హాల్లో మిస్టర్ ఆంజనేయులు

 *** హాల్లో మిస్టర్ ఆంజనేయులు***


అనగా అనగా కిట్టు గాడు 9th కి వచ్చేశాడు. ఒక సారి వాళ్ల అమ్మ గారు వాణ్ణి నయాన భయాన విద్యాలయకు తెచ్చారు జనవరి సెలవుల తరువాత.


వాణ్ణి డార్మిటరీ లో పెట్టి చక్కా వెనక్కి పోతున్నారు. జనవరి నీరెండలో నిలబడిన ఆవిడకి దూరంగా ఆయాసం తో పరుగెడుతూ ఆంజనేయులు కనిపిన్చారు.


ఆంజనేయులు గొప్ప కళాకారుడు. ఎలాంటి చిత్రాన్నయిన సునాయాసం గా వేసే వారు. బొమ్మల కన్నా వాటికి అద్భుతమైన ఆయిల్ కలర్స్ వేయడం ఆయనకు మంచి సరదా. పిల్లల శ్రద్ధకు తగిన విధంగా చెప్పుతూ వచ్చేవారు. అరవింద్, ప్రతాప్ లాంటి 

మంచి పేరు ఉన్న ఆర్టిస్టులకు ఇంకా ప్రత్యేకంగా నేర్పేవారు.


కానీ స్కూళ్ళలో ఆర్ట్ మాస్టారిని, పెయింటర్ గాను, క్రాఫ్ట్ మాన్ గాను వాడుకునే వారు. తగతో గదుల పేర్లకు, అప్పుడప్పుడు తలుపుల ద్వార బంధాలకు వర్ణీష్ కూడా వేయించేవారు ఆయన చేత. 


అయినా చెరగని నవ్వుతో ఉండేవారు మాస్టరు. 


మాస్టారు బాగున్నారా, చాలా రోజులయింది అన్నారు ఆవిడ. మీరా కిట్టు మదర్ కదా. చాలా రోజులయింది, కలిసి. మీ వాణ్ణి 3 ఏళ్ల క్రితం, మీ ఇంటి దగ్గర గిరఫ్టార్ కోసం కలిశాం మేడం అన్నారు. 


అమ్మ గారు కొంచెం తడపడాయించారు. ఔన్సార్ మీ దయ వలన ఇప్పుడు అడ్జస్ట్ అయ్యాడు అన్నారు. 


ఏమి దయండీ ఆ దెబ్బకు నాకు ఇంకా ఇంక్రిమెంట్ రాలేదు అన్నారు. కిట్టు అమ్మకి గొంతులో కరక్కాయ పడింది. 


ఇంకా బస్సు రాలేదు అని అక్కడున్న మూక మెల్లగా నెక్స్ట్ జంక్షన్ కి నడక మొదలెట్టారు. 


కిట్టు అమ్మగారు వెంటనే ఆంజనేయులు నడక మొదలు పెట్టారు. 


తదుపరి 40 నిమిషాలు కిట్టు గాడి వల్లన తన జీవితం ఏమేమి మలుపులు తిరిగినదో చెప్పడం మొదలు పెట్టారు.


మేడం గారు మీ వాడు మంచోడే గానీ నాకు పట్టిన పెద్ద గ్రహం అన్నాడు. అదేంటండి అని అడిగే లోపే, మీకు కాబట్టి చెప్తాను, ఇప్పుడు బొడ్డవర వెళ్ళడానికి ఒక రకంగా కిట్టూ యే కారణం అన్నారు. ఎలా సార్ అంటే.. 


మీకు తెలీదు గానీ నేను 5 ఏళ్ల క్రితం బాగా బతికే వాణ్ణి మేడం. ఏదో కొన్ని కారణాల వల్లన నాకు ఇద్దరు భార్యలండీ. పెద్ద ఆవిన్ని విజయనగరం లో నీ చిన్నావ్వీన్ని స్కూల్లోనే ఉంచి బాగే నడిపే వాన్ను. నన్ను తప్పుగా అనుకో వద్దు చిన్నావిన్ని తండ్రి పోయాక ఆదు కోడానికి చేసుకోవలసి వచ్చింది అన్నాడు. 


దీనికి తన బంగారం కిట్టు గాడికి ఏమిటి సంబంధం అనేలోపే, ఇలా చెప్పు కుంటూ వచ్చాడు. 


1994 లో దసరా నీకు గుర్తుందా అన్నాడు. అమ్మ అయోమయం గా చూసింది. హహ మీకు ఎందుకు ఉంటుంది మేడం. ఆరోజు మీ వాడు పారిపోయి మీ ఇంటికే వచ్చాడు. గుర్తొచ్చిందా అన్నాడు. 


ఔను ఔను సార్ వచ్చింది అన్నారు ఆవిడ. ఎప్పుడు నేను జూనియర్ ని మేడం, కొత్తగా రెండో ఆవిడ తో పెళ్లి అయిన కొత్త. ఆవిడ స్కూల్లోనే ఉండేది నాతో, ఇంట్లో పరిస్థితులు బాగోక. ఇంకో నెలలో ప్రమోషన్ వస్తుంది ఆవిడని బయట ఇంట్లో పెడదాం, ఈ మాట పొక్కక ముందు అని నా ప్లాన్ అన్నమాట. 


దసరా కదా, ఆ ఒక్క రోజు హౌస్ మాస్టర్ గా ఉండమని నన్ను ప్రత్యేకంగా అడిగారు పిర్న్సిపాల్ సార్. ఆయనను కొంచెం ఇంప్రెస్స్ చేస్తే మంచి ఇంక్రిమెంట్ ఇంకా ఊళ్ళో మంచి పేరు వస్తుంది అని వప్పుకున్నాను. అయినా నల్ల బళ్ళలకు పెయింటు, పిల్లల బూట్ల మీద పేర్లు రాయించడం ఇల్లా నన్ను బాగా వాడేసుకుండే వారు మేడం. ఇది నాకు పెద్ద ప్రమోషన్ లా అని పించింది.


మీ కిట్టు ఉన్నాడు చూసారు, ఆ రోజు మధ్యాహ్నం కక్కా ముక్కా తిని వనజ తో మాట్లాడుకుంటూ ఉండి పోయాను. మీ వాడు బల్లి లాంటి మనిషండి, ఎప్పుడు పోయాడో తెలీదు జంప్ అయిపోయాడు.

 principal వచ్చి నన్ను అడిగారు attendance వేసావా అని. కొంచెం భయానికి వేసాను అనేశాను. కిట్టు లేడా అని అడిగారు, ఒక గంట వెతికినా వాడు దొరకలేదు. అసలే అల్ప ప్రాణి ఎక్కడ పడిపోయాడు అని బాగా వర్రీ అయ్యాము. పోలీస్ స్టేషన్ కి ఇంక ఫోన్ చెయ్యాల్సి వచ్చింది. అలా రోజంతా వెతికితే మీ ఇంటి మటన్ తింటూ దొరికాడు.


ఏక బికిన చెప్పిన కారణం గా ఆయాసం వచ్చేసింది ఆంజనేయులు కి. చిన్న పిల్లాడు .... అని అనే లోపే మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు. ఆ రోజు principal నాకు మెమో రాశారు మేడం. 

*" ఆంజనేయులు అనబడు ఆర్టు మాస్టారు+3768 క్ర.సం.) ఈ రోజు తన విధి నిర్వహణలో ఆశ్రద్ధ మూలం గా ఒక విద్యార్థి పారిపోయిన కాలాన్ని గ్రహించ లేక పోయారు. ఇంకనూ తను రోల్ కాల్ వేసినట్టు అబద్దం చెప్పి తన దోవన కుటుంబ కార్యక్రమాల్లో మునిగి విధి నిర్వహణ లో విఫలం చెందారు"*


ఇలా jobu లోంచి ఒక కాగితం చూపించారు. అది జేబులో ఎందుకుంది అనుకుంటున్నారా, ఆ ప్రమోషన్ కోసం దీని నోటరీ చేయించడానికి వెళ్తున్నాను మేడం.

 అయ్యో సారి sir అన్నారు ఆవిడ. ఇది sorry to పోయేదా మేడం. ఆరోజు సాయంత్రం మా రూంలో చుట్టాలు ఉండడం వల్లనే నేను నిర్లక్ష్యం చేసాను అని principal నా రూం కి రావడం, వనజను పెద్దావిడ వరలక్ష్మి అనుకోవడం. ఆవిడ నేను వనజ అని చెప్పడం , నా చిన్నిల్లు బయట పడడం. ఆ దెబ్బకు వనజ నన్ను వదిలి పుట్టింటికి వెల్లడమూ ఆ గొడవల్లోన్చి బయటకు రావటానికి నాకు మూడేళ్లు పట్టింది మేడం అన్నారు ఆంజనేయులు .


అందుకే కిట్టు నాకు పట్టిన గ్రహణం మేడం, నా ఒక్కరికే కాదు

మీ వాడి వలన ఇంకో ముగ్గురికి incementlu, పెళ్ళిళ్ళు, హౌస్ రెంట్ allowance ఆపేశారు. 

 అన్నిట్లో నూ అయితే ముందు లేకపోతే చిట్ట చివరా ఉండి మమ్మల్ని బంతాట అడ్డేస్తున్నాడు..


అంతటి రాక్షసుణ్ణి మీరు ఎలా పెంచారు మేడం , మీకు దండం పెడతాను వాణ్ణి 11th కి బయటకు తీసుకు వెళ్ళండి అని మొర పెట్టుకున్నారు ఆంజనేయులు.


పోనీ వాణ్ణి పట్టుకు కొడ దామని నిర్ణయించు కున్నానా, మొన్నే న్యూఢిల్లీ లో ఎగ్జిబిషన్ ర్యాంక్ తెచ్చుకుని, పేపర్ వాడికి *ఆంజనేయులు నాకు ప్రేరణ అని చెప్పాడు*. జోబులోంచి ఇంకో కాగితం తీసి అందులో చూపించాడు " for exceptional mentorship of students in national festival ఆంజనేయులు ఈస్ requested to received special certificate from jnvs"


ఇలా ఒక నెల మెమోలు ఒక నెల ప్రోత్సాహ సర్టిఫికేట్ లు తీసుకుంటూ. ఈ రోజు ఎటు వైపు పోతుందో తెలీక నా బోటి వాడి పరిస్తితి ఎలా ఉందో మీరే గ్రహించాలి అంటూ, ఆకాశం లోకి చూస్తూ ఉండి పోయాడు ఆంజనేయులు !!

No comments: