నో పేరెంట్స్ డే

నో పేరెంట్స్ డే



ఆ రోజు తల్లిదండ్రులు వచ్చే రోజు.  వీల్లకి ఇదే మొదటి పేరెంట్స్ డే. పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. ఎప్పుడో ఒక సారి స్నానం చెసే రవి కూడా తెల్లారే తయారు అయ్యాడు. పేరెంట్స్ వస్తారు అడుగుతారు  అని మంచి  భోజనం పెట్టడం కూడా మొదలు పెట్టారు మెస్సులో.  

కిట్టూ ఉదయం లేచి తొందరగా తయారు అయ్యి రావి చెట్టు కింద చేరాడు. అమ్మ యే చీర కట్టుకుని వస్తుంది, నాన్న నాకోసం ఏమయినా బొమ్మ తెస్తారా అని బాగా కుతూహలంగా ఉన్నాడు. టిఫిన్ బెల్లు కొడితే ఓస్ ఇదొక తిండా ఒక గంటలో అమ్మ తినిపిస్తుంది అని ఉండిపోయాడు. 

మొదటి బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నారు కొందరు పెద్దవాళ్ళు. కిట్టూ ముందుకే పరుగెత్తి వెళ్ళాడు, అమ్మలా ఒక చీర ఉంది, చీ కాదు.  సరే ఇంకా చూసాడు. అందరూ వచ్చేశారు. వీళ్ళల్లో లేరు. సరే ఫస్ట్ బస్ కదా అని బోరింగ్ దగ్గర నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నాడు.

ఇష్టం అయిన ఆంజనేయున్ని మొక్కాడు. తరువాతి బస్సులో అమ్మానాన్నా రావాలి అని.  రెండో బస్సు వచ్చింది. చాలా వెతికాడు 10 దాటింది, పేరెంట్స్ కనిపించలేదు. ఎవరెవరికో వచ్చేశారు. గొంతులో గరగర బాగా రోడ్డు మీదకు వచ్చి చూస్తున్నాడు. 

ఆంజనేయుడు రాముడికి మాత్రమే ఏమో అని. ఇప్పుడు వినాయకుడికి మొక్కుతున్నాడు. 12 దాటింది. మూడో బస్సులో ఒక పెద్ద ఆయన వచ్చి బాబూ చాలా urgent పనిమీద మీ పేరెంట్స్ ఊరు వెళ్ళారు నీకు ఇమ్మని biscuits ఇచ్చారు అని. తీసుకున్నాడు, భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది అని చదివాడు గానీ అప్పుడు మాత్రం కళ్ళ చుట్టూ భూమి తిరిగినట్టు అనిపించింది. విశ్వం ఎంత పెద్దదో క్లాసులో విన్నాడు గానీ ఆరోజు అనంత విశ్వం లో ఒక్కడూ ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది.

దేవుల్లను అబ్బనా బూతులు తిట్టి, జీడి చెట్టు కింద చేరాడు ఆకాశంలోకి చూస్తూ. ఇంక ఈ సింధు కాలం నాటి దెవతలను మాని మొసెస్, జీసస్ వయిపు మారి పోదాం అని గట్టిగా అనుకున్నాడు.
ఏకాంతం మాత్రం తెలిసిన కిట్టూ కి ఒంటరితనం మొదటిసారి అనిపించింది. ఆకాశం కప్పేటట్టు  నీటి పొర కల్లల్లోకి. నేను పుట్టముందే నీలి పొర… అని ఏదో గుర్తొస్తుంది. 

బిస్కెట్ ప్యాకెట్ మీద కాగితం పయిన నాన్న రాసిన దస్తూరి మళ్ళీ మళ్ళీ చదివాడు. ఆకాశం వంక చూస్తూ ఒక ముక్క నోట్లో పెట్టాడు…. గొంతు పిసికినంత ఉక్కిరి బిక్కిరయ్యాడు.

దగ్గర్లో అలికిడి అయ్యింది. చూస్తే చక్రి, శేషు . క్రోధం ..

ఏరా ఇక్కడేం దొబ్బుతున్నారు అన్నాడు. కోపం గా. దగ్గరికి వస్తే కొట్టేలా.

ఓ నీకూ రాలేదా అన్నాడు చక్రి.

