పోరా డోంగ్రీ...
సొరంగంలో అగిన బండి లో కీచురాళ్ళ శబ్దం కమ్ముకుంది. చీకట్లో జానీ కిట్టు. దూరం వచ్చేశారు సాహసం చేసి గుండె శబ్దం మాత్రం వినిపిస్తుంది. చెయ్యి గట్టిగా పట్టుకుంది జానీ, చెమ్మగా ఉంది.
ఏవో హిందీ లో అరుపులు. పూలమ్మే వాళ్ళు దిగి పోతున్నట్టు లీలగా అర్థం ఔతుంది.
ఎంత శబ్దం చేసి ట్రైన్ ఆగిందో అంతే శబ్దంతో బయలు దేరింది.
పూలు అమ్ము కున్న వాళ్ళు, పెళ్లి కొడుకు, కూతురు, ఆ పెట్టే వాళ్ళు దిగి పోయి నడుస్తున్నారు.
పూలమ్మే వాళ్ళు, పెళ్లి వాళ్ళు, పేకాట వాళ్ళు అంతా దిగిపోయాక బోగీ ఒక్కసారిగా ఖాళీ అయింది. కానీ సంపంగి వాసన మాత్రం అక్కడే మిగిలిపోయింది.
ఇద్దరూ ఇందాక పెళ్లి బృందం ఖాళీ చేసిన బెర్తు లో కూర్చున్నారు.
జానీ కళ్ళల్లో బయటి దృశ్యం ప్రతిబింబిస్తుంది. ఉంగరాల జుట్టు ఒక పాయ గాలికి ఎగిరి కిటికీ లోంచి బయటకి లోపలికి వస్తూ పోతుంది. జానీ కురుల వాసన సతమతం చేస్తుంది కిట్టూని.
చిక్ షాంపూ మొత్తం ఒకే సారి రుద్దేశావా జానీ?
నీలా క్కాదు. నీట్ గా ఉంటాను. కిట్టు ఉంగరాల జుట్టు ముందుకు లాగి అన్నాది.
ఔను అందరూ అదే అంటారు కదా .
మరి. జానీ ఇస్ ద బెస్ట్.
నీకు పొగరు కూడా ఎక్కువే !
అంటే తెలివి కూడా ఎక్కువ అని ఒప్పుకుంటున్నావా ?
కాదు బలుపు ఎక్కువ అని. కిట్టు గడుసుగా సమాధానం వేశాడు.
జానీ కి కోపం వచ్చింది.
కొట్ట బోయింది.
అడ్డుకున్నాడు.
కొంచెం గట్టిగానే అడ్డుకున్నాడు.
తను మళ్ళీ కొట్టింది.
తిరిగి అడ్డుకున్నాడు. దీన్నే బలుపు అంటారు.
శెట్టి, జానీ అంది
బుబక, కిట్టు
గొడవ నవోదయ భాషలో తారా స్థాయి చేరినట్టే .
కిట్టు చేతిమీద కొట్టాడు.
ఆడ పిల్లని కొట్టడం హీరో కాదు.
నువ్వు ఆడపిల్ల అని ఎవరన్నారు.
కిట్టూ ... గట్టిగా అరిచింది.
మళ్ళీ లెంపకాయ్ గుర్తుకు వచ్చి ఆగిపోయాడు.
సారీ. చెప్పాడు కిట్టు.
పోరా
సారీ
పోరా - జానీ
కిట్టూ ఏమీ అనలేదు.
జానీ యే సారి చెప్పింది ఈ సారి.
ఒకే సరే ఇద్దరూ నవ్వేశారు.
నీకు అసలు భయం ఉండదా , కిట్టు అడిగాడు.
భయం వేస్తుంది అయినా చేసెయ్యాలి.
కిట్టు అర్థం అయినట్టు బుర్ర ఊపాడు.
అందర్నీ ప్రశ్నలతో చంపుతావెందుకు ? జానీ అడిగింది.
అది అంటే, అంతే, కుతూహలం. క్యూరియాసిటి యూ నో ?
నాకు ఇష్టం. నా గురించి నువ్వు అడిగినన్ని ప్రశ్నలు ఎవ్వరూ అడగరు.
నువ్వు అసలు అర్థం కావు. అన్నాడు కిట్టూ..
ఇప్పుడు ఎలా ఉంది కడుపులో.
ఆల్ గుడ్. ఆకలి వేస్తుంది రా.
బండి అంతా ఖాళీ ఉంది ఇప్పుడు.
తమ బోగీ చేరేటప్పటి పద్మజా మేడమ్ ఎదురు చూస్తున్నారు.
కిట్టు ఎక్కడకు పోయారు అని. జానీ చెప్పింది తానే తీసుకు వెళ్ళాను అని.
మేడమ్ లంచ్ అన్నాడు. ఆర్డర్ ఇచ్చేశాను వస్తుంది అన్నారు మేడమ్.
బండి ఒక స్టేషన్ దగ్గర ఆగింది.
ఎర్ర జెండాతో రైల్వే స్టేషన్ మాస్టారు.
స్పష్టంగా కనిపిస్తున్న అతని చెక్క బల్ల. బల్ల మీద నాలుగు శ్యాంప్రసాద్ సార్ ఇంటిలో చూసిన రకం ఫోన్లు.
ఒక చేతి భుజం మీద రింగులాంటి వస్తువు ఉంది. చిన్న పిల్లల ఏడుపులు, తప్ప శబ్దం లేదు.
పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన స్టేషన్ అది. రాళ్లకు పసుపు రంగు సున్నం దండిగా వేశారు. స్టేషన్ మాస్టర్ రూమ్ లో పెద్ద క్యారేజ్ నాలుగు డబ్బాలు, వాటిని పట్టుకుని ఉంచే స్టాండులో చెంచా. చూస్తేనే ఆకలి వేసేలా ఉంది ఆయన క్యారేజ్.
నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఆయన తీరు చూస్తే ఇక్కడ ట్రైన్ ఆగడమే కాదు. రోజూ ఆగేట్టు అనిపిస్తుంది కిట్టూ కి.
రెండో వైపు వెళ్లి చూసాడు. రెండు మూడు పట్టాలు ఉన్నాయి. నీలం సున్నం వేసిన స్కూలు బిల్డింగ్ పక్కనే చాలా ఎత్తున్న మామిడి చెట్టు. వరండాలో పిల్లలు రాళ్ళతో ఆడుకుంటున్నారు. కిట్టూ శేషు చక్రి భామా రుక్మిణి ఆడుకున్న రాళ్ల ఆట గుర్తుకువచ్చింది కిట్టూ కి.
జానీ , కిట్టూ కిట్టూ స్టేషన్ పేరు చూడు.
వెళ్ళి చూసాడు.
గోరా డోంగ్రీ. అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.
పోరా డోంగ్రీ అంటే నవోదయలో పెద్ద తిట్టు.
కడుపు చెక్కలయ్యే వరకు నవ్వుకున్నారు.
No comments:
Post a Comment