దాహం
దహన యోగః
దేహం
మరి ఎందుకోసం
దాహం ?
నారీ స్థన భర
నాభీ దేశం
ఎందరికో
వ్యామోహం
పురుష బాహుః
కరిగేటందుకు
దేహం చేసే
కనికట్టు
అతనయినా
ఆమయినా
దేహం చేసే ఈ
మాయాజాలం
శీర్యతః శరీరం
మరి తప్పదెందుకు
అందరికీ
శరాఘాతం ?
A collection of telugu works, poems, parodies, stories and themes.
దాహం
దహన యోగః
దేహం
మరి ఎందుకోసం
దాహం ?
నారీ స్థన భర
నాభీ దేశం
ఎందరికో
వ్యామోహం
పురుష బాహుః
కరిగేటందుకు
దేహం చేసే
కనికట్టు
అతనయినా
ఆమయినా
దేహం చేసే ఈ
మాయాజాలం
శీర్యతః శరీరం
మరి తప్పదెందుకు
అందరికీ
శరాఘాతం ?
రాముడికి ఛార్జ్ షీట్
ఎవరు కొలిచారయ్య
ఈ రాముని
ఏమి చెప్పుకోవాలి
ఈ రాముని
నమ్మిన వారికి
చెంప చెల్లు
చేసే ఈ రాముని
ఎవరు కొలిచారయ్య
ఈ రాముని
ఏమి చెప్పుకోవాలి
ఈ రాముని
నమ్మిన వారికి
చెంప చెల్లు
చేసే ఈ రాముని
మొదటి బాణాన
తాటకి నీ
నీ పట్టుదలకు
నీ తల్లినీ
నీ గొప్ప కోసం
ఆలినీ
నీ సొగసు పొగరికి
కన్యనీ
నీ దోస్తు కోరికకు
తారని బలిచేసినావే
నిన్ను కన్న వారికీ శిక్షే
నిన్ను కోరిన వారికీ శిక్షే
నిన్ను పెళ్లాడిన వారికీ శిక్షే
నీ అంగరక్షణకు తమ్ముడినీ
నీ వంట కోసం సీతని
తోడు తీసుకెళ్ళ
రామ చంద్రా
నీ అంత కరుణ
నా కొద్దు
రామ చంద్రా
అన్న దమ్ములను
బతిమాలి బామాలి
ఒప్పింతు వా
ఒక్కరిని చంపుతువా
రాజ వంశీభవడివి
ముగ్గురు తల్లుల పుత్రుడివి
వరించిన కన్యను
ముక్కు కోసివేతు వా
స్త్రీ మనసును ఒప్పించి
సహనానితో మనసు మార్చలేవా
రామ చంద్రా
నీ ప్రేమ
నాకొద్దు
రామచంద్రా
ముసలి
శబరికి ఏమిచ్చావయ్య
రామ చంద్రా
పోతూ పోతు
ఒక పూరిళ్ళు
కట్టి పోవాలని
అనిపించలేదా
రామ చంద్రా
నీ అంత కరుణ
నా కొద్దు
రామ చంద్రా
కోతులను
ఎలుగుబంట్లన్
జటాయువలన్
ఉడతలు
వాడు కుందువు
రామ చంద్రా
వారికేమీ
చేసావు
రామ చంద్రా
గుప్పెడు కూడేనా
పెట్టావా
వారి నొప్పినేమన్న
తగ్గించావా
రామ చంద్రా
నీ అంత జాలి
నా కొద్ది
రామ చంద్రా
నీ నీడ పడిన
స్త్రీలంతా
ఆంఫట్టు
రామ చంద్రా
పెళ్ళాడి పదిమూడు
ఏళ్లు నీవెంట తిరిగిన
నిండు చూలాలిన్
తగిలి వేసావే
ఎంత స్త్రీ జన
దయామయుడివయ్యా
రామ చంద్రా
నీ అంత స్త్రీ కరుణ
మా కొద్దు
రామ చంద్రా
రామదాసుకెన్ని
సుఖాలు ఇచ్చావే
రామ చంద్రా
నిన్ను నమ్ముకున్న
కబీర్ గాని
తులసీదాసు గాని
మీరాబాయి గాని
వారే వరయి నా
సుఖ పడునా
రామ చంద్రా
నీ అంత దయాగుణం
నా కొద్దు
రామ చంద్రా
మర్యాదకు
మారు పేరు
రామచంద్రా
అది నీ మర్యాద వరకే
పరిమితమ
రామ చంద్రా
తల్లుల, స్త్రీల
భక్తుల, ఉడుతల
కోతులకి
మర్యాద లేదేమి
రామ చంద్రా
నీ అంత దేవుడు
నా కొద్దు రామచంద్రా
పునరపి...
నవోదయ వైకుంఠపురం లో జరిగిన ఘట్టం.
గొంతులో శివుడు గరళం దాచినట్టు. కిట్టు తన పొట్టలో ఒక చేదు నిజాన్ని దాచాడు, అది వాడికి పుట్టుకతో వచ్చిన దోషం. చిన్న పేగు చివరికి 2 అంగుళాల దూరంలో, 2 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది ఒక అవశేషం. అది ఉండేది 100 లో ఇద్దరికి, గాని అది నొప్పి కనిపించేది ఇంకో 200 లో ఇంకొక్కరికి.
ఎప్పుడో సరదాగా ఆడుకునే సమయంలో నో, చదువుకునే మధ్య లోనో , ఒక చిన్న నొప్పి మొదలయ్యేది. అది రాగానే వీడికి చిన్న అనుమానం మొదలయ్యేది. బంగాళాఖాతం లో అల్పపీడనం, వాయుగుండమై, వాయు గుండం తుఫానుగా, తుఫాను పెను తుఫానుగా మారే ట్టు ఒకోసారి అది పూర్తిగా మనిషిని విసిరి పరేసేది. కానీ ఒకడి సారి చెడుమదురు గాలి లా తనంతట తాను పోయేది.
ఎవ్వరితోనూ చెప్పుకోలేని బాధ. చెప్పినా వినే వారికి అర్థం కాని బాధ . బయటికి ఏమి కనిపించదు నొప్పి తార స్తాయికి చేరే వరకు.
నోట్లో నీరు కూడా పోసే ప్రసక్తి లేదు, లాలాజలం కూడా మింగితే బయటి కి వచ్చే బాధ. ఊపిరి తప్ప తీసుకోలేని నొప్పి. కుప్ప కూలేవాడు ఒక చోట.
విశ్వానికి ఒక గడియారం ఉంటే , ఆ గడియారం లోలకం నెమ్మదైనట్టు ఉండేది. ఒక్కో క్షణం యుగం లా గడిచింది.
ఎదురుగా ఉన్న బంగారయ్య, వేరేవాడు గొడవ పడుతున్నారు, ఎవరు సిక్ లీడర్ అని. బంగారయ్య బాప్టిజం పుచ్చుకున్నరోజే నేర్చుకున్నాడు , 'దయగలవారై, కరుణగలవారై', అని. తనే ఒక్కంత భుజం మీద వేసుకుని బయలు దేరాడు సిక్ బే వరకూ. వెనుక ఇంకో ఇద్దరు వెంట పడ్డారు.
వీడికి వారి మాటలు 12 అడుగుల నూతి లోంచి వస్తున్నట్టు వినిపిస్తున్నాయి.
శరాఘాతం అని చదివాడు, లక్ష్మణుడికి బ్రహ్మాస్త్రం తగిలిన విధానం. అలాగే పడి పోయాడు. ఎవరో ఇద్దరు నాగమణి రూమ్ దగ్గరకు తీసు కెళ్ళి బెడ్డు మీద పడేసారు. ఎండ తీవ్రత మొఖం మీదే పడుతుంది. సందడిలో ఎవ్వరూ చూడ లేదు. కదిలే ఓపిక కూడా లేదు. నోరు పిడ్చకట్టి, నాలిక చివర దాకా ఎండిపోయి, నొప్పిగా ఉంది .
మేడం వచ్చారు. మళ్ళీ నొప్పా వీడికి. ఏం మాయ నొప్పి. ఎరా మళ్ళీ నొప్పా అని తనను చూసింది. అంత చిరాకు ఒక్క క్షణంలో పోయింది ఆమెకు. ఎవరు నటిస్తున్నారు ఎవరు నొప్పితో ఉన్నారో చెప్పడం లో ఆమె ఫస్ట్. రోజూ ఆమె చూసే సిక్ పేషెంట్లో ఒకరికి నిజంగా జబ్బు ఉంటే 4 ది అయితే భయం లేక నటనే.
వీడి పరిస్తితి చూసింది. నిజమే బాగా నొప్పిలో ఉన్నాడు. మొఖం మీద పొడి తనం వచ్చేస్తుంది. తడి గుడ్డతో మొఖం కడిగింది, నీడలోకి ఈడ్చి ఆలోచనలో పడింది.
చొక్కా పైకి ఎత్తి చూసింది. ఎరా కక్కు కున్నావా, ఔను. ఏం లేదు కడుపులో, ఔను. ఎంత సేపటినుండి, ఉదయం పీటి . మరి రాలేదు ఏమీ, నిశ్శబ్దం.
స్కూళ్లో వాన్ లేదు ఆరోజు. ఊరికి తీసుకెళ్ళే ఉపాయం లేదు. ఫోన్ చేసే అవకాశం కూడా లేదు.
తనే వీడికి సేవ. అమ్మాని మేడం వచ్చింది, ఆవిడ తనకు రూమ్ మేట్.
ఉదయం బాగున్నాడే , సిల్లీ ఫెలో ఏమయింది. పాపం అని పొట్ట ఒక సారి చూసి ప్రశ్నార్థకం గా చూసింది. గోడకు చేర్చి మందు ఇచ్చారు , ఇచ్చిన క్షణం లో మిస్సైల్ లాగా బయటికి వచ్చేసింది.
విస్తూ పోయారు. ఇది వీడి సంగతి, నెట్టి మీద ఒక దెబ్బ ఎరా ఊసేసేవా అని. కాదు అంటున్నాడు కిట్టు. మళ్ళీ ఒకటి ఇస్తా బయటికి వస్తె తంతాను అని.
రెండో మాత్ర ఇచ్చారు. నోరు తెరవలేదు కిట్టు, మాత్ర బయటికి వచ్చి నోట్లోనే ఉంది. అప్పటికి అర్థం అయ్యింది, తీసే మన్నారు. ఇంకా మాత్ర వేసే ప్రయత్నం ఆపారు.
ఇద్దరూ చేసేది లేక బయటికి వెళ్లిపోయారు. నీరెండ విపరీతం గా ఉంది. గది ఉక్క పోస్తుంది. వేడికి చెమట పడుతుందా, నొప్పికి పడుతుందా చెప్పని స్థితి.
ఎదురుగా నీలగిరి చెట్లు గాలికి ఊగుతున్నాయి. గాలి వాసనకి ఎండిన ముక్కు పుటల్లో ఘాటుగా ఉంది.
ఎవ్వరూ గుర్తు రావటం లేదు. ఆ రోజు పరీక్షకు చదువుకున్నవి ఏమీ గుర్తు లేవు. కాశ్మీర్ ప్రయాణం లో "ఉద్ధంపూర్ గాలి నైట్రస్ ఆక్సైడ్ " అనే పదం తప్ప. ఉద్దంపూరు పదాన్ని మరే మరే అనుకుంటున్నాడు.
రాత్రి పొద్దు పోయింది. ఆశగా వీడికో సం మరోసారి పాలు తెచ్చారు నర్స్ మేడం.
అమ్మాణి అంటుంది 'నాగమణి ఎన్ని సార్లు తెస్తావ్'. ఆ పాత రెండు గ్లాసులు అక్కడే ఉన్నయ్ అని. కొంచెం తాగితే పడుకుంటాడే అంటుంది నర్సు మేడం.
చీకట్లో టార్చ్ పట్టుకుని మెస్ వరకూ పోయింది. గట్టిగా అరుస్తూ అజమాయిషీ చేస్తుంది మెస్ లో ఎవరి మీదో. పాలులో ఏమి కలపవద్దు అన్నానా అని కేకలు పెడుతుంది.
మళ్ళీ వేరేగా స్వచ్చమయిన పాలు వేడి చేయిస్తున్నారు. చీకట్లో ఒక చేత్తో పాలు ఒక చేత్తో టార్చ్ తో నడుచుకుంటూ వచ్చి, వేడి వేడి పాలు తీసుకుంటే తాగుతుందిరా అని కిట్టు బెడ్డు పక్కన పెట్టింది ఆశగా.
మేడం కస్టం చూసి ఒక చుక్క తాగాడు. వెంటనే మళ్ళీ మిస్సైల్ లా బయటకి వచ్చేసింది. వీస్తూ పోయారు వాళ్ళిద్దరూ.
నైట్ గౌన్లు వేసుకుని వీడి పక్కనే బాతాఖానీ వేస్తున్నారు.
మధ్యలో వచ్చి వీడిని చూస్తూనే ఉంది రాత్రంతా మేడమ్. పడుకోరా అని పక్కనే కొంత సేపు కూర్చుంది. పల్స్ చూసింది, నొప్పి ఎక్కువ వస్తే మళ్ళీ లేపు అని.
నాకు చెప్పకుండా చావకు రోయి అని. నవ్వుకుంటూ రూమ్ లోకి వెళ్ళి పోయింది.
వెన్నెల రాత్రులు. ఎదుట ఉన్న దృశ్యం, గాలికి ఊగుతున్న నీలగిరి చెట్లు . పక్కనే చిన్న దారి, దారి మెలిక తిరిగి మెస్ వరకు వెళుతుంది. ఎల్లారావు ఇంకో మనిషి పెద్ద వంట డేక్సాను కడుగుతున్నారు. ఆ రోజుకు చివరికి వారి పని అయినట్టే.
లౌకిక ప్రపంచం వెండి తెర మీద సినిమా లాగా అనిపిస్తుంది. గాలి వీస్తుంటే ఘాటు వాసనకి ఊపిరి తీసుకోవాలి అని గుర్తు కొస్తుంది లేక పోతే ఆపేసే వాడే.
తనకు తెలియకుండా పొట్టలో గుండ్రంగా చుట్టుకున్న పేగు కదిలింది. ఆకాశాన్ని తాకిన బాధలో రీలు కట్టయ్యినప్పుడు
ఎదుట వెండితెర కనిపిస్తుందే అలా ప్రపంచం మొత్తం ఒక రంగస్థలము గా ఒక్క సారి కనిపించింది.
లైట్స్ ఔట్....
కళ్ళు మూత పడ్డాయి. ఎదుట చీకటి. గాలి వేస్తుంద్ ఇంకా. శబ్దం లేదు. తనకు బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ వదిలేసి వచ్చిన భావం. తన ట్రంకు పెట్టి, తువ్వాలు, 521 నంబరు కంచం, పుస్తకాల సంచి, బకెట్ ఒక్కకటి గుర్తు చేసుకుంటూ వదిలి వేస్తున్నాడు మనసులో.
కిరణ్, విరాట్, అంతా వేగంగా వెళ్ళే రైల్లో స్టేషన్ మీద ఉండిపోయిన ప్రయాణికుల్లా దూరం వెళ్తున్నారు.
పెద్ద గుడి గంట కొట్టిన తరువాత వచ్చే శబ్దం మారు మోగుతుంది చెవుల్లో.
ఎప్పుడో వదిలిన ఊరు, ఊర్లో కన్నవారు ఏమో లీలగా గుర్తు కూడా రాని ఆలోచన. వారు కూడా ఒక గుహలోని వెలుతురు చుక్కలాగా దూరం అయిపోయారు.
శరీరం జలాన్ని వదిలేస్తుంది. సిగ్గు అనిపించకుండానే వంటిలొని నీరు బయటకు వచ్చేసింది నోట్లోనుండి , ఇంకా..
ఐదు భూతాలు... జల వాయు అగ్ని భూ ఆకాశం ఒక్కొకటిగా పోతున్నాయి.
ఊపిరి పూర్తి స్థాయి నుండి చిన్న చిరు గాలిలా తగ్గింది. వళ్ళు, అందాకా వెచ్చగా ఉన్న రూమ్ ఇప్పుడు బాగా చలి వేస్తుంది కూడా !
నీట్లో చేపకు నీరు ఎలా ఉంటుందో
తెలియనట్టు, ఊహలో నిరంతరం మునిగి ఉండే మనసుకు ఊహ ఆగితే ఊహ ఏమిటో అర్థం ఔతుంది.
ఆపితేనే తెలుస్తుంది వెలుతురులో సదా ఉన్నామని. ఊహ ఆగింది ఒక క్షణం. నొప్పి పూర్తిగా పోయింది. వేడీ, చలీ పోయాయి. ఆకలి, ఘాటుగా ఉన్న వాసనా పోయాయి.
మది శూన్యం అయి మహా ఆనందం నిండి పోతుంది. తేలికగా గాల్లో తేలినట్టు ఉంది.
వేసవిలో తెల్లటి దుప్పటి కప్పిన నిండు వెన్నల లాంటి చల్లటి వెలుతురు మాత్రం ఉంది.
తృప్తిగా ఉంది.
దీపానికి వెలుతురు నింపే
జ్యోతిర జ్యోతి లో తేలిపోతున్నాడు.
ఒక్క సారిగా కుదుపు, గట్టిగా లెంప దెబ్బలు కొడుతున్నారు, చల్లటి నీరు మొఖం మీద వేసి నోరు తడి చేస్తున్నారు.
ఎత్తి గోడ వాలుగా నిలిపి కదిపి లేరా లేరా ఎదవ ఒక్క నిమిషం బయటి వెళ్తే ఇంతలో ... ఏదో అరుపులు.
మొఖం మీదీ టార్చ్ వేస్తున్నారు.
మళ్ళీ తీవ్రమయిన నొప్పి, ముక్కు పుటల్లో ఘాటు గా వాసన.
కిట్టు నీ లేపుతున్నారు మేడం.
నా చేతిలో చస్తావారా.
కళ్ళు తెరిచాడు.
నొప్పి మళ్ళీ మొదలైంది.
పునరపి మరణం పునరపి జననం.
హాయి (Bliss)
నీవు ఒకరని
నేను ఒకరనీ
విశ్వం ఒకటి అని
దాని లోతులు దోచే
మేధ ఒకటి అనీ
అనుకున్నావా
ఇదే చీకటి వెలుగుల
మధ్య భావాల వైరం
అంతా ఒక్కటే
నీవే విశ్వం
విశ్వం నీవే
నేను నువ్వే
నువ్వే నేను
సత్యం జ్ఞానం
జ్ఞానం అనంతం
అనంతం బ్రహ్మం
నిజమేగా జ్ఞానం
దానికి లేదు కదా
యే హద్దు
హద్దుల్లేని
బ్రహ్మాండం
సత్యం జ్ఞానం
అనంతం బ్రహ్మం
ఎంత హాయి
ఈ జ్ఞానం
Once upon a time…
Once upon a time
there was
a peaceful ocean.
One day,
upon that ocean,
a tender young leaf
came floating down.
After a while,
a tiny raindrop
fell softly
into the leaf.
And there,
inside the little leaf,
the raindrop
became a shimmering dew drop.
Morning arrived.
Warm light
gently filled
the ocean world.
The drop, too,
filled with light.
And with light
came awareness.
The little drop
looked within
and saw
its own reflection.
In that reflection
it saw the leaf,
the distant sun,
the sky, the earth,
trees and meadows,
everything.
As the leaf
drifted peacefully
day after day,
the drop noticed
other leaves too.
Some from mango trees,
some from jasmine vines,
some from wild forest trees.
And in every tender leaf
there shimmered
a drop of consciousness.
A drop in a leaf.
A leaf upon the ocean.
An ocean reflected
inside every drop.
Every day
the drop searched
for another leaf
like its own.
And then,
one day,
it found one.
A tender leaf.
A shining drop within it.
Inside that drop,
its own reflection.
Inside its own reflection,
that other drop again.
Two reflections,
endlessly holding
one another.
The two drops
longed deeply
to come closer.
They came close,
very close,
yet could not
cross beyond
the edges of their leaves.
After many seasons
of longing,
the two drops
finally tied
their little worlds
together,
by gently locking
the stems
of their leaves.
Now together,
they wandered
across the ocean.
One morning,
after a silver rain,
they awoke to see
a third little drop,
a tiny one,
resting beside them
They passed it on
to a fresh new leaf
Days passed.
Nights passed.
Rains arrived,
winds wandered,
rainbows appeared.
The sky, the earth,
the trees, the fields,
all stood witness.
And still
the ocean flowed.
Then one day,
within that great current,
the second drop
was swept away.
the first drop searched
everywhere.
Perhaps, it thought,
its story
was only
a shimmering illusion,
like heat dancing
upon tropical waters.
“This leaf too
will someday fade.
No matter what,
I must see
the oceans depths"
And so,
the drop moved
toward the edge
of the leaf.
It peered into
the abyss,
the vastness
it had feared
all its life.
It saw
its own reflection
inside the ocean,
and the ocean’s reflection
inside itself.
Fear arose.
The drop stepped back.
But morning returned.
Warm awareness
returned again.
Its imagination,
its memories,
all the beautiful scenes
within it,
the sky, the earth,
trees and meadows,
were all reflections
inside itself.
Then,
for the very first time,
in the morning light,
it truly saw
the ocean:
vast, alive,
filled with wondrous consciousness.
The same wonder,
the same light,
light of all lights,
filled the world,
the ocean,
every single drop.
the droplet was the ocean.
The ocean was the driplet.
Not two things,
only one awareness.
The drop’s fear
dissolved.
It came once more
to the edge of the leaf.
And then,
the little drop
rolled
into the ocean.
Awareness
became whole
once again.
And though
no drop remained,
the story lingered
in the breathing ocean,
blissful as eternity.
అనగా అనగా...
ఒక ప్రశాంత
సంద్రం
సంద్రంలో
ఒక రోజు
చిగురాకు
పడింది
ఉండీ ఉండీ
ఒక చినుకు
రాలింది
ఆకులో
అలా చిగురాకులో
చినుకు
బిందువయింది
ఉదయం
ఉజ్వలం
గా వెలుగు
నిండింది
బిందువులో
నిండింది
వెలుగు
వెలుగుతో
చైతన్యం
బిందువు
చూసింది
తనలోని
ప్రతిబింబాన్ని
ప్రతిబింబలో
చిగురాకు
దూరాన
సూరీడు
ఇంకా
నింగీ నేలా
చెట్టూ చేమా
అంతా
అలా రోజూ
హాయిగా
తేలిపోయే
ఆకుకి
కనిపించాయి
వేరే ఆకులు
కొన్ని మామిడి
కొన్ని నేరేడు
కొన్ని తురాయి
అన్నిటిలోనూ
ఒక వెలుగులు
చిమ్మే బిందువు
తన లాంటి
ఆకు కోసం
రోజూ
చూసేది
చినుకు
పోతే పోతే
ఒక రోజు
కనిపించింది
తన లాంటి
చిగురాకు
చిగురాకులో
బిందువు
బిందువు లో
తన ప్రతిరూపం
తన బింబం లో
ఆ బిందువు
ఆ బిందువు లో
తన బింబం
రెండూ దగ్గరకి
వచ్చాయి
రెండు బిందువులు
కలిసే
తాపత్రయం
దగ్గరైతే
అయ్యాయి
కానీ
ఆకు దాటి
వెళ్ళలేదు
నీటి చుక్కలు
ఎన్నో ఎన్నో
తపన ల
తరువాత
రెండూ
తమ మూటికల ను
ముడి వేసాయి
ఇప్పుడు
రెండు కలిసి
తిరిగాయి
సంద్రాన్ని
ఒకరోజు
చినుకుల వాన
తెల్లారి చూస్తే
మూడో
చినుకు
బుల్లి చినుకు
పక్కనే
కలిసి వెతికి
వేరే ఆకులో చేర్చాయి
అలా
కొత్త చిగురాకులో
చిన్ని చినుకు
రోజులు వస్తున్నాయి
రాత్రులు వస్తున్నాయి
వర్షాలు
గాలి వానలు
ఇంద్ర ధనుస్సులు
నింగీ నీలా
చెట్టు చేమ
అలా సాక్షులు
సముద్రం లో నూ
ప్రవాహం
ఆ ప్రవాహంలో
ఒక రోజు
కొట్టుకు పోయింది
రెండో చినుకు
ఎక్కడెక్కడ
అని వెతికింది
బిందువు
అంతా ఒక
ఎండ మావి లాంటి
బ్రాంతి అని
ఆకు పాత
బడుతుంది
తనేమో ఆవిరయి
రోజు రోజుకు
చిన్నబోయింది
ఎలా అయినా
సాగరం లోకి
చూద్దామని
బిందువు
ఆకు చివరకి
వెళ్ళింది
చినుకు
తన బింబం
ఉంది సంద్రం లో
సంద్రం బింబం
తనలో
భయం వేసింది
వెనక్కి వెళ్ళింది
బిందువు
మళ్ళీ ఉదయం
మళ్ళీ వెచ్చని
చైతన్యం
ఊహ నిండా
బిందువు నిండా
నిండిన దృశ్యాలే
చెట్టు చేమ
నింగీ నేలా
ఇవి తనలోని
బింబా లే
సంద్రం లోకి చూసింది
వెలుతురులో
మొదట సారి
సంద్రం నిండా
అద్భుత చైతన్యం
తను సాగరం
సాగరం తను
ఒకటే వస్తువు
చైతన్యం ఒకటే
బిందువు
భయం పోతోంది
ఆకు చివరకు
వచ్చింది
అలా బిందువు
సంద్రం లో
కలిసింది
చైత్యన్యం
మళ్ళీ ఒక్కటి
అయ్యింది
శేషం లేకున్నా
ఈ కధ ఇక్కడి తో
సశేషం
- శశి
హాలీ డే పూరీ డే
మరుసటి రోజు ఆదివారం. కిట్టు, శేషు, చక్రి పూర్తిగా పొద్దు తెల్లవారేక కూడా లేవలేదు. వారమంతా అలసటతో , రోజూ ఉదయం సాయంత్రం పీ. టీ ఎక్సర్సైజులతో అలసి ఆదివారం మాత్రం ఆదమరచి పడుకుంది వారు. ఆ రోజు ఉదయం బెల్లు ఉండేది కాదు.
వీరి బెడ్డు రాజీవ్ హౌస్ లో ఒక మారు మూలాన ఉండేది. వీరికి ఎదురుగా 6వ తరగతి అమ్మాయిల గది. రుక్మిణి, భామ, వందన అక్కడే ఉండేవారు.
వీరిలాగే అలసి సొలసి రుక్మిణీ భామ కూడా లేవలేదు. మొదట లేచింది శేషు. వీరందరిలో కొంత పొగరుగా మాట్లాడటం, ఎదురు తిరగడం వాడి పద్దతి. ఫ్రైడే నాటి వైఫ్ డ్రెస్సులోనే పీ. టీ కి వెళ్ళాడు అదీ డ్రెస్సులోనే సెల్ఫ్ స్టడీ కూడా చేసి అలాగే పడుకున్నాడు.
శేషు గాడు లేచింది ఆకలితో. కళ్ళు నలుపుకున్నాడు. ఆదివారం అని అర్థం అయ్యింది. కిందకు చూశాడు. కొండ బెడ్డు మీద ఆదమరచి కిట్టు, పైన పక్క బెడ్డు మీద చక్రి. వాడి పక్క బెడ్డు మీద విరాట్. అర్థం అయింది సీన్ వీడికి.
కింద బెడ్డు మీద అర చేత్తో కొట్టాడు, లేవరా కిట్టు అని. కిట్టు పడుకోరా అన్నాడు మత్తులో. లేవరా పూరి అయిపోతుంది అన్నాడు గట్టిగా.
అంతే ఒక్కబికిన లేచాడు కిట్టు. ఆదివారం అంటే పూరి. పూరి అంటే ఆదివారం.
స్కూల్ మొత్తం కళ్ళు కాయలు చేసి వెయిట్ చేసే తిండి ... పూరి ... భగోరా...
ఆదివారం పూరీ...
ఆదివారం ఉదయాన్నే ఎల్లా రావ్ లేచి ముద్ద కలుపుతాడు. ఒక 1000 పూరీలు వేడివేడిగా చిన్న పాకలో చేయటం అంటే మాటలా. ఏది తప్పు జరిగినా పెద్ద గొడవే.
ఎల్లా రావ్, ఇంకో ముగ్గురు స్టాఫ్ ఒక్క ఆదివారం కూడా తప్పకుండా సంవత్సరానికి 40 వారాలు, వారానికి 1000 పూరీలు చేసేవారు.
వారికి అసిస్టెంట్ స్టాఫ్ అమ్మాయిలు. ఆదివారం ఉదయాన్నే ఒక పాతిక మంది అమ్మాయిలకు ఇచ్చే ప్రత్యేక మయిన పని పూరి చెయ్యటం. 2 గంటల్లో 1000 పూరీలు అంటే నిమిషానికి 8 పూరీలు వారు రోల్ చెయ్యటం , వాటిని వేడివేడిగా , అత్యంత నైపుణ్యం తో ఫ్రై చేసే వారు స్టాఫ్. ఇది కేవలం చిన్న స్టార్ రూమ్ లాంటి వంటగదిలో అన్ని ఋతువులో చేసే ఎల్లా రావు గొప్ప అని స్కూల్లో అందరికీ తెలిసిన విషయం
10 క్షణాల్లో అందరూ లేచారు, శేషు వంగి చూసాడు గర్ల్ రూమ్ లోకి, పూర్తి పరికిణి గ్లామర్ తో రాత్రి ఎలా పడుకున్నారో రుక్మిణి , భామ వాళ్ళు అలాగే ఉన్నారు. విపరీతంగా ముద్దొస్తున్నారు. ఊళ్ళో వదిలి వచ్చిన అక్కలు చెల్లెళ్లు గుర్తుకొచ్చారు.గట్టిగా తలూపి ఊపి కేక వేశాడు. పూరి కి లెమ్మని.
ఈ బ్యాచ్ బోరింగ్ దగ్గరికి పరుగులు తీశారు. దారిలో రావి చెట్టు దగ్గర చాలా కోలాహలం గానుంది. ఒక 10 మంది సీనియర్ అమ్మాయిలు, గుమిగూడి మ్యూజిక్ సర్ దగ్గర ఏదో చేస్తున్నారు. పక్కనే తలకి టవల్ చుట్టుకుని పెద్ద అన్నయ్యలు ఏదో హావభావాలతో చేస్తున్నారు. దీనికి ఇది సమయం కాదు అని , వేగంగా బోరింగు దగ్గర బ్రష్ అనిపించి ప్లేట్లు పట్టుకుని మెస్ దగ్గరకు చేరారు
అక్కడ ఇంకా లైన్ ఉండటం తో హమ్మయ్య అనుకున్నారు. ఇంకా 20 మంది దాకా లైన్ ఉంది అంటే పూరి మిగిలినట్టే అని రిలాక్స్ అయ్యారు.
ఈ ఆరుగురు తమ తమ పూరీల తో మెస్ లో కూర్చున్నారు. చాలామంది బయట చెట్టు కింద తింటున్నారు. ఎల్లారావు స్వయం గా పెడుతున్నాడు.
ఒక్క పూరినే రెండులా ఎలా తినాలో అందరికీ చెప్తున్నాడు చక్రి. ఒక్కో పొర విడతీసి తింటే ఒక పూరి రెండులా ఉంటుంది అని. నీది గొప్ప బుర్రరా అని మెచ్చుకున్నారు అంతా.
2 పూరీలు 5 నిమిషాల్లో అయిపోయాయి. ఆకలి పోయింది కానీ నాలిక సాటిసిఫై అవ్వలేదు.
చెయ్యాల్సింది ఒక్కటే.
రెండో ట్రిప్.. ...
పరిస్తితి గమనించి అబ్బాయిలందరూ బయలు దేరారు. అబ్బాయి అబ్బాయ్ నాక్కూడా అని అన్నారు రుక్మిణీ భామా
మెల్లగా బయటి వచ్చి. మళ్ళీ లైన్లో చేరారు. సీనియర్స్ మధ్యలో అయితే అనుమానం రాదు అని.
ఎదురుగా ఎల్లా రావు, అసలు రెండో ట్రిప్ వారిని వెంటనే పట్టుకుంటాడు ..
ఇంతలో నర్స్ మేడమ్ వచ్చింది. ఆవిడకి పెత్తనం కదా, ఫుడ్ చెక్ చేస్తున్నా అని ఎల్లారావు మీద పెత్తనం చూపిస్తున్నారు. ఎల్లా రావు కి వళ్ళు మంట ఇన్స్పెక్షన్ అంటే. వచ్చి వండుకో వచ్చు నచ్చక పోతే అని మండి పడుతున్నాడు.
ఈ సందులో వీరికి పూరీలు దొరికాయి. భామ కిట్టు ను చూస్తుంది అసెగా. కిట్టు ఒకటి తీసి పెట్టేసాడు. శేషు గాడు సామ్యవాది సోషలిస్టు కదా వాడు ఒకటి రుక్మిణి కి ఇచ్చాడు. వీరి ప్లాట్లు చూసి ఆరా ముక్క వీరికి వేసారు మిగిలిన ఇద్దరు.
చివరకు తలా అందరికీ పూరి + పూరి ముక్క పంచుకుని తిన్నారు. అలా ఆ రోజు జరిగిపోయింది అల్పాహారం
Poori Day
Sunday mornings at Rajeev House carried a magic of their own. The week’s routine—two rounds of P.T., endless classes, and silent study—left the boys drained. On Sundays, they clung to sleep as though it were a rare and precious treasure.
Kittu, Seshu, and Chakri had not stirred even after dawn had fully broken. The week’s relentless drills of morning and evening P.T. had worn them out; Sunday was their only reprieve, and they clung to it with deep sleep. There was no bell to rouse them that day.
Their beds were tucked into a far corner of Rajeev House. Directly opposite lay the sixth standard girls’ dormitory, where Rukmini, Bhama, Vandana, and Roja slept. Like the boys, they too had sunk into lazy, unbroken slumber.
Seshu, the first to rise, rubbed his eyes in hunger. Of the three, he was the one with a touch of arrogance, the one who spoke sharply and resisted authority. On Friday night, he had simply collapsed on his bed in the very same white P.T. dress he had worn for drill and self-study.
He glanced down. On the lower cot sprawled Kittu, while Chakri dozed above him. Beside Seshu’s own cot slept Virat. The scene made sense to him. He stretched out his hand and smacked the lower bunk.
“Get up, Kittu!” he barked.
Kittu mumbled, “Let me sleep.”
“Get up, or the pooris will be gone!” Seshu announced loudly.
At once Kittu sprang upright. For in the school’s dictionary, Sunday meant one thing: poori. Poori was Sunday, and Sunday was poori.
It was the one breakfast that made every child’s eyes shine with expectation—pooris, golden, puffed, and hot.
On Sunday mornings, Ella Rao would rise at dawn and begin kneading flour. To prepare a thousand pooris in the small, stuffy kitchen was no small feat. If anything went wrong, it could cause a riot. But for years—forty weeks a year—Ella Rao and three other staff never failed. With the help of twenty assistant girls, they rolled the dough with astonishing speed, while the staff fried with precision. It was known all over the school that Ella Rao was a master of this art.
Within ten minutes of Seshu’s warning, everyone was up. Seshu leaned over to peep into the girls’ room. There lay Rukmini and Bhama, still in their night attire, the glamour of sleep making them look as though they were sisters left behind at home. Seshu waved his hand and shouted, “Pooris! Wake up for pooris!”
Soon the boys were running towards the bore pump to brush and wash. By the great Peepal tree, with its wide platform that resembled a village panchayat, there was a commotion: senior girls had gathered around the music master, rehearsing something, while senior boys, with towels tied around their heads, were striking theatrical poses. But the younger boys hurried past—this was no time for distractions. With plates in hand, they marched to the mess.
There was still a line, thank heavens. Some twenty students ahead meant pooris were still left. Relief swept over them.
They received their share and settled in the hall, though many others ate outside under the shade of the Peepal tree. Ella Rao himself stood at the counter, serving.
Chakri, with his quick mind, explained how to make a single poori last like two. “Peel it layer by layer,” he demonstrated. “That way, one becomes two.”
“Genius!” the others declared.
In five minutes, two pooris each had vanished. Hunger subsided, but the tongue remained unsatisfied. There was only one solution: a second trip.
The boys exchanged glances and set out again. Bhama and Rukmini, having finished, whispered, “Bring us too.”
Out they all crept, slipping back into the line. If they stood among the seniors, suspicion would not fall upon them. But Ella Rao had eyes like a hawk—he would certainly catch anyone daring a second helping.
At that moment, the nurse arrived. She was inspecting food as if it were her imperial duty, bossing over Ella Rao, who bristled with resentment. “If you don’t like it, cook it yourself!” he snapped, sparks flying.
In the chaos, the little group managed to secure extra pooris. Bhama’s eyes met Kittu’s; he slyly passed one to her. Seshu, the socialist among them, offered one to Rukmini. The others, seeing this generosity, tore their pooris and shared pieces with one another.
At last, each one had one and half a poori more to savor. And that was how breakfast on that Sunday came to a sweet end.
రోజా...
ఆ రోజు మంచి ఎండ కాస్తుంది. అక్టోబర్ వర్షాలు తగ్గాక నేల బాగా తడినుండి పొడికి మారి, ఎర్ర మట్టి బాగా ఎండకు ఎండిపోతున్న రోజులు అవి. స్కూలు ఆట స్థలం పక్కనే పాకలు వేసి కొత్త తరగతి లో ఆరో క్లాసుని పెట్టారు . టెంపరరీ స్కూల్ ఆవరణ లాగి లాగి 7 ఏళ్లు అలాగే అదే క్యాంపస్ లో ఉంది పోయింది. పూర్వం అక్కడే వియ్యంపేట సమితి ఆఫీసు ఉండేది అంట . ఇలా ఇంచు మించి 450 పిల్లలు ఇంకా 30 టీచర్లు ఉండాల్సిన క్యాంపస్ మాత్రం కానీ కాదు.
పాక లో, రగ్గు మీద కూర్చొని రోజంతా బయటకు మాత్రమే చూసేవాడు కిట్టు. దూరాన జీడి మామిడి చెట్లు, తాటి తోపులు, అప్పుడప్పుడూ పీండ్రిం చూకుంటూ వెళ్ళే ఎర్ర బస్సు చూస్తుంటూ ఉండే వాడు.
దూరాన మెల్లగా వస్తూ కనిపించింది రోజా అక్క. మనసులో అక్కని చూస్తే ఒక ఊరట.
అక్క ఈ సమయంలో వస్తుంది అంటే, సర్క్యులర్ అయ్యి ఉంటాది.
అక్క చేతిలో పుస్తకం ఉంది. అక్క వస్తుంది అంటే ఆయా 12 క్లాసుల్లోని పిల్ల లు అక్కని చూసేవారు. ఒక్కోసారి డిల్లీలో ఎవరో పోతే ఏకంగా 5 రోజులు సెలవులు ఇచ్చేశారు, ఇంకా ఎప్పుడైనా పండుగల సెలబ్రేషన్స్ కి అలా అక్కే సర్కులర్ తెచ్చేది.. అక్క మొఖంలో ఉన్న ముఖ కలవలిక లలో తెలిసిపోతుండేది. ఏది, ఏమిటి, విషయం అని. ముభావంగా వస్తుంది అంటే ఏ పనికిమాలిన ఆఫీసరో వస్తున్నాడు అని, ముసిముసి నవ్వులతో వస్తే మంచి విషయం అని.. అలా...
కిట్టు అక్కని దూరంగా చూసాడు, అక్కకి పాపం ఎంత కష్టం నడవటం అని. అక్క మంచి ముఖ లక్షణాలతో, చిరునవ్వుతో మాట్లాడుతూ ఉండేది. కానీ పాపం పోలియో అనుకుంటా మెక్కుకుంటూ నడిచేది. స్కూళ్లో ఎవరు లేకున్నా రోజు గడుస్తుంది గానీ, అక్క లేకుండా ఒక్క గంట కూడా ముందు వెళ్ళదు.. అక్క బెల్ కొడితే పిల్లల రోజు మొదలవుతుంది, అక్క బెల్లుకే ప్రేయర్, అక్క బెల్లు కీ టిఫిన్ అయినా , లంచ్ అయినా డిన్నర్ అయినా.. అక్క లేకుండా ఆ 500 మంది జీవితం ముందుకు వెళ్ళ లేదు అన్న మాట. ఒక్క రోజు, ఒక్క గంటను కూడా అక్క మర్చి పోయేది కాదు.
రోజక్క ఆ క్యాంపస్ లో ఎక్కడ ఉంటుందో కిట్టూ కి ఎప్పుడూ అర్థం కాలేదు. ఎందుకంటే, ఎవ్వరూ లేకముందే అక్క లేస్తుంది. అందరూ పడుకున్నకే అక్క పడుకుంటుంది. ఉదయం పీటీ మొదటి బెల్లు నుండి రాత్రి చివరి బెల్లు వరకూ అక్క చేతి మీదే..
రోజాక్క కు తెలియని రోజక్కని తెలియని వారు స్కూళ్లో లేదు. ప్రతి బెల్లు అక్క కొట్టాల్సిందే. ప్రతి ఉత్తరం అక్క ఇవ్వాల్సిందే. ప్రతి రోజు 5 కి లేచి తన పని కాకున్నా అక్క మెయిన్ బిల్డింగ్ మెట్లను శుభ్రం చేయ టం చూసాడు కిట్టు. అక్కని అడిగాడు అక్కా నువ్వెందుకు కడుగుతున్నావ్ అని. అక్క అంది మనం ఉన్న ఇల్లులాంటిది కిట్టు ఎవరు కడిగితే ఏమిటి అని.
అక్క ఆ స్కూళ్లో ఉన్న అందరూ పిల్లల మనసులో ఒక ప్రత్యేక స్థానం పొందింది. బెల్ వినిపేస్తే అక్క గుర్తుకు వస్తుంది అందరికీ. అక్కకు ఎవ్వరూ గుడ్ మార్నింగ్ చెప్పేవారు కాదు. కానీ ఎవరి గుడ్ మార్నింగ్ అక్క లేకుండా మొదలయ్యేది కాదు .. ఆ అయిదు వందల మంది జీవితాలను అక్క ఒక్క చేతితో నడిపేది. ఒక రోజు కిట్టూ రోజక్కని అడిగాడు అక్కా నువ్వు ఎప్పుడు పడుంటావ్ అని, అక్క నవ్వి నాకేం పిల్లలు పడుకున్నప్పుడే నేను పడుకోవటం. అలా స్కూల్ పిల్లల దైనందిన జీవితం తో అక్క ముడిపడి ఉంది అని అర్థం చేసుకున్నాడు కిట్టు.