లేదు అన్నాడు.

మీకు..

లేదు అన్నారు ఇద్దరూ.

ఎందుకు…. మళ్ళీ మిల్లు మూసేశారు మా ఊర్లో ఎవరికీ పేరెంట్స్ రాలేదు అన్నారు. 


అర్థం అయ్యింది. పాపం అని Biscuits ఇచ్చాడు. నువ్వు తినరా నాకొద్దు అన్నాడు చక్రి, నాకూ వద్దు అన్నాడు శేషు. 

నిశ్శెబ్దం.

మీకు peep chirp duck తెలుసా అన్నాడు కిట్టు. తెలీదు అన్నారు. peep ఒక Kodi పిల్ల, దారి తప్పడి oka soup డబ్బాలో ఉంటుంది. Chirp oka ఎర్ర పక్షి , duck ఒక బాతు. వీళ్ళు అందరూ అనాథలే కానీ ఈ మూడు పక్షులు కలిసి బిగ్ wide world చూస్తాయి. మనం అనాథలు కాదు కానీ ప్రస్తుతానికి అయినట్టే.

చక్రి శేషు కి కిట్టుగాడి కథ , ఆ example నచ్చాయి. 

Peep chirp & duck అనే వీరి గ్రూప్ అలా మొదలయ్యింది. సరే ఒక పని చేద్దాం అన్నాడు శేషు. వాక్కో అన్నాడు చక్రి. 

సరే బిగ్ world ఎక్కడ ఉంది అన్నాడు శేషు.

మన స్కూల్ వెనకాల మామిడి తోట ఉందా ఉంది. గానీ మామిడి కాయలు పూసి 6 నెల్లు అయ్యింది రా ఫూల్ అన్నాడు. ఆగు ఇంక ముందుకు వెళ్తే ఒక కల్లు పాక వుంది. ఔను. అన్నారు

స్కూల్ వెనుకాల మామిడి తోట లోకి పోదాం , చక్రీ గాడు నీకు బుర్ర లేదురా కిట్టు అక్టోబర్ లో మామిడి తోటలో టెప్పి తోటకూర తప్పి ఉండవు.

 కిట్టూ డియర్ చక్రి హహహ. నేను చూపించ పోయేది , కల్ల పాక. కల్ల పాకలో పునుకులు ఎప్పుడయినా తిన్నారా అన్నాడు. లేదు అని అన్నారు ఇద్దరూ. ఓకే follow me.

 ఒక బకెట్ లో నీరు, ఒక చంబు , ఒక బాటిల్  పట్టుకున్నారు ఎవరయినా అడిగితే ప్రకృతి పిలిచింది అని చెప్పడానికి.

కల్ల పాక దగ్గరకు వచ్చారు, డబ్బుల్లేవు అన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చింది

మామ్మా కొంచెం ఏమయినా పెడతావా అని అడిగాడు. మామ్మ చూసింది ఆ కొంచెం నీళ్ళు ఇస్తారా అన్నది. ఓ ఇంకా కావాలంటే ఇంకా తెస్తాం అన్నాడు. మామ్మకు ముచ్చట వేసింది, తల నిమిరి, అందరికీ తలో కారపు పునుకు ఇచ్చింది. వీళ్ళకు వెంటనే నాలిక మంటలు... మామ్మా కాలిపోతుంది అన్నారు. మామ్మ చెరో ముంతా కల్లు పోసింది, అదే కారం గొడవలో ముగ్గురూ తాగేశారు.

కాసేపటికి కొంచెం ఎక్కింది, మామ్మ పిల్లలు తాగొచ్చా అన్నారు. మరి ఈకాలం మాబోటోల్లు ఏం తిని బతకాలి అన్నది.

కిట్టు శేషు చక్రి తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. ప్రకృతి అద్భుతం అనిపిస్తుంది. అకాశం గొడుగు వెస్తే, మేఘాల్లో తెలినట్టు ఉంది. దమ్ముంటే కాస్కో, చాలెంజే చేస్కో… అని గట్టిగా పాడుతూ వస్తున్నారు.

దారికి ఇంకో చిన్న చెట్టుకు కల్లు ముంత కట్టి ఉంది. చక్రి గాడు బాగా ఆకలేస్తుంది రా అని చెట్టెక్కి కిందకు లాగాడు. అది చేతిలోకి వచ్చేసింది. ముగ్గురు మళ్ళీ తాగారు. ముంత పైకి కట్టమని శేషు గాడికి చెప్పారు, శేషు వీరి ముగ్గురిలో ఇంకా బలహీనం. కట్టబోతూ, కింద పడ్డాడు. ముంత పగిలింది వీడి ముడ్డి కూడా పగిలింది.

ముగ్గురు ఇంకా వల్లకాదు అని రాజీవ్ హౌస్ చేరి బోర్లా పడి పడుకున్నారు.

సాయంత్రం వేళ అవుతుంది, కేవలం గోచి కట్టుకుని ఒక ముసిలోడు మెస్సు దగ్గరకు వచ్చేసాడు,  తాగి ఉన్నాడు

 మీ పెద్దాయన్ని తోలమని అరుస్తున్నాడు

 బాగా కేకలు పెడుతున్నాడు. ఆంధ్ర భాషలో ఎన్నెన్ని అవయాలు కలిపి తిట్టొచ్చో ఆరోజు తెలిసింది పిల్లలకు.

వాడి తిట్లు వినడానికి పిల్లలు కిటికీల దగ్గరికి వచ్చి గొల్లు గొల్లు గా నవ్వుతున్నారు.

కోటిగాడు (అదే గౌరవనీయులయిన ప్రింసిపల్) వచ్చాడు.

ఏం కావాలి అన్నాడు. మీ కుర్రాళ్ళు ముగ్గురు. నాకల్ల ముంత పగల గొట్టారు.

డబ్బులు ఇప్పించండి వెళ్ళిపోతాను అంటున్నారు.

కోటేశ్వరరావు కి కోపం భూకంపం వచ్చినంత వేగంగా వచ్చింది.

నేనివ్వను అన్నాడు.

గోచి కట్టుకొని ప్రింసిపల్ వెనకాలే వెళ్ళాడు ఆసామి.

ప్రింసిపల్ chamber ముందే కూర్చొని నానా తిట్లు తిడుతున్నాడు.

పిల్లలు గుమి కూడి బాగా నవ్వుతున్నారు. కోటి గాడికి కోపానికి తగిన ఆసామి దొరికాడు అని. కోటి ఇంకా తప్పక వచ్చి 5 రూపాయల 50 పైసలు ఇచ్చి పంపించాడు.

డిన్నర్ టయిమ్ అయ్యాక లేచారు ముగ్గురూ.

వీళ్ళ కంపు కేవలం అరో తరగతి చిన్న గదిలో ఉన్న అమ్మాయిలకు మాత్రమూ తెలిసింది.

వీళ్ళు లేచే సమయానికి, రుక్మిణీ, భామా నడుం మీద చెయ్యి వేసుకుని ముందరికి వచ్చారు.

అబ్బాయిలు మీరు తాగొస్తే మంచి మాట కాదు, అంది రుక్మిణీ. ఇది respectable లేడీస్ ఉండే చోటు, భామ తొక్క తీస్తాను అన్నాది. తాగి వచ్చి రాత్రి పూట అమ్మా అయ్యా అని ఏడిస్తే మేము వచ్చి ఓదార్చమని, డొక్కలో తంతామని చెప్పారు. వాళ్ళ కోపానికి ఈ ముగ్గురి మత్తు దిగింది.

ఒక్క క్షణంలో ముగ్గురూ కాళ్ళ మీద పడ్డారు. రుక్మిణీ వెల్లిపోబోయింది. కిట్టూ అలవాటుగా, చనువుగా నడుము పట్టుకున్నాడు ఆపడానికి. గెడ్డం పట్టుకున్నారు. తాగీసి ముట్టుకుంటే రక్కుతామన్నారు.

వీల్లు చివరకి కావాలంటే బట్టలు ఉతుకుతాము అని ఒప్పుకున్నారు. జన్మలో తాగమని ఒట్టులు వేసారు. వారు బతిమిలాడుకుంటుండగానే  నైట్ బెల్ మోగింది. పేరెంట్స్ రాని పేరెంట్స్ డే ఆలా సుఖాంతం అయ్యింది. కథ కంచికి.....

No comments: