నాడు. pet madam sir ఒకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఇలా రావచ్చు ఇలా రాకూడదు అని. 

వెల్ల బొయే మున్దు, ఆ పొడవాటి జుత్తు తొ ఉన్న సారు, వెల్ల బోయే ముందు, ఇందాకల పొడవాటి జుట్టు ఉన్న సారు, జుట్టు పిలకలా కట్టి.  వెనక్కి తిరిగి గుట్టమీద నిల్చొని, అందరిచేత G. A. N. G Gang leader అని అరిపించాడు. 

కిట్టూకీ బాగా సరదాగా నూ ఇక్కడ టీచర్లకు తిక్కతో పాటు వేప కాయంత వెర్రి
కూడా ఉంటాది అనిపించింది

మళ్ళీ బెల్లు కొట్టారు. కిట్టూ కాళ్లు ఈడ్చుకుంటూ తన వస్తువులు పట్టుకుని బోరింగ్ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ చొక్కా లేకుండా వట్టి డ్రాయేర్ వేసుకుని అతి మురికిగా మట్టి మట్టి గా ఇద్దరు పిల్లలు.

ఇంకా పూర్తిగా తెల్లవారక, పక్కనే ఉన్న ఇసక బట్టీ కూలీ పిల్లలు లాగా కనిపించారు.

కిట్టూ కొంచెం నీళ్ళు కొట్ట మన్నాడు . మొకం నిండా బురద దుమ్ము తో ఉన్న వాళ్ళు పంప్ కొట్టారు. కిట్టూ మీరు స్కూల్లో కూలికి వచ్చారా అన్నాడు.

ఇద్దరూ నీ యబ్బరో.... నీకు అని కిట్టూ మీద అమాంతం పడి కిందకి తోసి మీద ఎక్కారు. కిట్టూ కి మెల్లగా ఆకారాలు కనిపించాయి. ఒరేయ్ చక్రీ అన్నాడు, ఔన్రా అని శేషు చక్రి జవాబు ఇచ్చారు.

నాది ఈ రోజు పుట్టినరోజు అని మెల్లగా చెప్పాడు.

కొంచెం తల మీద పోస్తారా అని. ఓస్ అంతేనా ఇద్దరూ కలిసి కిట్టు వాడికి కొన్ని ఉత్తిత్తి మంత్రాలతో తలంటారు. నిన్న ఉదయం అమ్మ తలంటు పోస్తుంటే చేసిన గొడవ గుర్తుకు వచ్చింది, చక్రీ శేషు తలమీద నీళ్ళు పోస్తుంటే కన్నీళ్లు తలంటులో కలిసిపోయాయి. కిట్టూ కి అభిషేకం జరిగింది వాళ్ళ దయవలన.

అలా ప్రార్థన సమయానికి చేరారు మెల్లగా. అమ్మ పెట్టిన తెల్ల యూనిఫాం వేసుకున్నాడు కిట్టు. ఆ రోజు white dress కూడా కదా, ఆరో తరగతి వరసలో చిత్రంగా కనిపిస్తున్నాడు  పొట్టి కిట్టు. 



ఒక చేట భారతం లాంటి ప్రేయర్ సాంగ్ పాడుతున్నారు.

థూ..నా.. జన్మ అనిపించేలా హిందీలో బాధగా ఉంది పాట. ఆ రాగం అషాడ మాసంలో ఆకలికి వీధి కుక్కలు ఏడుస్తాయే అలా ఉన్నాది. అంత హిందీ లో ఆ పాట రాసిన వాడికి రెండు కాళ్ళ మధ్య తడి తువ్వాలుతో కొట్టాలి అనుకున్నాడు. బావి దగ్గర అన్నయ్య తడి తువ్వాలుతో  బాదిన బాదులు గుర్తుకు వచ్చాయి. నవ్వు కున్నాడు.

తెలుగు పిల్లలకు హిందీ లో ఎందుకురా మొర్రో అనుకున్నాడు. ఉదయం పాట అంటే కశక్కురో.... కశక్కుద్దా... అలా ఉండాలి అని. తరువాత మూడు భాషల్లో ఏదో చెప్పారు, తరువాత ప్రపంచ తుమ్మ చెట్టు దినోత్సవం మీద ఇంగ్లీష్ లో వాగాడు ప్రిన్సిపల్  కోటిగాడు. ప్రిన్సిపల్ ని కొటి గాడు అని మాత్రమే పిలవాలి అని ఈ పాటికే గట్టిగా హెచ్చరించారు సీనియర్లు.

కిట్టూ కి ఈ జన్మ మీద విరక్తి పుట్టేస్తుంది. స్కూల్ రిక్షావోడు తిట్టిన తిట్లు మళ్ళీ మళ్ళీ  తిడుతున్నాడు. కాసేపటికి ఒక మేడం మైక్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు అని, చిన్న చీటీ మీద సన్యాసి వెంకట కృష్ణమ.. అనేలోపు కిట్టు.. కిట్టు... మేడం అని గట్టిగా అరిచాడు కిట్టు గాడు. తన పేరు సన్యాసి అని ఎవరికి తెలియకూడదు అని. సరే కిట్టు రా అన్నారు.

పయికి వెళ్ళాడు కిట్టు. వాడి వలకం, తెల్ల బట్టలు, ముడుకులు దాటిన పెద్ద నిక్కరు చూసి principal ki ముచ్చట వేసింది. 

స్కూల్ మొత్తం హ్యాపీ birthday పాడి, మూడు మూడ్లు తొమ్మిది సార్లు చప్పట్లు కొట్టారు. పుట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యాడు కిట్టు. అబ్బా స్కూల్ అంటే ఇదా అనుకుంటూ దిగబోతుంటే. ఆవేశంగా principal చూసారా పిల్లలూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నారు. I have a good feeling about this class. అని...

లైన్లో వెళ్తుంటే రుక్మిణీ చేతిలో బిళ్ళ పెట్టింది. తిను బర్త్డే కదా అని. ఆరోజంతా కిట్టూ ని ఒక హీరో లాగా చూసారు స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ బర్త్డే తమ్ముడు అని. అలా రెండో రోజు గడిచింది కిట్టు గాడికి. 

తొలి రాత్రి

కిట్టూ తన బెడ్డు వరకూ వచ్చాడు. కింద బెడ్డు అవ్వటం వలన పెద్దగా వెలుతురు లేదు. బోర్లా పడ్డాడు, ఉదయం 5 లేచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల వలన తలంతా దృశ్యాలు గిర్రున తిరుగుతూ ఉన్నాయి.

ఇది నిజమా కలా ఇంకా అర్థం కాలేదు. పై బెర్తుని గట్టిగా తన్నాడు, పైన చక్రి నీ..య... అని కిందకు వాలి మళ్ళీ తన్నావో జూటు మిల్లు పక్కన పాతేస్తా అని కేక పెట్టాడు.

కిట్టూ కి కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అన్నయ్య కదా తిడతాడు అలా అని. పెట్టె తీశాడు, కడుపు దేవెస్తుంది, అమ్మ వెలిపోతూ ఒక పూరి మాత్రం కప్పులో పెట్టి మరచిపోయింది.

కప్పు తీశాడు, ఒక ముక్క తిన్నాడు, ఆ రుచికి ...... 10000 కిలోమీటర్ల వేగంతో మనసు ఇంటి వంటింటికి చేరింది. అమ్మ వేసిన పోపు వాసన, అన్నం పెట్టి ఒకో ముద్ద తినిపించే విధం గుర్తుకొచ్చింది. 

కళ్లు ఆనకట్ట విరిగిన ఊరి చెరువులా ప్రవహిస్తున్నాయి, ఏడిస్తే ఆత్మాభిమానం, మెల్లగా గుక్క పెడుతున్నాడు.

అమ్మా నాన్నా డయరీలొ పెట్టిన ఫొటోలు తీసాడు. దాచుకున్న దుఃఖం పూర్తిగా అదుపు తప్పింది. ఫొటోలు తడిసి ముద్దయ్యాయి, అది చూసి దుఃఖం ఇంకా పెరిగింది.


పక్కనే ఒక door open అయ్యింది, "అబ్బాయ్ నువ్వు ఏడిస్తే అందరికీ ఏడుపు వస్తుంది. ప్లీజ్ ఏడవకే." అంటుంది ఒక ఆడ గొంతుక. 

శేషు గాడు మొకం వేలేసుకుని కిందకు దిగాడు, కిట్టు యేడకరా అని. చక్రి కూడా వచ్చాడు పక్కనే కూర్చున్నాడు, కాసేపటికి అమ్మాయిల గది లోంచి ఉదయం పరికిణీ వేసుకున్న రుక్మిణీ వచ్చింది. కొంచెం ఆగి, ఇందాకల అన్నాదే ఆ పిల్ల కూడా వచ్చింది   బాయ్ కటింగ్ లో అమ్మాయి, భామ. ఆచ్చం అబ్బాయి లాగా ఉంది.

అందరూ కిట్టు బెడ్డు దగ్గర చేరి వాడికి ఓదారుస్తూ తమను తాము ఓదార్చు కుంటున్నారు. 

అలా ఆ రోజు కిట్టు శేషు చక్రి రుక్మిణీ భామా కలిశారు. 

ఇదే వారి కొత్త జీవితపు మొదటి రోజు. అలా మొదలయ్యింది, నవోదయ వైకుంఠపురం లో క్రిష్ణశేషచక్రీరుక్మిణీభామా యుగం. 


నవోదయ వైకుంఠపురం




(ఇవి నా కథలు, కాదు మా కథలు, కొన్ని నిజాలు, కొన్ని కాల్పనికమ్, కొన్ని వుత్త సొల్లు కబుర్లు, కాని ఇవి నిజానికి దూరము కాదు. ఇందు లోని కిట్టు శేషు చక్రి రుక్మిణీ భామ ఒక్క పిల్లా పిల్లోడో కాదు. టామ్ సాయర్ లా వీళ్ళు composite పాత్రలు.కానీ వీరిని పోలిన వాళ్ళు నిజంగానే ఉన్నారు. వాళ్ళు ఈ ఫోటోల్లోనే ఉంటారు . 1994-2001 మధ్య, అనగా అనగా ఒక అశ్రమ పాఠశాలలొ జరిగిన విషయాలు ఇవి. Truth is stranger than fiction, because friction has to be possible but truth doesn't.)


బడి అంగణం లోకి ప్రవేశించగానే ఒక వయిపు రావి చెట్టు, ఇంకో వయిపు ఆశ్రమంలా ఓకే వరుసలో గడ్డి పాకల్లో తరగతి గదులు.

ఎవరో గొప్ప మహాత్ముడు కట్టిన ఆశ్రమం లాగా , తూర్పు పడమరల్లో బ్లాక్ బోర్డు ఉండి, ఉత్తర దక్షిణ ల్లో స్వేచ్ఛ గా గాలి వీస్తుంది. మామిడి తోరణాలు కట్టి పండుగ పూట లాగా తయారు చేసి ఉన్నాయి గదులు.

రావి చెట్టు పక్కన ప్రార్థనా ప్రదేశం ముందు ముగ్గు తో బొమ్మలు వేసి కొత్త విద్యార్థులకు స్వాగతం అని రాస్తున్నారు కొందరు అమ్మాయిలు. తెల్లటి చొక్కాలు, నీలం రంగు స్కర్ట్ వేసి కొందరు, కొందరు నిండుగా చుడీ దార్ , చున్నీ వేసుకుని నేర్పుగా వేస్తున్నారు. వాళ్ళు నవ్వుతుంటే కడిగిన ముత్యాలు కడవల్లో కదిలినట్టు ఉంది.


రావి చెట్టు కింద తెల్లటి చొక్కా, నిడువు బొట్టు పెట్టుకున్న ఒక పెద్ద ఆయన, హుందాగా కుర్చీలో కూర్చుని పేపర్ మీద రాస్తున్నారు. ఆయన చుట్టూ శివగణా ల్లాగా, ఒక ముగ్గు టీచర్లు, ఒక ముగ్గురు లేడీ టీచర్లు నిల్చున్నారు. వారి ముఖాల్లో ఒక కరకు దనం ఖచ్చితంగా కనిపించింది కిట్టు గాడికి.