కిట్టు కి ఒక గొప్ప విషయం ఆరోజు పాకలో, దూరంగా వస్తున్న అక్కని చూస్తూ అర్థం అయ్యింది. సేవా భావం ఉన్న చోట శక్తి , పాపులార్టీ ఉంటుందని... ఈ రాజకీయ నాయకులు పవర్ కోసం పడే కుక్క పాట్లు మాని సేవా భావం నేర్చుకుంటే ప్రజాభిమానం దానికదే వస్తుంది అని. రోజా అక్క నిస్వార్థంగా రోజూ చేసే సేవే కదా తనకి ఇంత అభిమానాన్ని ఇస్తుంది అని.
మొత్తం మీద రోజా , 6A చేరుకుంది.. ఆ స్కూల్ మొత్తానికి అదే జూనియర్ మోస్ట్ సెక్షన్..
అక్క పాక ద్వారం వద్ద అనుకుని నిలబడింది. నవోదయలో చేరాక కిట్టు నేర్చుకున్న మొదటి పాఠాల్లో ఒకటి అనుమతి తీసుకుని లోపలికి రావటం. ప్రిన్సిపాల్ కోటి అయినా రోజక్క అయినా అడిగి రావలసిందే.
అక్కా అక్కా అని అందరూ పిలవడం మొదలు పెట్టారు . గేదెల అప్పారావు ఆరోజు మాంచి ఊపులో ఉత్తరమరికా నైసర్గిక స్వరూపాలు చెప్తున్నారు.
రోజాను చూసారు. ఒక్కసారి ఆపి అమ్మా రోజా రా అని ఆప్యాయంగా లోపలికి రమ్మన్నారు. కూర్చో మంచి ఎండలో వచ్చావ్ అని కుర్చీ లాగారు. అక్క సిగ్గు పడుతుని లేదు సార్ అయిపోయింది మీరే లాస్ట్ అని.
పిల్లలు అక్కని చూసి అక్కా అక్కా అని పిలుస్తున్నారు. సార్ చదివారు, ఒహో అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చి . ఓ చేద్దాం అన్నారు.
అక్కని ఎప్పుడొచ్చింది ఇది అని అడిగితే అక్క ఒక్క గంట అయ్యింది సార్. ఫోను కూడా, డిల్లీ నుండి అని....
కిట్టూ కి పిల్లలకి ఉత్సుహత విపరీతం గా పెరిగింది.
సర్కులర్ లో ఏముంది, డిల్లీ నుండి ఫోన్ ఏమిటి, పిన్సిపాల్ కోటిగాడికి డిల్లీ నుండి ఎవరు ఫోన్ చేసారు....
ఇంతలో మిత్రమా విరగ తీద్దాం అంటూ తెలుగు సార్, మ్యూజిక్ సార్, 6A లోకి వచ్చేశారు..
నీటి మడుగులు
మహా వనంలో
నీటి మడుగులు
మబ్బుల చాటున
కోరికల సుగంధ
వనఛాయల్లో నీటి
తామరాకుల పందిరి
మాటున
వెన్నెల్లో మురిసి
వానకి తడిసి
ఎండకు జడిసి
కష్టమొస్తే
క్షణమొక యుగంగా
సుఖమొస్తే
యుగమొక క్షణంగా
వసంత గ్రీష్మ వర్ష
శరదృ శీతకాల
మాయా జీవన చక్ర
బందీలు ఈ
నీటి బుగ్గలు
అనగా అనగా
ఒక రోజు
కాదు కాదు
ఒకానొక
కాల చక్ర క్షణంలో
సత్సాంగత్యం ఫలిస్తే
అనుబంధాల మబ్బులు వీడాక
మోహపు మంచు తెర లేచాక
కోరికల తామరాకుల
పందిరి తొలగి
ప్రశాంత ఏకాంత నిశ్చల
సరస్సులో
అదిగో
అవుతూ ఉంది
సూర్యోదయం
నమ్మలేకున్నా
నీ రూపాన్ని
నీ కాటుక కన్నుల
ఈ మంత్ర జాలాన్ని
నమ్మలేకున్నా
హిమశిఖిరి
జారే జలపాతాల
కురుల అలలు
నీ చంపల వాలి
జలతారులయిన
సొగసును మెచ్చే
పదం ఇంకా
తెలుగునాట
పుట్టలేదని
నమ్మలేకున్నా
రాగిణీ
నడుమొంపుల్లో
కొండ జాజుల
సుగంధాన్ని
నమ్మలేకున్నా
రాత్రి నెలవంక
అస్తమించాక
విస్తారంగా
పచ్చిక
బయల్లలో
నీ కురుల
కృష్ణశ్వాలు
పరిచిన చిక్కటి
నల్ల దుప్పటి
నమ్మలేకున్నా
కొండ లోయల్లో
తెల్లటి తొలి భాను రేఖ
పొడిచే ముందు
నిద్ర లేచే ముందటి
నీ కనురెప్పల
మొదటి చూపు
అందాన్ని
నమ్మలేకున్నా
Peep Chirp and Quack with two birds
రుక్మిణీ కిట్టు గాడి బెడ్డు మీద కోర్చొని, కిట్టూ నన్నూ మీ గ్రూప్లో తీసుకో అని అదిగింది.
కిట్టూ ఇందులో అబ్బాయిలు మాత్రమే అన్నాడు. రుక్మిణీ, భామకు ముక్కు పుటాలకు కొపం వచ్చింది.
కారణం చెప్పమన్నారు. కిట్టూ మెల్లగా అన్నాడు, ఆడ పిల్లల దగ్గర ఆడ కంపు వస్తుంది అని.
అగ్ని పర్వతమం బద్దలయ్యింది.
రుక్మిణి అమాంతం కిట్టు కింద తోసి మీద పడింది. గోల్లుతో గిల్లింది. బుగ్గల మీద రక్కింది. భామ పీక మీద కూర్చుంది, గుండెల మీద గట్టిగా గుద్దింది.
కిట్టు చక్రి శేషు లను పిల్చాడు. హెల్ప్ హెల్ప్ అని.
తమ తమ చెల్లల్లతో బాగ అనుభవం ఉన్న ఇద్దరూ దూరంగా ఉండి పోయారు.
రుక్మిణీ, భామ మల్లీ అడిగారు గ్రూప్లో తీసుకో అని.
మీ దగ్గర ఆడ వాసన పోతే అన్నాడు.
రుక్మిణీ, భామ, చక్రి శేషుని చూస్తూ మీకు అక్కా చెల్లెల్లు లేరా, సిగ్గు లజ్జా రాదా అని తిట్టారు.
చక్రి వెంటనే పోనీ ఒప్పుకోరా కిట్టు అన్నాడు.
కిట్టు పొరా బోకా అనేలోపే, చక్రి కిట్టుకి కిత కితలు మొదలు పెట్టాడు.
అన్ని దెబ్బలకు మారని కిట్టు, ఇంక వప్పుకోక తప్ప లేదు.
ఆలా, Peep Chirp and Quack లకు parrot and sparrow కలిసారు.
నో పేరెంట్స్ డే
ఆ రోజు తల్లిదండ్రులు వచ్చే రోజు. వీల్లకి ఇదే మొదటి పేరెంట్స్ డే. పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. ఎప్పుడో ఒక సారి స్నానం చెసే రవి కూడా తెల్లారే తయారు అయ్యాడు. పేరెంట్స్ వస్తారు అడుగుతారు అని మంచి భోజనం పెట్టడం కూడా మొదలు పెట్టారు మెస్సులో.
కిట్టూ ఉదయం లేచి తొందరగా తయారు అయ్యి రావి చెట్టు కింద చేరాడు. అమ్మ యే చీర కట్టుకుని వస్తుంది, నాన్న నాకోసం ఏమయినా బొమ్మ తెస్తారా అని బాగా కుతూహలంగా ఉన్నాడు. టిఫిన్ బెల్లు కొడితే ఓస్ ఇదొక తిండా ఒక గంటలో అమ్మ తినిపిస్తుంది అని ఉండిపోయాడు.
మొదటి బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నారు కొందరు పెద్దవాళ్ళు. కిట్టూ ముందుకే పరుగెత్తి వెళ్ళాడు, అమ్మలా ఒక చీర ఉంది, చీ కాదు. సరే ఇంకా చూసాడు. అందరూ వచ్చేశారు. వీళ్ళల్లో లేరు. సరే ఫస్ట్ బస్ కదా అని బోరింగ్ దగ్గర నీళ్ళు తాగి అక్కడే కూర్చున్నాడు.
ఇష్టం అయిన ఆంజనేయున్ని మొక్కాడు. తరువాతి బస్సులో అమ్మానాన్నా రావాలి అని. రెండో బస్సు వచ్చింది. చాలా వెతికాడు 10 దాటింది, పేరెంట్స్ కనిపించలేదు. ఎవరెవరికో వచ్చేశారు. గొంతులో గరగర బాగా రోడ్డు మీదకు వచ్చి చూస్తున్నాడు.
ఆంజనేయుడు రాముడికి మాత్రమే ఏమో అని. ఇప్పుడు వినాయకుడికి మొక్కుతున్నాడు. 12 దాటింది. మూడో బస్సులో ఒక పెద్ద ఆయన వచ్చి బాబూ చాలా urgent పనిమీద మీ పేరెంట్స్ ఊరు వెళ్ళారు నీకు ఇమ్మని biscuits ఇచ్చారు అని. తీసుకున్నాడు, భూమి గుండ్రంగా ఉండి తిరుగుతుంది అని చదివాడు గానీ అప్పుడు మాత్రం కళ్ళ చుట్టూ భూమి తిరిగినట్టు అనిపించింది. విశ్వం ఎంత పెద్దదో క్లాసులో విన్నాడు గానీ ఆరోజు అనంత విశ్వం లో ఒక్కడూ ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది.
దేవుల్లను అబ్బనా బూతులు తిట్టి, జీడి చెట్టు కింద చేరాడు ఆకాశంలోకి చూస్తూ.
ఇంక ఈ సింధు కాలం నాటి దెవతలను మాని మొసెస్, జీసస్ వయిపు మారి పోదాం అని గట్టిగా అనుకున్నాడు.
ఏకాంతం మాత్రం తెలిసిన కిట్టూ కి ఒంటరితనం మొదటిసారి అనిపించింది.
ఆకాశం కప్పేటట్టు నీటి పొర కల్లల్లోకి. నేను పుట్టముందే నీలి పొర… అని ఏదో గుర్తొస్తుంది.
బిస్కెట్ ప్యాకెట్ మీద కాగితం పయిన నాన్న రాసిన దస్తూరి మళ్ళీ మళ్ళీ చదివాడు. ఆకాశం వంక చూస్తూ ఒక ముక్క నోట్లో పెట్టాడు…. గొంతు పిసికినంత ఉక్కిరి బిక్కిరయ్యాడు.
దగ్గర్లో అలికిడి అయ్యింది. చూస్తే చక్రి, శేషు . క్రోధం ..
ఏరా ఇక్కడేం దొబ్బుతున్నారు అన్నాడు. కోపం గా. దగ్గరికి వస్తే కొట్టేలా.
ఓ నీకూ రాలేదా అన్నాడు చక్రి.
లేదు అన్నాడు.
మీకు..
లేదు అన్నారు ఇద్దరూ.
ఎందుకు…. మళ్ళీ మిల్లు మూసేశారు మా ఊర్లో ఎవరికీ పేరెంట్స్ రాలేదు అన్నారు.
అర్థం అయ్యింది. పాపం అని Biscuits ఇచ్చాడు. నువ్వు తినరా నాకొద్దు అన్నాడు చక్రి, నాకూ వద్దు అన్నాడు శేషు.
నిశ్శెబ్దం.
మీకు peep chirp duck తెలుసా అన్నాడు కిట్టు. తెలీదు అన్నారు. peep ఒక Kodi పిల్ల, దారి తప్పడి oka soup డబ్బాలో ఉంటుంది. Chirp oka ఎర్ర పక్షి , duck ఒక బాతు. వీళ్ళు అందరూ అనాథలే కానీ ఈ మూడు పక్షులు కలిసి బిగ్ wide world చూస్తాయి. మనం అనాథలు కాదు కానీ ప్రస్తుతానికి అయినట్టే.
చక్రి శేషు కి కిట్టుగాడి కథ , ఆ example నచ్చాయి.
Peep chirp & duck అనే వీరి గ్రూప్ అలా మొదలయ్యింది. సరే ఒక పని చేద్దాం అన్నాడు శేషు. వాక్కో అన్నాడు చక్రి.
సరే బిగ్ world ఎక్కడ ఉంది అన్నాడు శేషు.
మన స్కూల్ వెనకాల మామిడి తోట ఉందా ఉంది. గానీ మామిడి కాయలు పూసి 6 నెల్లు అయ్యింది రా ఫూల్ అన్నాడు. ఆగు ఇంక ముందుకు వెళ్తే ఒక కల్లు పాక వుంది. ఔను. అన్నారు
స్కూల్ వెనుకాల మామిడి తోట లోకి పోదాం , చక్రీ గాడు నీకు బుర్ర లేదురా కిట్టు అక్టోబర్ లో మామిడి తోటలో టెప్పి తోటకూర తప్పి ఉండవు.
కిట్టూ డియర్ చక్రి హహహ. నేను చూపించ పోయేది , కల్ల పాక. కల్ల పాకలో పునుకులు ఎప్పుడయినా తిన్నారా అన్నాడు. లేదు అని అన్నారు ఇద్దరూ. ఓకే follow me.
ఒక బకెట్ లో నీరు, ఒక చంబు , ఒక బాటిల్ పట్టుకున్నారు ఎవరయినా అడిగితే ప్రకృతి పిలిచింది అని చెప్పడానికి.
కల్ల పాక దగ్గరకు వచ్చారు, డబ్బుల్లేవు అన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చింది
మామ్మా కొంచెం ఏమయినా పెడతావా అని అడిగాడు. మామ్మ చూసింది ఆ కొంచెం నీళ్ళు ఇస్తారా అన్నది. ఓ ఇంకా కావాలంటే ఇంకా తెస్తాం అన్నాడు. మామ్మకు ముచ్చట వేసింది, తల నిమిరి, అందరికీ తలో కారపు పునుకు ఇచ్చింది. వీళ్ళకు వెంటనే నాలిక మంటలు... మామ్మా కాలిపోతుంది అన్నారు. మామ్మ చెరో ముంతా కల్లు పోసింది, అదే కారం గొడవలో ముగ్గురూ తాగేశారు.
కాసేపటికి కొంచెం ఎక్కింది, మామ్మ పిల్లలు తాగొచ్చా అన్నారు. మరి ఈకాలం మాబోటోల్లు ఏం తిని బతకాలి అన్నది.
కిట్టు శేషు చక్రి తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. ప్రకృతి అద్భుతం అనిపిస్తుంది. అకాశం గొడుగు వెస్తే, మేఘాల్లో తెలినట్టు ఉంది. దమ్ముంటే కాస్కో, చాలెంజే చేస్కో… అని గట్టిగా పాడుతూ వస్తున్నారు.
దారికి ఇంకో చిన్న చెట్టుకు కల్లు ముంత కట్టి ఉంది. చక్రి గాడు బాగా ఆకలేస్తుంది రా అని చెట్టెక్కి కిందకు లాగాడు. అది చేతిలోకి వచ్చేసింది. ముగ్గురు మళ్ళీ తాగారు. ముంత పైకి కట్టమని శేషు గాడికి చెప్పారు, శేషు వీరి ముగ్గురిలో ఇంకా బలహీనం. కట్టబోతూ, కింద పడ్డాడు. ముంత పగిలింది వీడి ముడ్డి కూడా పగిలింది.
ముగ్గురు ఇంకా వల్లకాదు అని రాజీవ్ హౌస్ చేరి బోర్లా పడి పడుకున్నారు.
సాయంత్రం వేళ అవుతుంది, కేవలం గోచి కట్టుకుని ఒక ముసిలోడు మెస్సు దగ్గరకు వచ్చేసాడు, తాగి ఉన్నాడు
మీ పెద్దాయన్ని తోలమని అరుస్తున్నాడుబాగా కేకలు పెడుతున్నాడు. ఆంధ్ర భాషలో ఎన్నెన్ని అవయాలు కలిపి తిట్టొచ్చో ఆరోజు తెలిసింది పిల్లలకు.
వాడి తిట్లు వినడానికి పిల్లలు కిటికీల దగ్గరికి వచ్చి గొల్లు గొల్లు గా నవ్వుతున్నారు.
కోటిగాడు (అదే గౌరవనీయులయిన ప్రింసిపల్) వచ్చాడు.
ఏం కావాలి అన్నాడు. మీ కుర్రాళ్ళు ముగ్గురు. నాకల్ల ముంత పగల గొట్టారు.
డబ్బులు ఇప్పించండి వెళ్ళిపోతాను అంటున్నారు.
కోటేశ్వరరావు కి కోపం భూకంపం వచ్చినంత వేగంగా వచ్చింది.
నేనివ్వను అన్నాడు.
గోచి కట్టుకొని ప్రింసిపల్ వెనకాలే వెళ్ళాడు ఆసామి.
ప్రింసిపల్ chamber ముందే కూర్చొని నానా తిట్లు తిడుతున్నాడు.
పిల్లలు గుమి కూడి బాగా నవ్వుతున్నారు. కోటి గాడికి కోపానికి తగిన ఆసామి దొరికాడు అని. కోటి ఇంకా తప్పక వచ్చి 5 రూపాయల 50 పైసలు ఇచ్చి పంపించాడు.
డిన్నర్ టయిమ్ అయ్యాక లేచారు ముగ్గురూ.
వీళ్ళ కంపు కేవలం అరో తరగతి చిన్న గదిలో ఉన్న అమ్మాయిలకు మాత్రమూ తెలిసింది.
వీళ్ళు లేచే సమయానికి, రుక్మిణీ, భామా నడుం మీద చెయ్యి వేసుకుని ముందరికి వచ్చారు.
అబ్బాయిలు మీరు తాగొస్తే మంచి మాట కాదు, అంది రుక్మిణీ. ఇది respectable లేడీస్ ఉండే చోటు, భామ తొక్క తీస్తాను అన్నాది. తాగి వచ్చి రాత్రి పూట అమ్మా అయ్యా అని ఏడిస్తే మేము వచ్చి ఓదార్చమని, డొక్కలో తంతామని చెప్పారు. వాళ్ళ కోపానికి ఈ ముగ్గురి మత్తు దిగింది.
ఒక్క క్షణంలో ముగ్గురూ కాళ్ళ మీద పడ్డారు. రుక్మిణీ వెల్లిపోబోయింది. కిట్టూ అలవాటుగా, చనువుగా నడుము పట్టుకున్నాడు ఆపడానికి. గెడ్డం పట్టుకున్నారు. తాగీసి ముట్టుకుంటే రక్కుతామన్నారు.
వీల్లు చివరకి కావాలంటే బట్టలు ఉతుకుతాము అని ఒప్పుకున్నారు. జన్మలో తాగమని ఒట్టులు వేసారు. వారు బతిమిలాడుకుంటుండగానే నైట్ బెల్ మోగింది. పేరెంట్స్ రాని పేరెంట్స్ డే ఆలా సుఖాంతం అయ్యింది. కథ కంచికి.....
దొరికిందో తెల్ల కాగితం
మడతపెట్టని కత్తి పడవో
రాయని సెలవు చీటీయో
బాల్యాన్ని అడగాలి
వీళ్ళ బ్యాచ్ చాలా లేటుగా జాయిన్ అయ్యారు ఆ సంవత్సరం. 26 సెప్టెంబర్ లో జాయిన్ అయిన బ్యాచ్ కు , గాంధీ జయంతి మొదటి అనుభవం. స్కూల్ నిండా హడావిడి గా వ్యక్తృత్వ పోటీలు, ఇంగ్లీష్ లో ఎలక్యూషన్, debate, వ్యాస రచన పోటీలు పెట్టారు.
కొత్త కదా 6వ తరగతి నుండి ఎవ్వరూ వెళ్ళలేదు. భయం కొంత ఆ ఇంగ్లీష్ గ్రామర్ కొంత తెలీక. ఒకరిద్దరు బొబ్బిలి వాళ్ళు వ్రాశారు ఎస్సేలు.
ఆ రోజు ఒకో తరగతి నుండి dias మీదకు వచ్చి గాంధీ గురించి చెప్పమన్నారు.
పెద్ద క్లాస్ వాళ్ళు హుందాగా వచ్చి ఫ్యాట్ ఫ్యాట్ మంటూ చెప్పి దిగి పోయారు.
6త క్లాస్ వంతు వచ్చింది. అడిగారు స్టేజ్ మీంచి. కేవలం కిట్టు పేరు విన్నారు కదా. కిట్టు వచ్చి చెప్పు అన్నారు తెలుగు మేడం.
కిట్టూ ఉస్సూరు మంటూ ఎక్కాడు.
మైక్ కి అందలేదు, కిందకు వంచారు
కిట్టు ఎడం వయిపు చూసాడు, మళ్ళీ కూడి వయిపు చూసాడు.
LOVE అన్నాడు బిగ్గరగా మైక్ లోకి. బాగా పెద్ద రీసౌండ్ వచ్చింది. ఆ మాట అనకూడదేమో అనిపించినా, గబుక్కున మాట్లాడట0 మొదలు పెట్టాడు.
Stage మీద ఉన్న టీచర్లు మెరుపు పడిన తాటి చెట్ల లా స్తంబాలు అయ్యారు.
తెలుగులో చెప్పు అని మాస్టారు అన్నారు.
ప్రేమ అంటే కరుణ. అహింస అంటే అన్నివేళలా కరుణ చూపటం. అంటే ప్రేమించటమే అహింస.
అని చటాలున దిగిపోయాడు.
......
కొన్ని క్షణాలు ఒక పిన్ను పడినా వినిపించే నిస్సెబ్దం. తెలుగు చెప్పే సంస్కృత సార్ పెద్దగా చేతులుచాపి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఆయన వెనుకాల ఒక్కొకరుగా అంద రు ఫ్యాకల్టీ కొట్టారు.
కోటిగాడు కోటి రూపాయల లాటరీ దొరికినట్టు. hahahahaha ani పెద్దగా నవ్వాడు. తెలుగు సార్ మీరు చెప్పండి కిట్టు ఏమన్నదీ అని.
మాస్టారు వచ్చి అర్థం అయ్యిందా కిట్టు అన్న మాటలు అని అడిగారు. ఇంచు మించు అందరూ లేదు సార్ అన్నారు.
కిట్టు గాంధీ సారం మొత్తం మూడు ముక్కల్లో చెప్పేశాడు. ప్రేమ అనే గుణం ఉంటే అహింస తనకు తానుగా వస్తుంది అని. ఎన్నో ఏళ్లు గాంధీ నీ చదివిన వాళ్ళు కూడా చెప్పలేం అలాంటిది ఆశువుగా చెప్పాడు కిట్టూ. అవేశం గా మన నవోదయ కు దేవుడిచ్చిన వరం కిట్టు this is really special అన్నారు sir.
కిట్టూ కి తను అంత గొప్పగా ఏం చెప్పేశాను అని అర్థం కాలేదు. మళ్ళీ చెప్పమంటే అదే చెప్తాను అని guarantee కూడా లేదు.
కిట్టూ లైన్లో వెళ్తుంటే, ఒక అయిదున్నర అడుగుల అమ్మాయి, మల్లె పువ్వు చున్నీ, సమ్పంగి పువ్వు లాంటి నవ్వుతో దగ్గరకి వచ్చింది.
చిరంజీవి సినిమా గాంగ్లీడర్ లో విజయశాంతి లా అనిపించింది కిట్టు గాడికి, వెనుకనే ఇంకా ఎత్తుగా ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో కాంతితో ఇంకో అబ్బాయి. సినిమా జంట లాగా ఇద్దరూ దగ్గరికి వచ్చారు.
బిందు కిందకు మోకాలి మీద కూర్చుని తమ్ముడు నీ మూడు ముక్కలతో బాగా చెప్పావు స్పీచ్. అని బుగ్గమీద ఏక బిక ముద్దు పెట్టింది, బుగ్గలు గట్టిగా చిదిమి0ది. చివరిగా తనకు తల్లి దగ్గర దొరికిన అనుభూతి మళ్ళీ ఇక్కడ. అరవింద్ అంట గొప్ప స్టూడెంట్ అంట తను వచ్చాడు, సూపర్ తమ్ముడు అని వీపు మీద చరిచి, నీకు గోపాల్ తో కలుపుతాను నీకు వాడికి సరిపోతుంది అని చెయ్యి పట్టుకొని క్లాసులోకి తీసుకు పోయాడు. సీనియర్ క్లాసులో కిట్టు ఒక సంచలనం. అందరూ రావడం వీడు నెక్స్ట్ జవహర్ అనొ అరవింద్ అనో, గోపాల్ అనో అనడం, వీడు తెలీక నవ్వడం. ఒక అర గంట పోయాక 6 తరగతి దగ్గర వదిలే సారు. అలా ఇంకో వారం జరిగిపోయింది.