రోజంతా తిండి లేకుండా సాయంత్రానికి మాత్రం బాగా ఆకలి వేసేది కిట్టూకి. టీ గొట్టం దగ్గర మాత్రం చాలా బాగా తాగేవాడు. బెల్లు కొట్టిన వెంటనే లైన్లో కి వెళ్లి గ్లాసు ని అయుధంలా వాడి వేడి వేడి టీ పట్టుకునే వాడు.
టీ గ్లాసులు నిండే లోపు గ్లాసు తోసి నింపుకు నేవారు. కాసేపటికి కిట్టూ వంతు వచ్చింది. పట్టుకుంటూ ఉన్నాడు కిట్టు. ఇంతలో బిడ్డ ఆకారం, పక్కనే వచ్చింది గ్లాసు తోసి తనది నింపుతున్నాడు సీనియర్. కిట్టూ గ్గాడికి వల్లు మండింది. అన్నయ్య ఆగు అన్నాడు మళ్ళీ తోసాడు సీనియర్. అంతే ఏక బికిని గ్లాసు వెనక్కి లాగి వాడి మొఖాన కొట్టారు వేడి టీ.
వాడికి మండింది. కిట్టూ ఫిల్టి పట్టుకుని పైకి లాగాడు, ఒక గట్టిగా లెంప కాయ వేశాడు. కిట్టూ కింద పడ్డాడు .. గానీ కిట్టు అదృష్టం ఎలా ఉందో పక్కనే వెళ్తున్న జాగ్రఫీ సిర్ చూసారు. ఏరా చిన్న వాళ్ళని కొడుతున్నవా అని, ఎదురుగా ఉన్న మఱ్ఱి చెట్టు కొమ్మ లాగి సీనియర్ నీ చిత్తుగా కొట్టాడు. బాగా దెబ్బలు పడ్డాయి ఆయనకు. కిట్టూ నీ చూసి పోరా అని పంపించేసాడు సిర్.
ఆరోజు కిట్టు శౌర్య గాథ దావానలంలా వ్యాపించింది. కిట్టూ దెబ్బలు తిన్నాడు గానీ తన ఛాతి ముందుకు పెట్టుకుని మెక్కుతూ నడుస్తున్నాడు.
Mess time, కిట్టూ కూర్చున్నాడు టేబుల్ మీద. సంగీత వచ్చింది, ఏంటి తమ్ముడూ నీకు బాగా డబ్బులు దొరికాయి అంట అన్నాది. నాకా దెబ్బలా... Small affair .. అన్నాడు. సీనియర్లుకూడా నీ వలన దెబ్బలు తిన్నారు అంట. ఓస్ నాకు సీనియర్ ఒక మూతి మీద ఈక అని, లేని మీసం మేంచి ఒక ఈక పీకి ఉఫ్ఫ్ అన్నాడు. సంగీత విప్పిన నోరు విప్పినట్టే ఉండి పోయింది.
కాసేపటికి సీనియర్లు వచ్చారు, అన్నయ్య దగ్గరకి సంగీత చేరింది. అన్నయ్య బాగా దెబ్బలు తగిలాయా అని బాధగా అడిగింది, ఏదో చెల్లి చిన్న మిస్ understanding అన్నాడు. ఔనా ఆ తమ్ముడు అలా అనలేదే, నువ్వు మూతి మీద ఈక సమానం అని చెప్పాడు, అన్నా
అక్కడున్న అందరూ అవాక్కయ్యారు, నిన్న తెల్ల చొక్కా వేసుకున్న పొట్టోడు అంత మాట అంటాడా అని. అందరూ జాగ్రఫీ సిర్ దగ్గర చేరారు సార్ రామకృష్ణ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా. చూసారా ఆ కిట్టు గాడు ఎంత మాట అన్నాడో అని. సిర్ మీకు banana peal చేసి చెప్పాలా , చెయ్యాల్సిందే మెత్తగా చెయ్యండి అని ఆయన నవ్వుతూ అన్నారు.
ఆ రొజు రాత్రి, కిట్టూ బెడ్డు చుట్టూ చాలా మంది చేరారు, తమ్ముడూ నీకు నెల రోజులు బకెట్ గానీ కడ్రాయర్ గానీ ఉండవు. నీకు దమ్ము ఎక్కువా కదా అని. అలా కిట్టు గొప్పదనం పూర్తిగా అర్థం అయ్యింది కిట్టు గాడికి.....
No comments:
Post a Comment