అనగా అనగా...
ఒక ప్రశాంత
సంద్రం
సంద్రంలో
ఒక రోజు
చిగురాకు
పడింది
ఉండీ ఉండీ
ఒక చినుకు
రాలింది
ఆకులో
అలా చిగురాకులో
చినుకు
బిందువయింది
ఉదయం
ఉజ్వలం
గా వెలుగు
నిండింది
బిందువులో
నిండింది
వెలుగు
వెలుగుతో
చైతన్యం
బిందువు
చూసింది
తనలోని
ప్రతిబింబాన్ని
ప్రతిబింబలో
చిగురాకు
దూరాన
సూరీడు
ఇంకా
నింగీ నేలా
చెట్టూ చేమా
అంతా
అలా రోజూ
హాయిగా
తేలిపోయే
ఆకుకి
కనిపించాయి
వేరే ఆకులు
కొన్ని మామిడి
కొన్ని నేరేడు
కొన్ని తురాయి
అన్నిటిలోనూ
ఒక వెలుగులు
చిమ్మే బిందువు
తన లాంటి
ఆకు కోసం
రోజూ
చూసేది
చినుకు
పోతే పోతే
ఒక రోజు
కనిపించింది
తన లాంటి
చిగురాకు
చిగురాకులో
బిందువు
బిందువు లో
తన ప్రతిరూపం
తన బింబం లో
ఆ బిందువు
ఆ బిందువు లో
తన బింబం
రెండూ దగ్గరకి
వచ్చాయి
రెండు బిందువులు
కలిసే
తాపత్రయం
దగ్గరైతే
అయ్యాయి
కానీ
ఆకు దాటి
వెళ్ళలేదు
నీటి చుక్కలు
ఎన్నో ఎన్నో
తపన ల
తరువాత
రెండూ
తమ మూటికల ను
ముడి వేసాయి
ఇప్పుడు
రెండు కలిసి
తిరిగాయి
సంద్రాన్ని
ఒకరోజు
చినుకుల వాన
తెల్లారి చూస్తే
మూడో
చినుకు
బుల్లి చినుకు
పక్కనే
కలిసి వెతికి
వేరే ఆకులో చేర్చాయి
అలా
కొత్త చిగురాకులో
చిన్ని చినుకు
రోజులు వస్తున్నాయి
రాత్రులు వస్తున్నాయి
వర్షాలు
గాలి వానలు
ఇంద్ర ధనుస్సులు
నింగీ నీలా
చెట్టు చేమ
అలా సాక్షులు
సముద్రం లో నూ
ప్రవాహం
ఆ ప్రవాహంలో
ఒక రోజు
కొట్టుకు పోయింది
రెండో చినుకు
ఎక్కడెక్కడ
అని వెతికింది
బిందువు
అంతా ఒక
ఎండ మావి లాంటి
బ్రాంతి అని
ఆకు పాత
బడుతుంది
తనేమో ఆవిరయి
రోజు రోజుకు
చిన్నబోయింది
ఎలా అయినా
సాగరం లోకి
చూద్దామని
బిందువు
ఆకు చివరకి
వెళ్ళింది
చినుకు
తన బింబం
ఉంది సంద్రం లో
సంద్రం బింబం
తనలో
భయం వేసింది
వెనక్కి వెళ్ళింది
బిందువు
మళ్ళీ ఉదయం
మళ్ళీ వెచ్చని
చైతన్యం
ఊహ నిండా
బిందువు నిండా
నిండిన దృశ్యాలే
చెట్టు చేమ
నింగీ నేలా
ఇవి తనలోని
బింబా లే
సంద్రం లోకి చూసింది
వెలుతురులో
మొదట సారి
సంద్రం నిండా
అద్భుత చైతన్యం
తను సాగరం
సాగరం తను
ఒకటే వస్తువు
చైతన్యం ఒకటే
బిందువు
భయం పోతోంది
ఆకు చివరకు
వచ్చింది
అలా బిందువు
సంద్రం లో
కలిసింది
చైత్యన్యం
మళ్ళీ ఒక్కటి
అయ్యింది
శేషం లేకున్నా
ఈ కధ ఇక్కడి తో
సశేషం
- శశి

No comments:
Post a Comment