కిట్టూ తన బెడ్డు వరకూ వచ్చాడు. కింద బెడ్డు అవ్వటం వలన పెద్దగా వెలుతురు లేదు. బోర్లా పడ్డాడు, ఉదయం 5 లేచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల వలన తలంతా దృశ్యాలు గిర్రున తిరుగుతూ ఉన్నాయి.
ఇది నిజమా కలా ఇంకా అర్థం కాలేదు. పై బెర్తుని గట్టిగా తన్నాడు, పైన చక్రి నీ..య... అని కిందకు వాలి మళ్ళీ తన్నావో జూటు మిల్లు పక్కన పాతేస్తా అని కేక పెట్టాడు.
కిట్టూ కి కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అన్నయ్య కదా తిడతాడు అలా అని. పెట్టె తీశాడు, కడుపు దేవెస్తుంది, అమ్మ వెలిపోతూ ఒక పూరి మాత్రం కప్పులో పెట్టి మరచిపోయింది.
కప్పు తీశాడు, ఒక ముక్క తిన్నాడు, ఆ రుచికి ...... 10000 కిలోమీటర్ల వేగంతో మనసు ఇంటి వంటింటికి చేరింది. అమ్మ వేసిన పోపు వాసన, అన్నం పెట్టి ఒకో ముద్ద తినిపించే విధం గుర్తుకొచ్చింది.
కళ్లు ఆనకట్ట విరిగిన ఊరి చెరువులా ప్రవహిస్తున్నాయి, ఏడిస్తే ఆత్మాభిమానం, మెల్లగా గుక్క పెడుతున్నాడు.
అమ్మా నాన్నా డయరీలొ పెట్టిన ఫొటోలు తీసాడు. దాచుకున్న దుఃఖం పూర్తిగా అదుపు తప్పింది. ఫొటోలు తడిసి ముద్దయ్యాయి, అది చూసి దుఃఖం ఇంకా పెరిగింది.
పక్కనే ఒక door open అయ్యింది, "అబ్బాయ్ నువ్వు ఏడిస్తే అందరికీ ఏడుపు వస్తుంది. ప్లీజ్ ఏడవకే." అంటుంది ఒక ఆడ గొంతుక.
శేషు గాడు మొకం వేలేసుకుని కిందకు దిగాడు, కిట్టు యేడకరా అని. చక్రి కూడా వచ్చాడు పక్కనే కూర్చున్నాడు, కాసేపటికి అమ్మాయిల గది లోంచి ఉదయం పరికిణీ వేసుకున్న రుక్మిణీ వచ్చింది. కొంచెం ఆగి, ఇందాకల అన్నాదే ఆ పిల్ల కూడా వచ్చింది బాయ్ కటింగ్ లో అమ్మాయి, భామ. ఆచ్చం అబ్బాయి లాగా ఉంది.
అందరూ కిట్టు బెడ్డు దగ్గర చేరి వాడికి ఓదారుస్తూ తమను తాము ఓదార్చు కుంటున్నారు.
అలా ఆ రోజు కిట్టు శేషు చక్రి రుక్మిణీ భామా కలిశారు.
ఇదే వారి కొత్త జీవితపు మొదటి రోజు. అలా మొదలయ్యింది, నవోదయ వైకుంఠపురం లో క్రిష్ణశేషచక్రీరుక్మిణీభామా యుగం.
No comments:
Post a Comment