నవోదయ వైకుంఠపురం




(ఇవి నా కథలు, కాదు మా కథలు, కొన్ని నిజాలు, కొన్ని కాల్పనికమ్, కొన్ని వుత్త సొల్లు కబుర్లు, కాని ఇవి నిజానికి దూరము కాదు. ఇందు లోని కిట్టు శేషు చక్రి రుక్మిణీ భామ ఒక్క పిల్లా పిల్లోడో కాదు. టామ్ సాయర్ లా వీళ్ళు composite పాత్రలు.కానీ వీరిని పోలిన వాళ్ళు నిజంగానే ఉన్నారు. వాళ్ళు ఈ ఫోటోల్లోనే ఉంటారు . 1994-2001 మధ్య, అనగా అనగా ఒక అశ్రమ పాఠశాలలొ జరిగిన విషయాలు ఇవి. Truth is stranger than fiction, because friction has to be possible but truth doesn't.)


బడి అంగణం లోకి ప్రవేశించగానే ఒక వయిపు రావి చెట్టు, ఇంకో వయిపు ఆశ్రమంలా ఓకే వరుసలో గడ్డి పాకల్లో తరగతి గదులు.

ఎవరో గొప్ప మహాత్ముడు కట్టిన ఆశ్రమం లాగా , తూర్పు పడమరల్లో బ్లాక్ బోర్డు ఉండి, ఉత్తర దక్షిణ ల్లో స్వేచ్ఛ గా గాలి వీస్తుంది. మామిడి తోరణాలు కట్టి పండుగ పూట లాగా తయారు చేసి ఉన్నాయి గదులు.

రావి చెట్టు పక్కన ప్రార్థనా ప్రదేశం ముందు ముగ్గు తో బొమ్మలు వేసి కొత్త విద్యార్థులకు స్వాగతం అని రాస్తున్నారు కొందరు అమ్మాయిలు. తెల్లటి చొక్కాలు, నీలం రంగు స్కర్ట్ వేసి కొందరు, కొందరు నిండుగా చుడీ దార్ , చున్నీ వేసుకుని నేర్పుగా వేస్తున్నారు. వాళ్ళు నవ్వుతుంటే కడిగిన ముత్యాలు కడవల్లో కదిలినట్టు ఉంది.


రావి చెట్టు కింద తెల్లటి చొక్కా, నిడువు బొట్టు పెట్టుకున్న ఒక పెద్ద ఆయన, హుందాగా కుర్చీలో కూర్చుని పేపర్ మీద రాస్తున్నారు. ఆయన చుట్టూ శివగణా ల్లాగా, ఒక ముగ్గు టీచర్లు, ఒక ముగ్గురు లేడీ టీచర్లు నిల్చున్నారు. వారి ముఖాల్లో ఒక కరకు దనం ఖచ్చితంగా కనిపించింది కిట్టు గాడికి.

ప్రవేశ మార్గానికి అడ్డంగా ఉన్న, కాలువ మీద ఉన్న చిన్న వంతెన దాటి లోపలికి రాగానే,  నాన్న చేతిలోని కాగితాన్ని May I see sir, అని ఒక పెద్ద కుర్రాడు లాక్కుని, మూడు సార్లు ఓకే ఓకే ఓకే అని, ఒక స్కెచ్ పెన్ను తో కిట్టూ జేబు మీద 521/R Ani రాసి , తమ్ముడూ అక్కడ R అని ఉన్న చోటికి వెళ్లి ఈ కాగితం మళ్ళీ చూపించు అన్నాడు.

కిట్టూ కి కొంచెం కోపం ముక్కులో కి వచ్చింది నా పేరు కూడా అడక్కుండా నంబర్ వేశాడు అని. "Boss, మరి పెట్టి బకెట్ ఏం చెయ్యాలి?" అన్నాడు. 

Boss అని విన్న సీనియర్ కి చిన్న షాక్ కొట్టింది. కిందకి చూసాడు, "అన్నయ్య అనాలి ఓకే? ఇక్కడ బోస్, మాస్టారు , గురూ గారూ అని పిలవకూడదు అని చెప్పాడు.

"సరే అన్నయ్యా పెట్టి ఏం చెయ్యాలి", అన్నాడు కిట్టూ. సీనియర్ మీ వాళ్ళకి ఇవ్వు అని చక్కా తీసుకు పోయాడు కిట్టూ ని. వాడిని వెనక నుండి చూస్తూ వీస్తూ పోయారు కిట్టూ అమ్మా నాన్నా మమ్మల్ని ఒక్క క్షణం లో ఎలా వదిలేశాడు అని.

లోపలకి వెళ్ళాడు కిట్టూ, అక్కడ ఒక చీర వాణి కట్టుకున్న ఒక లేడీ చేతిలో స్టెతస్కోప్, బస్టాండు
 బరువు చూస్తారు అలాంటి మిషన్ పక్కన నిలబడి ఉంది.

కిట్టు వెళ్ళాడు.

"సన్యాసి  వెంకట కృష్ణ రాజు". అని పిలిచింది 

"నేనే, కిట్టూ... కిట్టూ అనాలి", అని గుర్రుగా చూసాడు

"సరే కిట్టు ఇటురా" ఆన్నాది ఆవిడ. "ఎక్కు"

మిషన్ ఎక్కాడు.
18 !

ఆవిడ మిషన్ మీద మళ్ళీ కొట్టింది

"ఏరా 18 kg లేనా, 20 ఉండాలి అడ్మిషన్ కి" ఆన్నాది 

నానేం సేత్తాను అన్నాడు కిట్టు.


"ఏదీ కళ్లు చూపించు, అబ్బా. నువ్వేం తినవా"

 "YES, తింటాను జంతికలు కజ్జికాయలు తాండ్ర".... మేడం నెట్టి మీద ఒకటి వేసి అన్నం తినవా వెధవా ఆన్నాది.

"No, Madam not interested in rice"

సరే నిన్ను debar చేసీనా అని నవ్వీ, సంగీత వీడికి రెండు పెద్ద గ్లాసుల్లో పాలు పట్టుకురా అని పంపింది.

తాగించి మళ్ళీ weigh చేస్తాను అన్నాది మేడం. కిట్టూ కి అర్థం అయ్యింది 20 లేకపోతే రిజెక్ట్ అని. కామ్ గా పక్కన కూర్చున్నాడు

ఇంతలో ఇంకో  ఇద్దరు వచ్చారు. మేడం బుర్ర పట్టుకున్నారు ఈ సంవత్సరం కరువు మోహా లేంట్ర బాబు అని. పేర్లు చెప్పారు, చక్రి,  శేషు అని. 18, 17... సంగీత వస్తుంది రెండు గ్లాస్ లో పాలు పట్టుకుని. మేడం మళ్ళీ వీరికి తెమ్మని పంపించారు. 

మొత్తం మీద ముగ్గురికి పాలు పట్టి మెడికల్ టెస్ట్ పాస్ చేశారు మేడం.

కాసేపటికి ఒకొక కుర్రాన్ని వాడి బెడ్డు వరకు చేర్చారు సీనియర్లు.

ఇంక వీడ్కోలు సమయం, అమ్మ నాన్న సడెన్గా గుర్తుకొచ్చారు కిట్టూ కి. బయటకు ఓకే గుక్కన పరిగెత్తాడు.

అక్కడ చెట్టు దగ్గర తల్లి దండ్రులు, ఖులాసాగ మాటలు పెట్టుకున్నారు. కిట్టూ వచ్చి అమ్మ  కాళ్ళల్లో కి పరిగెత్తాడు. అమ్మ ఎత్తుకుంది నాన్న దగ్గరకు తీసుకొని, బాబు జాగ్రత్త సమయానికి తిని, ఉత్తరం రాయు, డబ్బులకు ఇబ్బంది పడకు అంటున్నారు. అమ్మ కళ్ళలోకి జడి వానలా కన్నీళ్లు, నాన్న జోబులోని ఉన్న రూపాయలు అన్ని కిట్టూ పై జోబులో వేసేశారు. అంత మనిషికి గుండెల్లో ప్రాణవాయువు పోతున్నట్టు చెట్టు మీద అనుకున్నారు.

కిట్టూ కి సందర్భం ఇంకా అర్థం కావటం లేదు, తన రోల్ నంబర్ , తాగిన పాలు, శేషు, చక్రి, ఇచ్చిన కొత్త పళ్ళెం, ట్రంకు పెట్టి,  బకెట్ ఇవే తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఓకే ఓ అంటూ వింటున్నాడు.

All parents please head to the front అని బిగ్గరగా అన్నాడు ఒక సీనియర్ అబ్బాయి. చాలా పొడుగ్గా ఠీవి గా ఉంది మల్లెపూలాంటి చొక్కా పెద్ద కవాతు బూట్లలో ఏదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా గర్జించింది అబ్బాయి కంఠం.

అంత పెద్ద parents మెత్తగా అబ్బాయి చెప్పినట్టు ప్రవేశ ద్వారం వయిపు నడిచారు.

ఒక అర గంట ఒకో పిల్లాడు పిల్ల పేరెంట్స్ దగ్గరకి పోవడం, వాళ్ళు చిన్నపిల్లలను బాగా ముద్దాడి బుద్దులు చెప్పి పంపించేయడం. మర్చిపోయిన విషయాలు చెప్పడం ఇలా ఒక 30 నిమిషాలు వీడ్కోలు జరిగాయి. సాయంత్రం సెషన్ కి బెల్ కొట్టారు

ప్రిన్సిపల్ ఇంకా కొత్త వార్డెన్లు కొందరు కాలువ మీద ఒక వయిపు నిల్చున్నారు.

వీడ్కోలు చెప్పే తల్లి దండ్రులకు వారి చిట్టి తల్లులు బుజ్జి పాపాయిల కనిపిస్తున్నారు. పాలు తాగటానికి నిన్నే మారం చేసిన కొడుకు, జడ వేయటం ఇంకా రాని పాపాయి, పూర్తిగా పాల నత్తి పోని అబ్బాయి వీళ్ళే వాళ్లకు కనిపిస్తున్నారు. కొందరు ఇక్కడయినా మూడు పూటలా తింటాడు అని ఒక రైతు ఆశ. ఒకరు ఇక్కడియనా తల్లి లేని లోటు మర్చి పోతుంది అని ఒక తండ్రి. ఇది వారి దృక్పదం.

మధ్యలో నిలపడ్డ టీచర్లకు, అదే పిల్లల్లో స్వాపినికులు, దార్శనికులు, వైద్యులు, ఉపాధ్యాయులు, సైనికులు కొట్టొచ్చినట్టు కనిపిసస్తు న్నారు.





"నవోదయ వైకుంఠపురం కాల్పనికమ్, కాని ఈ ఫొటొల్లొ ఉన్నవారు నిజాలు"

పిల్లలకు మాత్రం ఆ రోజు తమ జీవితాల్లో వచ్చిన మార్పు తమ ను నిలువెల్లా మార్చేస్తుంది అని ఇంకా అర్థం కాలేదు.

సాయంత్రం స్నానానికి బెల్లు మోగింది. బస్సు వచ్చింది, తల్లి దండ్రులు వారి దారిన పట్టారు. పిల్లల ముందు కళ్ళల్లోని కన్నీరు ఆపుకుంటూ ఎక్కారు, రయ్ అనబోయే కండక్టర్ గారికి ఒక క్షణం పట్టింది.

ఆరోజు వైకుంఠపురం బస్సులో తడవని కన్ను లేదు.

1 comment:

Anu said...

నీలా ఎవరూ రాయలేరు.ఆ రోజుల్ని అక్షరాలుగా శాశ్వతం చేస్తున్నందుకు thank you.