అలలు

అలలు

తరంగాలా ఈ మనుషుల అలలు

వీరి అంతరంగానిది ఏ దిశో 

ఏ దిశలో ప్రవహిస్తుందో


తరతరాలుగా మారుతూ…

తారా లోకం కనిపించిన

వీరి కన్నుల్లో

 పుడుతుందా జిజ్ఞాస ? 


ఎవరో ఒకరి స్నిగ్ధ

నిశ్శబ్ద రాత్రిలో

మిణుగురులు

నింగిని తాకిన 

ఆ క్షణంలోనే

పుట్టేను కదా  ఆ ప్రశ్న


“తారలేమిటి?”

ప్రశ్నలలోనే పుట్టి,

ప్రశ్నలతోనే పెరిగి,

మరో చరిత్రను రాసే

మరో మానవ తరాన్ని

తారల వైపు నడిపించే

మహా మనీషి 


ఆమె చేసిన వంటలో

రేడియం వెలిగితే,

అతను చేసిన లెక్కల్లో

సమయం వంగిపోతుంది కదా


చిన్న క్షణాల్లోనే

విశ్వం తన రహస్యాలు చాటుతుంది…


తరాలు తరాల్ని మేల్కొలుపుతూ,

తరంగాలై సాగుతూనే ఉంటాయి

తారా లోకాన్ని అందుకునే

ఆ తారా తీరాన్ని

వెదుకుతూనే ఉంటాయి.

No comments: