నేస్తం మనది
మామిడి తోపులో
సఖ్యం మనది
ఆడుకున్న ఆటల్లో
పంచుకున్న బంధాలు
బంధాలను అనుబంధించిన
నేస్తం మనది
నువ్వు రాసిన
లేఖల్లో దాచుకున్న
పాటల్లో ఆటల్లో
ఊహలు మనవి
మోట బావిలో శ్రీధర్ అన్న
సెలవుల్లో మిత్రుడి మరణం
రాత్రంతా మనం చేసిన ప్రార్థన
ఓదార్చిన భుజం మనది
పండిన జీడిపళ్ల సాక్షిగా
దొంగేసిన తాటి కల్లు సాక్షిగా
అల్లరి చేసిన
మూకలు మనవి
అర్థరాత్రిలో పంచుకున్న
మజ్జికన్నం
అందులో కలసి
వడ్డించిన బాల్యం మనది
* బాల్యమిత్రుడు సహ్రుదయుడు అటల వెలది సుధాకరు కోసం
No comments:
Post a Comment