పునరపి జననం



బొగ్గు ట్రైన్ స్టేషన్ లోకి వచ్చినట్టు కలలో ఉన్నాడు కిట్టు. బండి వదిలే సమయానికి పెద్దగా విజిల్ వేస్తున్నారు ఎవరో, లేవాలి బాయ్స్ of Rajeev లేవాలి అని.

కళ్లు తెరిచాడు. ఒక పెద్ద ఆకారం పసుపు చొక్కా పెద్ద సాక్స్ లతో బూట్లు వేసుకుని బిగ్గరగా విజిల్ వేస్తున్నాడు. కన్నా చిట్టి తండ్రి లేవాలి అని కాకుండా ఇది ఏదో గొంతులో కరక్కాయ పడినట్లయింది. ఎక్కడున్నాడో ఇంక అవగతం అవ్వలేదు. 

సన్యాసి కృష్ణ రాజు, అనగా కిట్టు, చక్రి, శేషు, రుక్మిణీ భామలతో,  వైకుంఠపురం లో మేలుకుంటున్నాడు, శేషుశేష చక్ర రుక్మిణీ భామా సహిత సన్యాసి కృష్ణ.. ఉరఫ్ కిట్టు. ఈ రోజు మళ్ళీ పుడతాడు కొత్త కిట్టు.

ఈ కాలి దగ్గర ఇద్దరు ఆడ పిల్లలు ఎవరు, బెడ్డు పక్కనే చక్రి, శేషు ఏమిటి.  మెల్లగా గుర్తుకు వచ్చింది. రుక్మిణీ నీ లేపాడు వెల్లు వెల్ల మని గట్టిగా కటువుగా తోసాడు. అయిదుగురు లేచారు.

దూరంగా బెల్లు, విజిల్ సెబ్దాలు ఇవన్నీ విని అయోమయంగా ఉన్నారు. పెద్ద పిల్లలు ఒకొకరు కళ్లు తెరిచిన మరు క్షణం బూట్లు వేసుకుని పారిపోతున్నారు. అర్థం అయ్యింది కాసేపటికి ఇంకా బూట్లు ఇవ్వలేదు కదా అలాగే బయలు దేరారు, రుక్మిణీ ఏకంగా పరికిణీ లోనే గ్రౌండ్ కి వచ్చేసింది.

అక్కడ ఒక మగాడు పెద్ద జుట్టు విప్పుకొని నంబర్లు అరుస్తుంటే అక్కడకు వెళ్ళాడు, బాస్ అనబోయి అన్నయ్యా నేను ఎక్కడకికి వెళ్ళాలి అని. 

ఒక్క లెంపకాయ పడింది scoundrel,  p.e t madam ni. అక్కడకు వెళ్లి లయినప్ చెయ్, అని ఉరిమింది ఆడ గొంతుక. దీ. ని... అనుకుంటూ ముందుకు పోయాడు. 

అక్కడ మరో ఆకారం పొదవాటి జుట్టు విరబోసుకుని చేతులూ కాళ్ళూ సాగ తీస్తున్నాడు. దగ్గరకి వెళ్లి మేడం ఎక్కడ నిల్చో వాలి అన్నాడు. 

హహహ అని పెద్ద మగ గొంతుక. నేను మీ సార్ నిరా..... కిట్టు బుగ్గ మీద చెయ్యి పెట్టుకున్నాడు. 

ఓ sixth క్లాస్ కదా ... welcome.. అక్కడ huddle చెయ్యి అని మంచి హుషారు గా జవాబు వచ్చింది. ఓకే ఇక్కడ తిక్క ఎవడికుందో కూడా చెప్పలేం అని అర్థం అయ్యింది కిట్టు గాడికి. 

కాసేపటికి తెల్లారింది. అందరి మొకాలు చూస్తున్నాడు. ఇన్ని కొత్త మొహాలు ఓకే సారి చూసే సరికి వాడికి విచిత్రం గా ఉంది. ఒకడు ఏకంగా స్కూల్ బాగ్ తో వచ్చాడు, ఒక అమ్మాయి చిన్న నైటీ లోని ఒకడు చొక్కా లేకుండా ఉన్నాడు. pet madam sir ఒకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఇలా రావచ్చు ఇలా రాకూడదు అని. 

వెల్ల బొయే మున్దు, ఆ పొడవాటి జుత్తు తొ ఉన్న సారు, వెల్ల బోయే ముందు, ఇందాకల పొడవాటి జుట్టు ఉన్న సారు, జుట్టు పిలకలా కట్టి.  వెనక్కి తిరిగి గుట్టమీద నిల్చొని, అందరిచేత G. A. N. G Gang leader అని అరిపించాడు. 

కిట్టూకీ బాగా సరదాగా నూ ఇక్కడ టీచర్లకు తిక్కతో పాటు వేప కాయంత వెర్రి
కూడా ఉంటాది అనిపించింది

మళ్ళీ బెల్లు కొట్టారు. కిట్టూ కాళ్లు ఈడ్చుకుంటూ తన వస్తువులు పట్టుకుని బోరింగ్ దగ్గరకి వెళ్ళాడు. అక్కడ చొక్కా లేకుండా వట్టి డ్రాయేర్ వేసుకుని అతి మురికిగా మట్టి మట్టి గా ఇద్దరు పిల్లలు.

ఇంకా పూర్తిగా తెల్లవారక, పక్కనే ఉన్న ఇసక బట్టీ కూలీ పిల్లలు లాగా కనిపించారు.

కిట్టూ కొంచెం నీళ్ళు కొట్ట మన్నాడు . మొకం నిండా బురద దుమ్ము తో ఉన్న వాళ్ళు పంప్ కొట్టారు. కిట్టూ మీరు స్కూల్లో కూలికి వచ్చారా అన్నాడు.

ఇద్దరూ నీ యబ్బరో.... నీకు అని కిట్టూ మీద అమాంతం పడి కిందకి తోసి మీద ఎక్కారు. కిట్టూ కి మెల్లగా ఆకారాలు కనిపించాయి. ఒరేయ్ చక్రీ అన్నాడు, ఔన్రా అని శేషు చక్రి జవాబు ఇచ్చారు.

నాది ఈ రోజు పుట్టినరోజు అని మెల్లగా చెప్పాడు.

కొంచెం తల మీద పోస్తారా అని. ఓస్ అంతేనా ఇద్దరూ కలిసి కిట్టు వాడికి కొన్ని ఉత్తిత్తి మంత్రాలతో తలంటారు. నిన్న ఉదయం అమ్మ తలంటు పోస్తుంటే చేసిన గొడవ గుర్తుకు వచ్చింది, చక్రీ శేషు తలమీద నీళ్ళు పోస్తుంటే కన్నీళ్లు తలంటులో కలిసిపోయాయి. కిట్టూ కి అభిషేకం జరిగింది వాళ్ళ దయవలన.

అలా ప్రార్థన సమయానికి చేరారు మెల్లగా. అమ్మ పెట్టిన తెల్ల యూనిఫాం వేసుకున్నాడు కిట్టు. ఆ రోజు white dress కూడా కదా, ఆరో తరగతి వరసలో చిత్రంగా కనిపిస్తున్నాడు  పొట్టి కిట్టు. 



ఒక చేట భారతం లాంటి ప్రేయర్ సాంగ్ పాడుతున్నారు.

థూ..నా.. జన్మ అనిపించేలా హిందీలో బాధగా ఉంది పాట. ఆ రాగం అషాడ మాసంలో ఆకలికి వీధి కుక్కలు ఏడుస్తాయే అలా ఉన్నాది. అంత హిందీ లో ఆ పాట రాసిన వాడికి రెండు కాళ్ళ మధ్య తడి తువ్వాలుతో కొట్టాలి అనుకున్నాడు. బావి దగ్గర అన్నయ్య తడి తువ్వాలుతో  బాదిన బాదులు గుర్తుకు వచ్చాయి. నవ్వు కున్నాడు.

తెలుగు పిల్లలకు హిందీ లో ఎందుకురా మొర్రో అనుకున్నాడు. ఉదయం పాట అంటే కశక్కురో.... కశక్కుద్దా... అలా ఉండాలి అని. తరువాత మూడు భాషల్లో ఏదో చెప్పారు, తరువాత ప్రపంచ తుమ్మ చెట్టు దినోత్సవం మీద ఇంగ్లీష్ లో వాగాడు ప్రిన్సిపల్  కోటిగాడు. ప్రిన్సిపల్ ని కొటి గాడు అని మాత్రమే పిలవాలి అని ఈ పాటికే గట్టిగా హెచ్చరించారు సీనియర్లు.

కిట్టూ కి ఈ జన్మ మీద విరక్తి పుట్టేస్తుంది. స్కూల్ రిక్షావోడు తిట్టిన తిట్లు మళ్ళీ మళ్ళీ  తిడుతున్నాడు. కాసేపటికి ఒక మేడం మైక్ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు అని, చిన్న చీటీ మీద సన్యాసి వెంకట కృష్ణమ.. అనేలోపు కిట్టు.. కిట్టు... మేడం అని గట్టిగా అరిచాడు కిట్టు గాడు. తన పేరు సన్యాసి అని ఎవరికి తెలియకూడదు అని. సరే కిట్టు రా అన్నారు.

పయికి వెళ్ళాడు కిట్టు. వాడి వలకం, తెల్ల బట్టలు, ముడుకులు దాటిన పెద్ద నిక్కరు చూసి principal ki ముచ్చట వేసింది. 

స్కూల్ మొత్తం హ్యాపీ birthday పాడి, మూడు మూడ్లు తొమ్మిది సార్లు చప్పట్లు కొట్టారు. పుట్టి ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యాడు కిట్టు. అబ్బా స్కూల్ అంటే ఇదా అనుకుంటూ దిగబోతుంటే. ఆవేశంగా principal చూసారా పిల్లలూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నారు. I have a good feeling about this class. అని...

లైన్లో వెళ్తుంటే రుక్మిణీ చేతిలో బిళ్ళ పెట్టింది. తిను బర్త్డే కదా అని. ఆరోజంతా కిట్టూ ని ఒక హీరో లాగా చూసారు స్కూల్లో ఎక్కడికి వెళ్ళినా హ్యాపీ బర్త్డే తమ్ముడు అని. అలా రెండో రోజు గడిచింది కిట్టు గాడికి. 

No comments: