హౌరా రైలు
మరునాడే మైగ్రేషన్ పిల్లలు , అంటే ప్రతి సంవత్సరం హర్యానా నుండి ఆంధ్రా వచ్చిన పిల్లలు, అసెంబ్లీ కి వచ్చారు.
ఇది కొత్తదనం చాలదు అన్నట్టు. ఆ రోజే కొత్త పిర్న్సిపాల్ కూడా వచ్చారు.
ఈయన పద్దతి వేరుగా ఉంది. రవీంద్ర నాథ్ ఠాగూర్ లాగ గెడ్డం, పెద్దల తరహా కళ్లద్దాలు , చాలా హుందాగా ఉన్నారు ఈయన. ఆయనకు ఒక తెల్లటి మారుతీ కారు, ఇంగ్లీషు టపా టపా మాట్లాడే bobbed హెయిర్ మిసెస్, చక్కటి హావభావాలతో ఒకే ఒక్క అమ్మాయి. చూడగానే వీరు హుందాగా అనిపించే కొత్త ప్రిన్సిపాల్.
గెడ్డాన్ని సవరిస్తూ, మంచి ఇంగ్లీష్ లో ప్రసంగం. దేశ సమగ్రతకు మైగ్రేషన్ ఎంత గొప్ప అవకాశమో క్లుప్తంగా చెప్పారు. పిల్లల్ని అభిమానంగా ఆహ్వానించాలి అని, ముఖ్యంగా 9వ తరగతి పిల్లలు కలిసి మెలసి ఉండాలి అని.
క్లాసులోకి వస్తున్నారు పిల్లలు. 9A. కిట్టు కూర్చున్నాడు తన బల్లమీద. గుమ్మం దగ్గర సానియా. ఎదురుగా చూసి, హలో అన్నాడు వెల్కమ్ వెల్కమ్ అంటూ.
అలా రోజూ తనతో పరిచయం. మధ్యాహ్నం లంచ్ తరువాత రోజూ భామా, రుక్మిణీ తో మాట్లాడే కిట్టు ఇప్పుడు వేరేగా సానియా తో మాటలాడటం మొదలు పెట్టాడు. ఇలా లంచ్ బ్రేక్ లో మాట్లాడే వారిని టెంట్ అని కొత్తగా పేరు పెట్టారు. టెంట్ అంటే ఏమిటో నిర్వచనం ఇవ్వడం చాలా కష్టం.
టెంట్ ఎక్కడయినా పడొచ్చు. క్లాస్ బయట, లోపల, మెస్సులోపల, బయట, ఎవరయినా పెట్టొచ్చు. చివరకి నర్స్ మేడం లెక్కల మేశారు, పిన్సిపాల్ మేడమ్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరయినా పెట్టొచ్చు అన్నమాట.
అదొక నిర్వచనాతీత ఫినామినాన్. ఉదాహరణకి నర్స్ మేడం దగ్గరికి ఒక పెద్ద అన్నయ్య తల నొప్పని, కళ్ళు తిరుగుతున్నాయి అని వెళ్ళాడు అనుకోండి, ఆ ఫలానా నర్స్ ఆయన చెయ్యి పట్టుకుని రీడింగ్ చూస్తూ ఒక గంట మాట్లాడారు అనుకోండి. అది కూడా టెంట్ గానే వస్తుంది, "నా చెయ్యి తాకింది నర్సు మేడం, నవ రాగంలో నవ్వింది నర్సు మేడం" అని పాటలు కూడా పాడొచ్చు.
సంగీతంలో రాగానికి నిర్వచనం లేనట్టు, నవోదయాలో జరిగే టెంట్ అనే సరగానికి నిర్వచనం లేదు. అది అలా జరిగిపోతుంది అంతే.
కుట్టు_సానియా టెంట్ మిగతా టెంట్ల వలే, ఒంటి గంటకు ఠన్చన్గా పడుతుండేవి. భామకు కూడా ఒక వీరాభిమానితో వేరే టెంట్, రుక్మిణికి వేరే వీరాభిమానితో టెంట్ ఇలా.
రోజూ కిట్టు చూసే వాడు తన బెల్టు వెనక్కి ఇస్తుందా అని. ఇన్సర్ట్ లేదు అని, బెల్టు లేదు అని చాలా దెబ్బలు తిన్నాడు pt చేతిలో. స్కర్ట్ సైజ్ చేయించే అవకాశం లేదు అనిపించేది కిట్టుకి ఎందుకంటే టైలర్ ఇంకా రాలేదు స్కూల్ కి. అడుగుదాం అనుకునే వాడు, కానీ పాపం అనిపించేది. డిల్లీ— చండీఘర్ ప్రయాణంలో తనకు కలిసిన అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయి గుర్తుకు వచ్చేది. తను హోమ్ సిక్ అయి ఏడుస్తూనే ఉంది మొత్తం ఎక్సిబిషన్ అంతా. మొదటి అక్షరాలు కలిసి AP నుండి తను కూడా అని చెప్పాడు కిట్టు. ఆమాత్రం కలిసినందుకు రోజూ తనతోనే మాట్లాడేది ఆ అరుణాచల్ నవోదయ అమ్మాయి.
ఒక రోజు సానియా తనే వచ్చింది , ఖాళీ క్లాస్ రూమ్ లోకి, చిన్న సంచితో. కొత్త బెల్ట్. ఇది నిజమయిన తోలు బెల్టు, మంచి మెరిసే buckle.
thank you చెప్పింది. మొహంలో అభిమానం. సహాయానికి ఆరోజు ఇచ్చిన ఆసరాకి.
కిట్టు Khade Ho అంది. నిల్చున్నాడు. వెనక్కి తిరగమని, ఇప్పుడు ఇన్షర్ట్ చెయ్యి అంది. బెల్టు తనే పెట్టింది, చాలా చనువుగా.
అనాలోచితంగా, ఈ సారి కిట్టు ని తను కళ్లలోకి చూసింది. ఈసారి ఇద్దరికీ అమాయకత్వం కాదు, స్నేహం కాదు, ప్రేమ కనిపించింది. కళ్ళు ఒకరినొకరు కళ్ళను వెతుకు తున్నాయి. కలవలం పడుతున్నాయి.
ఐ లవ్ యూ ... ముందు తను, మాట మధ్యలోనే కిట్టు కూడా. చేతిలో చెయ్యి మాత్రం పెట్టారి ద్దరూ..
గుండెల్లో హౌరా రైలు ప్లాట్ఫారం మీదకు వచ్చినప్పుడు ప్లాట్ఫారం కదులుతుందే అలాంటి దడ. వెన్నులో పుట్టి తల పైకి వెళ్ళిన మెరుపు లా ఉంది ప్రేమ.
ఆ క్షణం, ఆ చోట, అలా సమయం స్తంభించింది.
1+1 = 1

.jpg)
No comments:
Post a Comment