ప్రవేశ మార్గానికి అడ్డంగా ఉన్న, కాలువ మీద ఉన్న చిన్న వంతెన దాటి లోపలికి రాగానే,  నాన్న చేతిలోని కాగితాన్ని May I see sir, అని ఒక పెద్ద కుర్రాడు లాక్కుని, మూడు సార్లు ఓకే ఓకే ఓకే అని, ఒక స్కెచ్ పెన్ను తో కిట్టూ జేబు మీద 521/R Ani రాసి , తమ్ముడూ అక్కడ R అని ఉన్న చోటికి వెళ్లి ఈ కాగితం మళ్ళీ చూపించు అన్నాడు.

కిట్టూ కి కొంచెం కోపం ముక్కులో కి వచ్చింది నా పేరు కూడా అడక్కుండా నంబర్ వేశాడు అని. "Boss, మరి పెట్టి బకెట్ ఏం చెయ్యాలి?" అన్నాడు. 

Boss అని విన్న సీనియర్ కి చిన్న షాక్ కొట్టింది. కిందకి చూసాడు, "అన్నయ్య అనాలి ఓకే? ఇక్కడ బోస్, మాస్టారు , గురూ గారూ అని పిలవకూడదు అని చెప్పాడు.

"సరే అన్నయ్యా పెట్టి ఏం చెయ్యాలి", అన్నాడు కిట్టూ. సీనియర్ మీ వాళ్ళకి ఇవ్వు అని చక్కా తీసుకు పోయాడు కిట్టూ ని. వాడిని వెనక నుండి చూస్తూ వీస్తూ పోయారు కిట్టూ అమ్మా నాన్నా మమ్మల్ని ఒక్క క్షణం లో ఎలా వదిలేశాడు అని.

లోపలకి వెళ్ళాడు కిట్టూ, అక్కడ ఒక చీర వాణి కట్టుకున్న ఒక లేడీ చేతిలో స్టెతస్కోప్, బస్టాండు
 బరువు చూస్తారు అలాంటి మిషన్ పక్కన నిలబడి ఉంది.

కిట్టు వెళ్ళాడు.

"సన్యాసి  వెంకట కృష్ణ రాజు". అని పిలిచింది 

"నేనే, కిట్టూ... కిట్టూ అనాలి", అని గుర్రుగా చూసాడు

"సరే కిట్టు ఇటురా" ఆన్నాది ఆవిడ. "ఎక్కు"

మిషన్ ఎక్కాడు.
18 !

ఆవిడ మిషన్ మీద మళ్ళీ కొట్టింది

"ఏరా 18 kg లేనా, 20 ఉండాలి అడ్మిషన్ కి" ఆన్నాది 

నానేం సేత్తాను అన్నాడు కిట్టు.


"ఏదీ కళ్లు చూపించు, అబ్బా. నువ్వేం తినవా"

 "YES, తింటాను జంతికలు కజ్జికాయలు తాండ్ర".... మేడం నెట్టి మీద ఒకటి వేసి అన్నం తినవా వెధవా ఆన్నాది.

"No, Madam not interested in rice"

సరే నిన్ను debar చేసీనా అని నవ్వీ, సంగీత వీడికి రెండు పెద్ద గ్లాసుల్లో పాలు పట్టుకురా అని పంపింది.

తాగించి మళ్ళీ weigh చేస్తాను అన్నాది మేడం. కిట్టూ కి అర్థం అయ్యింది 20 లేకపోతే రిజెక్ట్ అని. కామ్ గా పక్కన కూర్చున్నాడు

ఇంతలో ఇంకో  ఇద్దరు వచ్చారు. మేడం బుర్ర పట్టుకున్నారు ఈ సంవత్సరం కరువు మోహా లేంట్ర బాబు అని. పేర్లు చెప్పారు, చక్రి,  శేషు అని. 18, 17... సంగీత వస్తుంది రెండు గ్లాస్ లో పాలు పట్టుకుని. మేడం మళ్ళీ వీరికి తెమ్మని పంపించారు. 

మొత్తం మీద ముగ్గురికి పాలు పట్టి మెడికల్ టెస్ట్ పాస్ చేశారు మేడం.

కాసేపటికి ఒకొక కుర్రాన్ని వాడి బెడ్డు వరకు చేర్చారు సీనియర్లు.

ఇంక వీడ్కోలు సమయం, అమ్మ నాన్న సడెన్గా గుర్తుకొచ్చారు కిట్టూ కి. బయటకు ఓకే గుక్కన పరిగెత్తాడు.

అక్కడ చెట్టు దగ్గర తల్లి దండ్రులు, ఖులాసాగ మాటలు పెట్టుకున్నారు. కిట్టూ వచ్చి అమ్మ  కాళ్ళల్లో కి పరిగెత్తాడు. అమ్మ ఎత్తుకుంది నాన్న దగ్గరకు తీసుకొని, బాబు జాగ్రత్త సమయానికి తిని, ఉత్తరం రాయు, డబ్బులకు ఇబ్బంది పడకు అంటున్నారు. అమ్మ కళ్ళలోకి జడి వానలా కన్నీళ్లు, నాన్న జోబులోని ఉన్న రూపాయలు అన్ని కిట్టూ పై జోబులో వేసేశారు. అంత మనిషికి గుండెల్లో ప్రాణవాయువు పోతున్నట్టు చెట్టు మీద అనుకున్నారు.

కిట్టూ కి సందర్భం ఇంకా అర్థం కావటం లేదు, తన రోల్ నంబర్ , తాగిన పాలు, శేషు, చక్రి, ఇచ్చిన కొత్త పళ్ళెం, ట్రంకు పెట్టి,  బకెట్ ఇవే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఓకే ఓ అంటూ వింటున్నాడు.

All parents please head to the front అని బిగ్గరగా అన్నాడు ఒక సీనియర్ అబ్బాయి. చాలా పొడుగ్గా ఠీవి గా ఉంది మల్లెపూలాంటి చొక్కా పెద్ద కవాతు బూట్లలో ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా గర్జించింది అబ్బాయి కంఠం.

అంత పెద్ద parents మెత్తగా అబ్బాయి చెప్పినట్టు ప్రవేశ ద్వారం వయిపు నడిచారు.

ఒక అర గంట ఒకో పిల్లాడు పిల్ల పేరెంట్స్ దగ్గరకి పోవడం, వాళ్ళు చిన్నపిల్లలను బాగా ముద్దాడి బుద్దులు చెప్పి పంపించేయడం. మర్చిపోయిన విషయాలు చెప్పడం ఇలా ఒక 30 నిమిషాలు వీడ్కోలు జరిగాయి. సాయంత్రం సెషన్ కి బెల్ కొట్టారు

ప్రిన్సిపల్ ఇంకా కొత్త వార్డెన్లు కొందరు కాలువ మీద ఒక వయిపు నిల్చున్నారు.

వీడ్కోలు చెప్పే తల్లి దండ్రులకు వారి చిట్టి తల్లులు బుజ్జి పాపాయిల కనిపిస్తున్నారు. పాలు తాగటానికి నిన్నే మారం చేసిన కొడుకు, జడ వేయటం ఇంకా రాని పాపాయి, పూర్తిగా పాల నత్తి పోని అబ్బాయి వీళ్ళే వాళ్లకు కనిపిస్తున్నారు. కొందరు ఇక్కడయినా మూడు పూటలా తింటాడు అని ఒక రైతు ఆశ. ఒకరు ఇక్కడియనా తల్లి లేని లోటు మర్చి పోతుంది అని ఒక తండ్రి. ఇది వారి దృక్పదం.

మధ్యలో నిలపడ్డ టీచర్లకు, అదే పిల్లల్లో స్వాపినికులు, దార్శనికులు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనికులు కొట్టొచ్చినట్టు కనిపిసస్తు న్నారు.





"నవోదయ వైకుంఠపురం కాల్పనికమ్, కాని ఈ ఫొటొల్లొ ఉన్నవారు నిజాలు"

పిల్లలకు మాత్రం ఆ రోజు తమ జీవితాల్లో వచ్చిన మార్పు తమ ను నిలువెల్లా మార్చేస్తుంది అని ఇంకా అర్థం కాలేదు.

సాయంత్రం స్నానానికి బెల్లు మోగింది. బస్సు వచ్చింది, తల్లి దండ్రులు వారి దారిన పట్టారు. పిల్లల ముందు కళ్ళల్లోని కన్నీరు ఆపుకుంటూ ఎక్కారు, రయ్ అనబోయే కండక్టర్ గారికి ఒక క్షణం పట్టింది.

ఆరోజు వైకుంఠపురం బస్సులో తడవని కన్ను లేదు.